గరిష్ట వేగాన్ని అందుకోలేకపోతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తన గరిష్ట వేగాన్ని అందుకోలేకపోతోంది. గడిచిన రెండు సంవత్సరాలలో  ట్రాక్ పరిస్థితుల కారణంగా సగటున గంటకు 83 కి.మీ వేగంతో  వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. అటు వాణిజ్య సేవలకు అనుమతించదగిన గరిష్ట వేగం గంటకు 130 కి.మీలని  RTI సమాధానం వెల్లడించింది. ఈ రైలు సగటు వేగం సాధారణ మార్గంలో గంటకు 95 కి.మీ. కాగా గరిష్టంగా 180 కి.మీ.ల వేగంతో నడిచేలా నిర్మించబడిన […]

Share:

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తన గరిష్ట వేగాన్ని అందుకోలేకపోతోంది. గడిచిన రెండు సంవత్సరాలలో  ట్రాక్ పరిస్థితుల కారణంగా సగటున గంటకు 83 కి.మీ వేగంతో  వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. అటు వాణిజ్య సేవలకు అనుమతించదగిన గరిష్ట వేగం గంటకు 130 కి.మీలని  RTI సమాధానం వెల్లడించింది.

ఈ రైలు సగటు వేగం సాధారణ మార్గంలో గంటకు 95 కి.మీ. కాగా గరిష్టంగా 180 కి.మీ.ల వేగంతో నడిచేలా నిర్మించబడిన ఈ రైలు వాణిజ్య సేవలకు గరిష్టంగా 130 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ దాఖలు చేసిన RTI ప్రకారం… సెమీ హైస్పీడ్ రైలు సగటు వేగం 2021-22లో గంటకు 84.48 కి.మీ. మరియు 2022-23లో గంటకు 81.38 కి.మీ. గా ఉందన్నారు.

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు ₹97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని వ్యవహరించారు. ఆ తరువాత 2019 జనవరి 27న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించబడింది. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

2023 జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 8వ వందే భారత్ రైలు ఆదివారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా 699 కిలోమీటర్ల దూరం కేవలం 8.30 గంటల్లో విశాఖపట్టణం చేరుకుంటుంది. తిరిగి 20 నిమిషాల విరామం తర్వాత సికింద్రాబాద్‌ బయలు దేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్‌ రైలు టికెట్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా 2023 జనవరి 16 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటీవ్ ఏసీ చైర్ కార్ కోచ్‌‌లు ఉంటాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 2023 ఏప్రిల్ 8న ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య నడుస్తుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు మరింత వేగాన్ని అందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చని ఆశిస్తున్నారు. వందే భారత్ రైళ్లు దేశంలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపాయని చెప్పుకోవచ్చు.