Tree: ఆయుర్వేద మొక్కలు నాటుతున్న ఉత్తరాఖండ్

మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

Courtesy: Twitter

Share:

Tree: లోధ్రా (Lodhra) చెట్టు (Tree) వివిధ ఆయుర్వేద (Ayurvedic) ఔషధాలలో ఉపయోగించబడుతుంది. దాని వివిధ జాతులు అనేక రకాల వ్యాధులకు వ్యతిరేకంగా ఔషధ విలువలతో విస్తృతమైన, ఆరోగ్య విలువలు ఉన్న మొక్కలు. చెట్టు (Tree) బెరడు అనేక ఆయుర్వేద (Ayurvedic) ఔషధాలలో ఉపయోగిస్తుంటారు. ఐరోపాలో దీన్ని సింకోనా బెరడు అని పిలుస్తారు. నుదుటిపైన తిలకంగా పెట్టుకోవడానికి కూడా బెరడు ఉపయోగించబడుతుంది. అందువల్ల సంస్కృతంలో లోధ్రా (Lodhra) అనే పదాన్ని తిలక అని పిలుస్తారు, దీని అర్థం అనుకూలమైనది. ఈ చెట్టు (Tree) భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది, అయితే ఉత్తరాఖండ్‌లోని ఒక సంస్థ చెట్టు (Tree)ను సంరక్షించడానికి ఒక మంచి ఆలోచన చేస్తుంది.

మొక్కలు నాటుతున్న ఉత్తరాఖండ్: 

చమోలీ జిల్లా పిపల్‌కోటికి చెందిన ఆగాజ్ ఆర్గనైజేషన్, కిరులి, మల్ల తంగని, సుటోల్, కనోల్, సునాలీ, జుమ్లా మరియు నౌరఖ్ గ్రామాలకు చెందిన మహిళా సంఘాలతో కలిసి గత వర్షాకాలంలో 2,850 లోధ్రా (Lodhra) మొక్కలు నాటారు (Planting). వాటిలో దాదాపు 250 మొక్కలను పిప్పలకోటిలోని బయో టూరిజం పార్కులో భద్రపరిచారు. లోధ్రా (Lodhra) చెట్టు (Tree) విత్తనాలను అడవుల నుంచి సేకరించి నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీవంతి వెల్ఫేర్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ కూడా సంస్థతో అనుబంధం కలిగి ఉంది.

చమోలీ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త సంజయ్ కున్వర్ మాట్లాడుతూ, లోధ్రా (Lodhra) విత్తనాలు సులభంగా అందుబాటులో ఉండవు అని అంతేకాకుండా నిలువ చేయలేమని కూడా చెప్పారు. చెట్టు (Tree)పైనే పండిన నల్లటి గింజలను వెంటనే గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఇసుక మరియు వదులుగా ఉన్న నేలలో నాటుకోవాలి (Planting). ఈ ప్రక్రియ తర్వాత, విత్తనాలు ఒక నెలలో నాటిన (Planting) విత్తనాల మొలకలుగా రావడం ప్రారంభిస్తాయి. మొక్కలు మూడు అంగుళాల పొడవు పెరుగుతాయి, వాటిని ఒక సంవత్సరం పాటు నర్సరీ బ్యాగులలోనే ఉంచాలి. ఇదే ప్రాసెస్ మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకుంటూ వెళ్ళాలి.

లోధ్రా (Lodhra) మొదటి మూడు సంవత్సరాలు నెమ్మదిగా పెరుగుతుందని, తరువాతి 5-7 సంవత్సరాలలో వేగం పెరుగుతుందని కూడా ఆయన వివరించారు. శీతాకాలంలో ఔషధ (Ayurvedic) ప్రయోజనాల కోసం చెట్లను నరికివేస్తారు. కానీ పక్షులు, కోతులు మరియు లంగూర్లు వంటి జంతువులు విత్తనాన్ని తిని వాటిని భూమిలో పడేసిన తర్వాత ఆ విత్తనాలు మళ్లీ మొక్కలుగా మారడం, ఇలా ఈ మొక్కకు సంబంధించిన తోటల పెంపకం జరుగుతుంది.

లోధ్రా (Lodhra) మొక్కలలో ఫ్లేవనాయిడ్స్, టానిన్, వెటివెరోల్, లోధ్రోల్, లోద్రిన్, ఎపికాటెచిన్, బెటులినిక్ యాసిడ్, లోద్రికోలిక్ యాసిడ్, బెటులినిక్ యాసిడ్, లోద్రోసైడ్ వంటి ఔషధ (Ayurvedic) భాగాలు ఉన్నాయి. ఇటువంటి ఔషధ (Ayurvedic) విలువలు అనేవి ఈ మొక్క బెరడు మరియు వేరులో ఉంటాయి. బెరడు ప్రేగు సంబంధిత వ్యాధులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలను పోస్ట్ మరియు మెనోపాజ్ ముందు దశలలో ఉంచుతుంది, PCOS లక్షణాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ముఖ్యంగా ఆడవాళ్లలో రుతుచక్రాన్ని నియంత్రిస్తుంది. ఈ మొక్కకు సంబంధించిన బెరడు, వేరు అల్సర్లకు చికిత్సగా కూడా ఉపయోగించబడుతుంది. 

మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలి: 

ఇప్పుడున్న ప్రపంచంలో చాలా వరకు మొక్కలు నాటడం (Planting) అనేది కనిపించకుండా పోయింది. ఎక్కడ చూసినా పెద్దపెద్ద వృక్షాలను నరికివేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా మనిషికి ప్రాణ వాయువును అందించే మొక్కలను నరికేస్తున్నాం అని మర్చిపోతున్న క్రమం కనిపిస్తోంది. మొక్కలు నాటడం (Planting) పక్కనపెట్టి, వృక్షాలను నరికి వేయడం నిజంగా మానవాళికి ఎంతో దెబ్బ. చెట్లు లేనిదే మనుషుల మనుగడ లేదని గుర్తు చేసుకున్న రోజు ప్రపంచం మళ్లీ మునపటి స్థితికి వస్తుంది.