ఉత్తరప్రదేశ్లో సరికొత్త ఆపరేషన్ కన్విక్షన్.. నేరాలను హతమార్చడమే దిశగా..

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న క్రూరమైన నేరాలను నియంత్రించడానికి… అటువంటి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు వెంటనే శిక్ష పడేలా చేయడానికి తాజాగా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇక దాని పేరే ఆపరేషన్ కన్విక్షన్.. దీని ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారం, హత్య, మతమార్పిడి, దోపిడీ ,గోహత్య, బాల బాలికల వేధింపులు వీటన్నింటికీ కూడా త్వరగా నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.  ఇకపోతే […]

Share:

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న క్రూరమైన నేరాలను నియంత్రించడానికి… అటువంటి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు వెంటనే శిక్ష పడేలా చేయడానికి తాజాగా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇక దాని పేరే ఆపరేషన్ కన్విక్షన్.. దీని ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారం, హత్య, మతమార్పిడి, దోపిడీ ,గోహత్య, బాల బాలికల వేధింపులు వీటన్నింటికీ కూడా త్వరగా నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.  ఇకపోతే ప్రతి జిల్లాలో కూడా వీటికి సంబంధించి ఒక్కొక్కటి 20 కేసులను గుర్తించి.. త్వరగా విచారణ జరిపి.. అభియోగాలు నమోదు చేసిన 30 రోజుల్లోగా నిందితులకు శిక్ష విధించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ కన్విక్షన్ ను ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లోని బిజెపి కార్యాలయంలో సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఈ కేసుల యొక్క పురోగతిని పర్యవేక్షించడానికి.. చొరవ తీసుకోవడానికి వీలుగా ఇలా పైన గుర్తించిన కేసుల వారం వారి సమీక్ష కోసం ఒక వెబ్ పోర్టల్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది . ముఖ్యంగా ఇలాంటివి.. గుర్తించిన కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి పోలీస్ కమిషనర్ లేదా జిల్లా పోలీస్ చీఫ్ కార్యాలయంలో ఒక మానిటరింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఈ ఆపరేషన్ కన్విక్షన్ కింద గుర్తించిన కేసులను వేగంగా విచారణ జరిపించి.. ఒక నిర్ధారణకు వచ్చే విధంగా గెజిటెడ్ అధికారి ఈ సెల్ కు నాయకత్వం వహిస్తారు.

ఇది రోజు వారి కేసుల యొక్క పురోగతిని పర్యవేక్షిస్తుందని కూడా అధికారులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. 2017 వ సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం లో జరుగుతున్న మాఫియాలను అణిచివేయడంలో రాష్ట్ర ప్రభుత్వం 100% సక్సెస్ పొందింది ముఖ్యంగా ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లాలో కూడా 20 కేసులను గుర్తించడానికి ఈ ఆపరేషన్ను ప్రారంభించడం హర్షదాయకం. ముఖ్యంగా ఇలా ఆపరేషన్ కన్వెన్షన్ కింద నమోదైన కేసులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తమ జిల్లాల జడ్జిలతో సమన్వయం చేసుకుంటారు. ముఖ్యంగా అటువంటి కేసులు రోజువారి విచారణలను అభ్యర్థిస్తారు. అని ఆయన తెలిపారు. ఇక అంతే కాదు ఇవే కాకుండా లైంగిక నేరాలు నుంచి పిల్లలను రక్షించే చట్టం అలాగే 2012 కింద నమోదైన కేసులను అదనంగా పరీక్షించనున్నారట.

నేరస్తులపైన చార్జి సీటు దాఖలు చేసిన తర్వాత బాధితులకు వెంటనే న్యాయం జరిగే విధంగా మూడు రోజుల్లోనే అభియోగాలు జరిపి తదుపరి 30 రోజుల్లో పూర్తి విచారణ చేయబడుతుందట.  నేరానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులను వేగంగా సేకరించడానికి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ తో సమన్వయం చేసుకుంటారు. ఇక ఇలా అందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను పూర్తిగా నాశనం చేసే దిశగా అడుగులు వేయడమే కాకుండా రాష్ట్రాన్ని నేరాలు ఘోరాలు లేకుండా నేర రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించినట్లు సమాచారం.