ప్రధాని మోదీకి అమెరికా సింగర్  మద్దతు

ఆఫ్రికన్-అమెరికన్ నటి, గాయని మేరీ మిల్‌బెన్ మణిపూర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. మరియు ఈశాన్య రాష్ట్ర ప్రజల కోసం తాను ఎల్లప్పుడూ పోరాడతానని అన్నారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆమె ఒక పోస్ట్ ద్వారా.. భారత్‌కు తమ నాయకుడి పై విశ్వాసం ఉందని మేరీ మిల్బెన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ లో తన అభిప్రాయాని తెలియజేసారు..  వాస్తవాలు లేకుండా […]

Share:

ఆఫ్రికన్-అమెరికన్ నటి, గాయని మేరీ మిల్‌బెన్ మణిపూర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. మరియు ఈశాన్య రాష్ట్ర ప్రజల కోసం తాను ఎల్లప్పుడూ పోరాడతానని అన్నారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆమె ఒక పోస్ట్ ద్వారా.. భారత్‌కు తమ నాయకుడి పై విశ్వాసం ఉందని మేరీ మిల్బెన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ లో తన అభిప్రాయాని తెలియజేసారు.. 

వాస్తవాలు లేకుండా ప్రతిపక్షాలు భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నాయని మేరీ మిల్బెన్ కందించారు . ప్రధాని మోడీపై తనకు నమ్మకం ఉందని, ఆయన కోసం ప్రార్థిస్తున్నానని మిల్బెన్ చెప్పారు. దివంగత అమెరికన్ సివిల్ రైట్స్ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ‘లెట్ ఫ్రీడమ్ రింగ్’ ప్రకటనను కూడా ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.. 

తమ నాయకుడిపై భారతదేశానికి నమ్మకం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. మణిపూర్‌లోని తల్లులు, కుమార్తెలు , మహిళలకు న్యాయం జరుగుతుంది అని  మీ స్వేచ్ఛ కోసం ప్రధాని మోడీ ఎప్పుడూ పోరాడుతారు..  సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించే పార్టీ, తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించే హక్కును పిల్లలకు లేకుండా చేసి, విదేశాల్లో దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడే నాయకుడు .. ఆ పార్టీ నాయకత్వం గురించి ప్రస్తావించారు. 

మోడీ లోక్‌సభలో మాట్లాడుతూ…

కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈరోజు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో హింసను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మే 3న మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, మణిపూర్‌లో మహిళలపై తీవ్రమైన నేరం జరిగింది, ఇది క్షమించరానిది. దోషులను కఠినంగా శిక్షించేలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 మణిపూర్ మహిళలకు దేశం వారితో నిలుస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. మేము కలిసి ఈ సవాలుకు పరిష్కారం కనుగొంటాము మరియు అక్కడ మరోసారి శాంతిని పునరుద్ధరిస్తాము అని లోక్‌సభలో ప్రధాని మోడీ అన్నారు.

మేరీ మిల్బెన్ మాట్లాడుతూ…

నిజాయితీ లేని జర్నలిజం తప్పుడు కథనాలను చిత్రిస్తుందని మేరీ మిల్బెన్ అన్నారు. వాస్తవాలు లేకుండా ప్రతిపక్షాల గొంతుకలు వినిపిస్తున్నాయి. కానీ సత్యం ఎల్లప్పుడూ ప్రజలను స్వతంత్రులను చేస్తుంది. మై డియర్ ఇండియా.. సత్యాన్ని గ్రహించండి అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ.. మీపై నాకు నమ్మకం ఉందని మద్దతు చెప్పారు.

వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో మిల్బెన్ తన అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వాషింగ్టన్ DCలోని రోనాల్డ్ రీగన్ భవనంలో ఆమె భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అక్కడ ప్రధాని మోడీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘జన గణ మన’ పాడిన తర్వాత, మేరీ ప్రధాని మోడీకి నమస్కారం చేసి, ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మహిళలపై నేరాలు తీవ్రమైనవని, అవి క్షమించరానివని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. రాబోయే కాలంలో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని తాను ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు