Scam: రూ. 21 కోట్లు స్కామ్ చేసిన కూరగాయల వ్యాపారి..

Scam: నేటి రోజుల్లో స్కామ్స్ (Scams) సర్వసాధారణం అయిపోయాయి. ఇన్ని రోజులు కేవలం కేటుగాళ్లు మాత్రమే స్కామ్(Scams)  లు చేస్తారని అంతా అనుకునే వారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అమాయకులు కూడా అమాయకులను చాలా ఈజీగా మోసం చేస్తున్నారు. కేవలం అమాయకులను అనే కాకుండా బాగా చదువకున్న వాళ్లను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ స్కామర్స్(Scammers)  రోజురోజుకూ తమ దారులు మార్చుకుంటూనే ఉన్నారు. ఈ స్కామ్స్(Scams)  గురించి పోలీసులు(Police) ఎంతలా అవగాహన కల్పించినా కానీ ఎక్కడో […]

Share:

Scam: నేటి రోజుల్లో స్కామ్స్ (Scams) సర్వసాధారణం అయిపోయాయి. ఇన్ని రోజులు కేవలం కేటుగాళ్లు మాత్రమే స్కామ్(Scams)  లు చేస్తారని అంతా అనుకునే వారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అమాయకులు కూడా అమాయకులను చాలా ఈజీగా మోసం చేస్తున్నారు. కేవలం అమాయకులను అనే కాకుండా బాగా చదువకున్న వాళ్లను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ స్కామర్స్(Scammers)  రోజురోజుకూ తమ దారులు మార్చుకుంటూనే ఉన్నారు. ఈ స్కామ్స్(Scams)  గురించి పోలీసులు(Police) ఎంతలా అవగాహన కల్పించినా కానీ ఎక్కడో ఓ చోట స్కామర్స్ రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేస్తూనే ఉన్నారు. స్కామ్స్ చేసే వారు ఏదో కంప్యూటర్లు (Computers), ల్యాప్ టాప్లు పట్టుకుని టిప్ టాప్ గా ఉంటారనుకోవడం చాలా తప్పు. ఏమీ లేకుండా ఉండే వారు కూడా మోసాలు చేస్తున్నారు. 

రూ. 21 కోట్లు కొల్లగొట్టిన కూరగాయల వ్యాపారి

మోసం చేసే వారు కేవలం మధ్య తరగతి వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బాగా సంపాదించిన వ్యక్తులే ఇలా మోసాలు (Scams)  చేస్తారని అనుకోవడం పొరపాటు అవుతుంది. ఓ చోట కూరగాయల వ్యాపారం (Vegetable Business) చేసుకునే వ్యక్తి రూ. 21 కోట్లు మోసం(Scams)  చేశాడు. మళ్లీ ఇతడు మోసగించింది… ఎవరినో అనుకోవద్దు వర్క్ ఫ్రం హోం జాబ్స్ అని చెప్పి.. అంతో ఇంతో చదువుకున్నోళ్లనే ఇతగాడు బురిడీ కొట్టించాడు. ఈ ఘోరం ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల కూరగాయల వ్యాపారి రిషబ్ శర్మ, నకిలీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌ తో ఇతరులను మోసం చేసి రూ. 21 కోట్లు సంపాదించాడు. కానీ కొన్ని రోజులకు అతడి పాపం పండడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు విని..  అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. 

ఏకంగా 10 రాష్ట్రాల్లో కేసులు

కూరగాయల వ్యాపారి (Vegetable Vendor) రిషభ్ వర్మ మీద దాదాపు 10 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ 10 రాష్ట్రాల్లో (10 States) దాదాపు 37 కేసుల్లో అతడి హస్తం ఉందని పోలీసులు తెలిపారు. ఇది మాత్రమే కాకుండా 855 ఇతర కేసులలో కూడా అతను పాత్ర పోషించాడు. ఉత్తరాఖండ్ పోలీసు అధికారి అంకుష్ మిశ్రా మాట్లాడుతూ..కొన్ని సంవత్సరాల క్రితం, అతను ఫరీదాబాద్‌ లో కూరగాయలు మరియు పండ్లు అమ్మేవాడని తెలిపాడు. ఇతర వ్యాపారవేత్తల మాదిరిగానే, అతను మహమ్మారి సమయంలో భారీ నష్టాలను చవిచూశాడని అందుకోసమే ఈ దారిని ఎంచుకున్నట్లు వివరించాడు. అతడు కోవిడ్ దెబ్బతో అతని వ్యాపారాన్ని మూశేశాడని అతడి కుటుంబాన్ని సాకేందుకు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.  కేవలం అతడు ఒక్కడు మాత్రమే కాకుండా అతడి పాత స్నేహితుడితో కలిసి ఈ మోసాలు చేసినట్లు వెల్లడించాడు. వారు దాదాపు ఆరు నెలల్లోనే రూ. 21 కోట్లు (21 Crores) సంపాదించినట్లు వెల్లడించాడు. 

నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి.. 

ఈ నిందితులిద్దరూ ఓ నకిలీ వెబ్ సైట్ (Fake Website) ను క్రియేట్ చేసి అమాయకుల వద్ద నుంచి డబ్బులు కాజేశారు. మారియట్ బోన్వాయ్ (marriotwork.com) అనే నకిలీ వెబ్‌ సైట్‌ ను నడుపుతూ వీరు ఈ మోసాలకు పాల్పడ్డారు. Marriot.com అనే పేరుతో ప్రఖ్యాత హోటల్ (Hotel) చైన్ వెబ్ సైట్ ఒకటి ఉంటుంది. వీరు ఏర్పాటు చేసిన నకిలీ వెబ్ సైట్ దానిని పోలే ఉంటుంది. హోటల్స్ కు రివ్యూలు రాసే పార్ట్ టైమ్ జాబ్ అని చెప్పి వేలకు వేలు కట్టించుకుంటూ వారికి కుచ్చుటోపీ పెడుతున్నారు. వారి పాపం బయటపడడంతో చివరికి పోలీసులకు విషయం తెలిసి వారిని అరెస్ట్ చేశారు. వీరు కేవలం చదువుకున్న వారిని అని మాత్రమే కాకుండా హోమ్ మేకర్స్ ను కూడా టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డారు. ప్రతి సారి కస్టమర్ల నుంచి అందినకాడికి దోచుకుంటూ మోసాలు చేశారు. చివరికి పోలీసులకు (Police) చిక్కారు.