భర్త అనుకుని వేరే వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చిన మహిళ

ఉత్తరప్రదేశ్‌లో భార్యాభర్తలు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన భర్త కోసం ఎంతగాలో గాలించినా మహిళ చివరికి తన భర్త దొరికాడని సంతోషంగా తనని తీసుకొని ఇంటికి వెళ్ళింది. కానీ చివరికి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు ఆధారంగా అతను తన భర్త కాదని నిర్ధారించుకుంది. అసలు ఏం జరిగింది:  బల్లియా వీధుల్లో, దేవి అనే మహిళ చాలా సంవత్సరాలుగా తన భర్త గురించి వెతుకుతూ ఉంది. అయితే […]

Share:

ఉత్తరప్రదేశ్‌లో భార్యాభర్తలు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన భర్త కోసం ఎంతగాలో గాలించినా మహిళ చివరికి తన భర్త దొరికాడని సంతోషంగా తనని తీసుకొని ఇంటికి వెళ్ళింది. కానీ చివరికి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు ఆధారంగా అతను తన భర్త కాదని నిర్ధారించుకుంది.

అసలు ఏం జరిగింది: 

బల్లియా వీధుల్లో, దేవి అనే మహిళ చాలా సంవత్సరాలుగా తన భర్త గురించి వెతుకుతూ ఉంది. అయితే చివరికి తన భర్త ఇంకా ఎప్పటికీ తిరిగి రాడు అని నిర్ణయించుకున్నప్పటికీ, అప్పుడప్పుడు దేవి తన భర్త పాత ఫోటోలను అటుగా వెళ్లే బాటసారులకు చూపించి, తన భర్తను ఎక్కడైనా చూసారా అని అడిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

అయితే ఇదే క్రమంలో ఒక ప్రైవేటు హాస్పటల్ ముందు కనిపించిన ఒక వ్యక్తి తన భర్త అని భావించిన దేవి, తన భర్తను తీసుకొని ఇంటికి వెళ్ళింది. అంతేకాదు తన కొడుకుని తన తండ్రికి పరిచయం చేసింది. దేవి సంబంధించిన బంధువులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ వ్యక్తిని దేవి భర్తగా భావించారు. అతన్ని ఇంటికి తీసుకెళ్లడంలో కూడా వారు ఆమెకు సహాయం చేశారు.

ఇంటికి తీసుకు వెళ్లిన తర్వాత దేవి, అతను ముందు కూర్చుని ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లి పోయావు, ఎక్కడ ఉన్నావని ప్రశ్నలు అడగడం కూడా వైరల్ గా మారిన వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆ ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ దేవి ఎదురుగా కూర్చున్న తన భర్త మాత్రం దేనికి సమాధానం చెప్పడు. తన బాధను చూసి బంధువులు కూడా చాలా బాధపడ్డారు. కానీ చివరికి తన భర్త తిరిగి ఇంటికి చేరుకున్నాడని అందరూ సంతోషించారు. అయితే దేవి ఈ క్రమంలోనే తన భర్త ఒంటి మీద ఉన్న కొన్ని గుర్తులను పరిశీలించి చూసింది. కానీ 10 సంవత్సరాల క్రితం తప్పిపోయిన భర్త గుర్తులు ఏవి కూడా, ఇప్పుడు తన ముందు కూర్చున్న అతని ఒంటి మీద కనిపించకపోవడంతో, తన ఎదురుగా ఉన్న వ్యక్తి తన భర్త కాదు అని చివరికి తేలింది. 

తన భర్త పేరు మోతీచంద్, అయితే తాను పది సంవత్సరాల క్రితం తప్పిపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మోతిచంద్ భార్య తన భర్త కోసం వెతుకులాట ప్రారంభించింది. 10 సంవత్సరాలు కావస్తున్న భర్త జాడ కనిపించకపోవడంతో నిరాశలో మునిగిపోయింది. ఇదే క్రమంలో తన భర్త కనిపించడంతో సంతోషంతో ఇంటికి తీసుకువచ్చిన దేవికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఎవరైతే భర్తగా భావించి ఇంటికి తీసుకువచ్చిందో తన ఒంటి మీద తన భర్త గుర్తులు ఒక్కటి కూడా లేకపోవడంతో, తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి తన భర్త కాదు అని నిర్ధారించింది. అయితే హాస్పటల్ బయట కనిపించిన వ్యక్తి, దేవి భర్త కాదు, రాహుల్ అనే మరో వ్యక్తి అని తెలిసింది. 

విలేకరులతో మాట్లాడిన దేవి, తను నిజంగా తన భర్త దొరికినందుకు ఎంతగానో సంతోషించిందని, తన కళ్ళను నమ్మలేని నిజం తన కళ్ళ ముందు ఎదురుగా ఉన్నందుకు సంతోషించానని చెప్పుకొచ్చింది, కానీ కొద్దిసేపటికి తన ఎదురుగా ఉన్న వ్యక్తి  తన భర్త మోతిచంద్ కాదు, రాహుల్ అనే మరో వ్యక్తి అని తెలిసి చాలా బాధపడినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం రాహుల్ కుటుంబ సభ్యులకు, రాహుల్ గురించి సమాచారం అందించి వారి గ్రామానికి పంపించడం జరిగింది.