UPSC: CSE మెయిన్స్ అడ్మికార్డులు విడుదల

UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అనేది దేశంలో ఉన్న స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థ వివిధ రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంటుంది. అందుకే ఈ సంస్థ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చిందని తెలిసినా సరే నిరుద్యోగులు అలెర్ట్ అవుతారు. వెంటనే అప్లై చేసుకునేందుకు పోటీ పడతారు. మన ఇండియాలో పేరెన్నికన్న సంస్థలలో ఇదీ ఒకటి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ పని చేస్తుంది. అందుకోసమే UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) […]

Share:

UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అనేది దేశంలో ఉన్న స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థ వివిధ రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంటుంది. అందుకే ఈ సంస్థ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చిందని తెలిసినా సరే నిరుద్యోగులు అలెర్ట్ అవుతారు. వెంటనే అప్లై చేసుకునేందుకు పోటీ పడతారు. మన ఇండియాలో పేరెన్నికన్న సంస్థలలో ఇదీ ఒకటి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ పని చేస్తుంది. అందుకోసమే UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సంస్థను అందరూ విశ్వసిస్తారు. మన దేశంలో చాలా పెద్ద పరీక్షలను ఈ సంస్థే నిర్వహిస్తుంటుంది. పరీక్షల నిర్వహణతో పాటు వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం, అడ్మిట్ కార్డులు విడుదల చేయడం చేస్తుంటుంది. పరీక్షలు వస్తున్నాయంటే చాలు చాలా మంది నిరుద్యోగులకు వాటి కోసం సిద్ధం అయిపోతుంటారు. తమ వద్ద ఉన్న అస్త్రాలను రెడీ చేసుకుంటూ ప్రిపేర్ అవుతంటారు. అనేక పరీక్షల కోసం UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్లను ఇస్తూ ఉంటుంది. అందులో మనకు సరిగ్గా సూటయ్యే పరీక్షలేవో తెలుసుకుని వాటికి అప్లై చేయడం చాలా అవసరం. అలా కాకుండా వేరే వాటికి కూడా అప్లై చేస్తే పరీక్ష రాసే సమయంలో మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమే మనకు నైపుణ్యం ఉన్న రంగంలో పరీక్షను అనౌన్స్ చేసినపుడు మాత్రమే మనం అందుకు పూనుకోవాలి. లేకపోతే మనకు సంబంధం లేని నోటిఫికేషన్లు వచ్చినపుడు మనం లైట్ తీసుకోవాలి. అలా కాదని అన్నింటికీ అప్లై చేసుకుంటూ వెళ్తే మన జేబుకు చిల్లు పడడం మాత్రమే కాదు.. మనం అనేక ఇబ్బందులు కూడా పడాల్సి వస్తోంది.  

ఓ వెబ్ సైట్

UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)  పరీక్షల నిర్వహణ కోసం చాలా పకడ్బందీగా ఉంటుంది. పరీక్షకు అప్లై చేసుకున్నఅభ్యర్థులు అడ్మిట్ కార్డులు లేదా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) upsc.gov.in అనే వెబ్ సైట్ ను కూడా రన్ చేస్తోంది. ఈ వెబ్ సైట్ లోనే పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాలను కమిషన్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

సెప్టెంబర్ 15 నుంచి సివిల్స్ మెయిన్స్ 

UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మెయిన్. ఈ పరీక్ష కోసం UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఎన్నో ఏర్పాట్లను చేస్తుంది. చాలా పకడ్బందీగా పరీక్షను నిర్వహిస్తూ ఉంటుంది. ఏ మాత్రం తేడా రాకుండా స్ట్రిక్ట్ గా పరీక్ష అయ్యేలా చూస్తుంది. ఈ పరీక్షలను UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్ ఎగ్జామ్ అని రెండు విడతలుగా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయిన వారు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. ఒక వేళ మెయిన్స్ పరీక్షలో కూడా మంచి స్కోరుతో పరీక్షను క్లియర్ చేస్తే వివిధ ప్రమాణాల కింద వారిని జాబ్ కు ఎంపిక చేస్తారు. అటువంటి వారు సివిల్ సర్వీసెస్ కు ఎంపిక అవుతారు. మెయిన్స్ తర్వాత అభ్యర్థులను జాబ్ కు సెలెక్ట్ చేసేందుకు వివిధ రకాల పద్ధతులను కమిషన్ పాటిస్తుంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు కూడా UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షను సెప్టెంబర్ 15, 16, 17, 18, 23 తేదీల్లో జరిగేలా బోర్డు షెడ్యూల్ చేసింది. దేశంలోని ఒకే ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాలలో ఈ పరీక్షను నిర్వహించేలా కమిషన్ కసరత్తులను పూర్తి చేసింది. పరీక్షకు సంబంధించిన మొత్తం ఏర్పాట్లు పూర్తయిన తర్వాత మాత్రమే UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అడ్మిట్ కార్డులను విడుదల చేస్తుంటుంది. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:00 వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగాఅనేక మంది అభ్యర్థులు అప్లై చేస్తారు కాబట్టి వారంతా ఒకేసారి పరీక్ష రాయడం కష్టం అవుతుందని భావించిన కమిషన్ పరీక్షను చాలా రోజుల పాటు నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఇక సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 ఫలితాలు జూన్ 12న ప్రకటించబడ్డాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం పోటీ పడతారు. ఇక ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 14,624 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరందరికీ మెయిన్స్ నిర్వహించేందుకు UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులు తప్పకుండా కమిషన్ నియమాలను పాటించాలి. లేని యెడల అటువంటి వారిని పరీక్ష రాసేందుకు కమిషన్ అనుమతించదు. 

UPSC మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌ లోడ్ చేసుకోండిలా.. 

UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కమిషన్ మెయిన్స్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్ష కోసం తేదీలను కూడా ప్రకటించింది. మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను ఈ కింది విధంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  1. UPSC అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. 
  2. సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2023 అనే ట్యాబ్ ఓపెన్ చేసి తర్వాత.. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ మీద క్లిక్ చేయాలి. 
  3. మీ డిటేయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. 
  4. సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.