గ్యాంగ్ స్టర్స్ భూముల్లో పేదలకు ఫ్లాట్స్

రౌడీలు , గూండాలు మరియు గ్యాంగ్ స్టర్లు ఇలా ఎంతో మంది క్రిమినల్స్ కి వెన్నులో వణుకుపుట్టించి , వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి పట్టపగలే చుక్కలు చూపించిన ముఖ్యమంత్రులను మనం కేవలం సినిమాల్లోనే ఇన్ని రోజులు చూసాము. అలాంటి సినిమాలు చూసినప్పుడు నిజజీవితం లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటే మన రాష్ట్రం ఎంత బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే నిజజీవితం లో కూడా అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడని ప్రపంచానికి తెలిసే […]

Share:

రౌడీలు , గూండాలు మరియు గ్యాంగ్ స్టర్లు ఇలా ఎంతో మంది క్రిమినల్స్ కి వెన్నులో వణుకుపుట్టించి , వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి పట్టపగలే చుక్కలు చూపించిన ముఖ్యమంత్రులను మనం కేవలం సినిమాల్లోనే ఇన్ని రోజులు చూసాము. అలాంటి సినిమాలు చూసినప్పుడు నిజజీవితం లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటే మన రాష్ట్రం ఎంత బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే నిజజీవితం లో కూడా అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడని ప్రపంచానికి తెలిసే రోజు రానే వచ్చింది. అతను మరెవరో కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే గ్యాంగ్ స్టర్స్ కి నిలయం లాంటిది. సామాన్య ప్రజలు జీవించడానికి భయపడేవాళ్లు. అన్యాయంగా అక్రమం గా దౌర్జన్యాలు చేస్తూ భూములను కబ్జాలు చెయ్యడం, ఎదురు తిరిగిన వాళ్ళను చంపేయడం, లా & ఆర్డర్ ఏమి చెయ్యలేక చూస్తూ అలా కూర్చోవడం, ఇవన్నీ కామన్ గా ఉండేది.

1731 చదరపు మీటర్ల భూములను స్వాధీనం :

కానీ ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడో, అక్కడి జనాలకు స్వర్ణ యుగం మొదలైందనే చెప్పాలి. గ్యాంగ్ స్టర్స్ పాలిట కాలయముడిగా మారిన ఆదిత్యనాథ్ , వాళ్ళ ద్వారా కబ్జాలకు గురైన భూములను వెనక్కి తిరిగి రప్పించేలా చేసాడు. ఏమి చేసాడో ఏమో తెలియదు కానీ, పచ్చి నెత్తురు తాగే క్రిమినల్స్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి, తమ తప్పులను ఒప్పుకొని లొంగిపోతున్నారు. ఇలాంటివి ఇప్పటి వరకు మనం కేవలం సినిమాల్లోనే చూసి ఉంటాము. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో హత్యకి గురైన గ్యాంగ్ స్టర్ , మాజీ మంత్రి అతీక్ మహ్మద్ కి గతం లో 1731 చదరపు మీటర్ల విస్తీర్ణం లో ఉన్న స్థలం ని కబ్జా చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చేది. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత ఆ భూమిని స్వాధీన పర్చుకొని, ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద 76 ఇళ్లను నిర్మించి, దానికి సంబంధించిన తాళాలను లబ్దిదారులకు నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందచేసాడు.

2021 లోనే శంకుస్థాపన :

41 చదరపు మీటర్ల విస్తీర్ణం లో నిర్మించిన ఈ ఫ్లాట్స్ లో రెండు గదులు , వంటగది  మరియు టాయిలెట్స్ ఉంటాయి. ఇన్ని సౌకర్యాలతో కట్టించిన ఈ ఫ్లాట్స్ ని కేవలం 3 లక్షల 50 వేల రూపాయలకే ఇచ్చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి 2021 వ సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీన శంకుస్థాపన చేసాడు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ  ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించింది. 76 ఫ్లాట్స్ ని రెండు బ్లాక్స్ లలో నిర్మించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ 2017 వ సంవత్సరం ముందు పెదాలు , వ్యాపారులు మరియు ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములను మాఫియా కబ్జా చేసింది. పాపం ఏమి చెయ్యలేని నిస్సహాయత స్థితిలో అందరూ ఉండేవారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాలను స్వాధీన పర్చుకొని, పేదలకు ఫ్లాట్స్ ని నిర్మించి 6 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఫ్లాట్స్ ని కేవలం 3 లక్షల 50 వేల రూపాయలకే ఇస్తున్నాము. లబ్ధిదారుల ఎంపిక కోసం అలహాబాద్ మెడికల్ అసోసియేషన్ ప్రాంగణం లోని ఆడిటోరియం ని తీసుకొని ఒక కార్యక్రమం నిర్వహించం, అక్కడికి వచ్చిన 6,030 దరఖాస్తులను క్షుణ్ణంగా  పరిశీలించి, లాటరీలో ద్వారా  1590 మంది దరఖాస్తుదారులు అర్హులుగా పరిగణించాము’ అంటూ చెప్పుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్.