వారణాసి క్రికెట్ స్టేడియం విశేషాలు

భారతదేశంలో క్రికెట్ అంటే ఇష్టపడని అభిమాని ఉండరు. దేశంలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజే వేరు. ఎన్నో స్టేడియంలలో క్రికెట్ ఆటగాళ్లు తమ సత్తా చాటి ఇతర దేశాల మీద ఆడి గెలిచిన రోజులెన్నో. ఇప్పుడు క్రికెట్ ని మరింత విస్తరింప చేసేందుకు, దేశం తన వైపు నుంచి ప్రోత్సహిస్తూ, మరొక స్టేడియంని అందిస్తోంది. వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియం ప్రారంభించి భూమి పూజ నిర్వహించారు మోదీ.  వారణాసి క్రికెట్ స్టేడియం విశేషాలు:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

Share:

భారతదేశంలో క్రికెట్ అంటే ఇష్టపడని అభిమాని ఉండరు. దేశంలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజే వేరు. ఎన్నో స్టేడియంలలో క్రికెట్ ఆటగాళ్లు తమ సత్తా చాటి ఇతర దేశాల మీద ఆడి గెలిచిన రోజులెన్నో. ఇప్పుడు క్రికెట్ ని మరింత విస్తరింప చేసేందుకు, దేశం తన వైపు నుంచి ప్రోత్సహిస్తూ, మరొక స్టేడియంని అందిస్తోంది. వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియం ప్రారంభించి భూమి పూజ నిర్వహించారు మోదీ. 

వారణాసి క్రికెట్ స్టేడియం విశేషాలు: 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ హాజరయ్యారు. ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మరియు సెక్రటరీ జే షాతో సహా పలువురు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆఫీస్ బేరర్లు కూడా వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ వారనాసి క్రికెట్ స్టేడియం కు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి అంటున్నారు.. మరి ఏంటో తెలుసుకుందాం రండి.. 

1. స్టేడియంలో 30,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది, ఘాట్‌ల మెట్లను పోలిన గ్యాలరీ ఉంటుంది. స్టేడియంలో ఏడు పిచ్‌లు ఉంటాయి. ఈ స్టేడియం ముఖ్యంగా డిసెంబర్ 2025 నాటికి సిద్ధం అయ్యే అవకాశం ఉంది.

2. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గంజరిలో భూ సేకరణకు రూ.120 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు స్టేడియం నిర్మాణ ఖర్చుకు గాను అయ్యే రూ.330 కోట్లు బీసీసీఐ భరించనుంది.

3. అర్థ చంద్రాకారంలో కనిపించే స్టేడియం పైకప్పు కవర్లు, ‘త్రిశూలం’ ఆకారంలో ఉన్న ఫ్లడ్‌లైట్లు, బెల్ ఆకుల ఆకారంలో కనిపించే లైట్లు. సుమారు స్టేడియంలో ప్రతి ఒక్క అణువు కూడా, వారణాసి పట్టణాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది అంటున్నారు..

4. వారణాసి క్రికెట్ స్టేడియం, రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్‌కు సమీపంలో ఉంది, ఇది కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం, లక్నోలోని BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం తర్వాత, ఉత్తర ప్రదేశ్‌లో సిద్ధమవుతున్న మూడవ అంతర్జాతీయ స్టేడియం అవుతుంది.

5. ఇప్పటికే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న వారణాసిలో వేలాది మంది కార్మికులకు ఈ స్టేడియం ఆదాయం సమకూరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్టేడియంకు వచ్చే జనం వల్ల ప్రయోజనం పొందే వారిలో డ్రైవర్లు మరియు బోట్‌మెన్‌లు కూడా ఉంటారని మరొకసారి గుర్తు చేశారు మోదీ.

దగ్గరపడుతున్న వరల్డ్ కప్: 

భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు.

క్రికెట్ వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసేందుకు నవరాత్రి పండుగ కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే అహ్మదాబాద్ లోకల్ పోలీస్ వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అక్టోబర్ 15న అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని, వారి తరఫునుంచి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 15వ రోజున నవరాత్రి పండుగ కూడా వచ్చినందువల్ల ఆరోజు రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపడి, రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 15న ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం అభిమానులు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బుకింగ్స్ చేసుకోవడం కారణంగా, ఇప్పుడు వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసిన తర్వాత అభిమానులలో కాస్త అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.