హెల్మెట్ లేక స్కూటర్ అమ్మి గుర్రం కొన్న యువకుడు..!

ట్రాఫిక్ నిబంధనలు మన జగ్రత్త కోసమే.. రహదారిపై ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరం. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిబంధనలు బ్రేక్ చేసినందుకు వాహన యజమానిని లేదా దానిని నడుపుతున్న వ్యక్తిని జైలుకు కూడా పంపబడవచ్చు. మామూలుగా ట్రాఫిక్ పోలీసులు ఏదైనా రూల్ ఉల్లంఘిస్తూ పట్టుబడితే ఫైన్ విధిస్తారు.హెల్మెట్ లేని కారణంగా బైకర్లకు ఎక్కువగా ఫైన్ విధిస్తుంటారు. ఇలాంటి జరిమానాలను తప్పించుకునేందుకు చాలామంది హెల్మెట్ కొనుగోలు చేస్తారు. అయితే అస్సాంకు […]

Share:

ట్రాఫిక్ నిబంధనలు మన జగ్రత్త కోసమే.. రహదారిపై ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరం. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిబంధనలు బ్రేక్ చేసినందుకు వాహన యజమానిని లేదా దానిని నడుపుతున్న వ్యక్తిని జైలుకు కూడా పంపబడవచ్చు. మామూలుగా ట్రాఫిక్ పోలీసులు ఏదైనా రూల్ ఉల్లంఘిస్తూ పట్టుబడితే ఫైన్ విధిస్తారు.హెల్మెట్ లేని కారణంగా బైకర్లకు ఎక్కువగా ఫైన్ విధిస్తుంటారు. ఇలాంటి జరిమానాలను తప్పించుకునేందుకు చాలామంది హెల్మెట్ కొనుగోలు చేస్తారు. అయితే అస్సాంకు చెందిన దిబాకర్ కొయిరాలా అనే వ్యాపారవేత్త మాత్రం ఈ ఫైన్ల బాధ భరించలేక ఏకంగా తన స్కూటర్‌ను అమ్మేశాడు. దాన్ని అమ్మేసి రూ.60 వేలకు ఒక గుర్రం కొన్నాడు. ఇప్పుడు అతడు దానిపైనే తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

వివరాల్లోకి వెళ్తే, ఇటీవల స్కూటర్ హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడుపుతున్నందున ట్రాఫిక్ పోలీసులు దిబాకర్‌కు రూ.500 జరిమానా విధించారు. దాంతో అతడు బాగా కోపానికి గురయ్యాడు. ఆ కోపంలో ఉన్నప్పుడే తన స్కూటర్‌ను అమ్మి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాడు. గుర్రం మరింత సౌకర్యవంతంగా, ఖర్చుతో కూడుకున్నదని, దానిని స్వారీ చేయడానికి లైసెన్స్ అవసరం లేదని అతను భావించాడు.

దిబాకర్ రవాణా కోసం గుర్రాన్ని ఉపయోగించడం వైపు మొగ్గు చూపాడు. గడ్డి మేతకు తప్ప పెద్దగా ఖర్చులు ఉండవని, పోలీసుల భయం అసలే ఉండదని ఇతని చెబుతున్నాడు. ల్యాబ్ అసిస్టెంట్ అయిన షేక్ యూసుఫ్  కూడా ఫ్యూయల్ పై డబ్బు ఆదా చేయడానికి గుర్రాన్ని కొన్నాడు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు గుర్రపు స్వారీ కూడా మంచి మార్గమని చెప్పారు.

వీరిద్దరూ స్కూటర్లు బైక్‌లను పక్కన పడేసి గుర్రాలపై స్వారీ చేస్తూ వారి ప్రాంతాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారు గుర్రపు స్వారీకి హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదన్న కారణంగా గుర్రం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

అయితే ఈ సంగతి తెలిసి నెటిజన్లు ఏందయ్యా ఇది అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఫ్యూయల్ ధర పెరుగుతూనే ఉన్నందున, గుర్రాలను రవాణా మార్గంగా ఉపయోగించడం భారతదేశంలో ఎక్కువ అవుతోంది. 2019లో సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ గుర్రాన్ని సరిగ్గా కట్టుకుని, హెల్మెట్ ధరించి ఉన్నంత వరకు, పబ్లిక్ రోడ్లపై గుర్రపు స్వారీ చేయడాన్ని చట్టబద్ధం చేసింది.

పోలీసులు పట్ల గౌరవంగా ఉండండి

అయితే,  ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపమని అడిగితే మీరు ఆపండి. అయినప్పటికీ. మీరు మీ కారు, బైక్ లేదా స్కూటర్‌పై కూర్చొని ఉండాలనుకుంటే అది మీ ఇష్టం.. ఆ తర్వాత వాహనం ఇగ్నిషన్ ఆఫ్ చేయండి. దీని తర్వాత సంయమనంతో పోలీసు అధికారితో మాట్లాడండి.

పోలీసులు కూడా మన లాంటి పౌరులు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎంతో కష్టమైనప్పటికీ ఎండలో, వానలో, చలిలో కూడా రోడ్లపై నిలబడి డ్యూటీ చేస్తుంటారు. ఎందుకంటే.. పౌరుల రక్షణ, సురక్షత కోసం. కాబట్టి, ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. వారిని గౌరవించండి. వారితో మర్యాదగా ప్రవర్తించండి. మీరు ఏదైనా తీవ్రమైన నియమాన్ని ఉల్లంఘించనట్లయితే.. వారు కేవలం హెచ్చరికతో మిమ్మల్ని వెళ్లనివ్వవచ్చు.

ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడుతున్నప్పుడు ఆవేశపడకండి. మీరు పొరపాటున ఏదైనా ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే.. అసలు విషయం ఏంటో వారికి వివరించడానికి ప్రయత్నించండి. అవసరమైతే, మీరు ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమాపణ అడగవచ్చు. వారు పొరపాటున ఆపి ఉంటే వారుకూడా క్షమాపణ చెప్పే అవకాశం ఉంది.

నియమాలను గౌరవించండి..

నియమాలు అందరికీ ఉంటాయి. ముందుగా మనం గుర్తుంచుకోవల్సినంది ఏంటంటే.. ఈ నియమాలను మనం.. మన కోసం ఏర్పాటు చేసుకున్నవి మాత్రమే. అందుకే వాటిని అనుసరించాలి. అందుకే ప్రశంతంగా పోలీసుతో మాట్లాడండి. మీరు నియమాన్ని ఉల్లంఘిస్తే.. మీపై చర్య తీసుకోవడం.. వారి విధిని చేయనివ్వడం వారి విధి అని అర్థం చేసుకోండి. ఇలాంటి సమయంలో మీరు రూల్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పవచ్చు.