పెళ్లి కోసం దేవుడిని మాయం చేసిన ఉత్తరప్రదేశ్ వాసి

మనం అనుకున్నది జరగకపోతే, దేవుడా ఎందుకు ఇలా జరగట్లేదు అంటూ అరుస్తాం. మళ్లీ జరిగేలా మరొకసారి ప్రయత్నిస్తాం. మన తల్లిదండ్రులను, మన స్నేహితులను సహాయం అడుగుతాం. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం అనుకుంటాం.. ఇలానే ఒక వ్యక్తి, ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పటికీ, తనకి మంచి సంబంధం కుదరట్లేదని, వధువు దొరకట్లేదని ఒక వింత పని చేశాడు.. అదేంటో ఒక్కసారి చూద్దాం రండి..  పెళ్లి కోసం దేవుడిని మాయం చేసాడు:  ఉత్తర్ ప్రదేశ్, కౌసంబి జిల్లాకి […]

Share:

మనం అనుకున్నది జరగకపోతే, దేవుడా ఎందుకు ఇలా జరగట్లేదు అంటూ అరుస్తాం. మళ్లీ జరిగేలా మరొకసారి ప్రయత్నిస్తాం. మన తల్లిదండ్రులను, మన స్నేహితులను సహాయం అడుగుతాం. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం అనుకుంటాం.. ఇలానే ఒక వ్యక్తి, ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పటికీ, తనకి మంచి సంబంధం కుదరట్లేదని, వధువు దొరకట్లేదని ఒక వింత పని చేశాడు.. అదేంటో ఒక్కసారి చూద్దాం రండి.. 

పెళ్లి కోసం దేవుడిని మాయం చేసాడు: 

ఉత్తర్ ప్రదేశ్, కౌసంబి జిల్లాకి చెందిన చోటు అనే వ్యక్తి, శ్రావణ మాసంలో ప్రతిరోజు శివుడు మందిరానికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేసుకునేవాడు. సాయంత్రం పూట శివలింగానికి పూజలు చేస్తూ మంచి భార్య దొరకాలని కోరుకునేవాడు. అయితే ఈ క్రమంలోనే ప్రతిరోజు పూజలు చేస్తున్నప్పటికీ, చోటుకి ఇప్పటివరకు పెళ్లి సంబంధం కుదరలేదు. అయితే ఈ విషయాన్ని చోటు సీరియస్ గానే తీసుకున్నాడు. ప్రతిరోజు శివలింగానికి పూజలు చేస్తున్నప్పటికీ, తనకి ఇప్పటివరకు పెళ్లి కుదరలేదు అనే మనస్థాపానికి గురై, గుడిలోని శివలింగాన్ని మాయం చేశాడు. 

అయితే శ్రావణ మాసం చివరి రోజున పూజలు చేయడానికి వెళ్ళిన కొంతమంది భక్తులకు శివలింగం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు భక్తులు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆరా తీయగా, కొంతమంది భక్తులు చోటు గురించి వివరంగా చెప్పారు. ప్రతిరోజు గుడికి వచ్చి శివలింగాన్ని దర్శించుకునేవాడని, సాయంత్రం పూట ప్రత్యేకమైన పూజలు కూడా చేసేవారని పోలీసులకు భక్తులు చెప్పడంతో, చోటు మీద అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు.. చోటుని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయితే అసలు విషయాన్ని చోటు బయట పెట్టాడు. తను రోజు పూజలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదని, తన పెళ్లి కోసం ఎదురుచూస్తున్న తనకి, సరైన వధువు దొరకలేదని మనస్థాపంతో శివలింగాన్ని తుప్పల్లో పెట్టినట్టు చెప్పుకొచ్చాడు చోటు. గుడి ఉన్నచోటు దగ్గర్నుంచి పది అడుగుల దూరంలో, శివలింగాన్ని దాచి పెట్టానని బయట పెట్టాడు. అసలు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు చోటును అరెస్టు చేశారు. 

దొంగతనానికి వచ్చి హనుమాన్ చాలిస్ చదివిన దొంగ: 

హర్యానాకు చెందిన రివారీ డిస్ట్రిక్ట్ లో హనుమంతుడి గుడిలో దొంగతనం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు సీసీటీవీ కెమెరా చెక్ చేయగా అందులోని ఒక దొంగ వింతైన దొంగతనాన్ని చేశాడు. దొంగతనం చేసినా కూడా తనకి ఒక స్టైల్ ఉండాలి అనుకున్నాడు అనుకుంట. దేవుడి మీద భక్తి ఉండాలి అని నమ్మిన ఆ దొంగ ఏం చేసాడంటే..

ముందుగా దేవుడిని నమస్కరించుకుని తర్వాత హనుమాన్ చాలిస్ చదివాడు. అంతేకాదు తన వంతు ఉడత సహాయంగా హుండీలో పది రూపాయలు దానం కూడా చేశాడు. ఆగండి ఆ దొంగ మంచివాడు, పాపం దేవుడి మీద భక్తితో మారిపోయాడు అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్టే.. మీరు అనుకున్నట్టే సిసిటివి కెమెరాల్లో చూసిన పోలీసులు కూడా పప్పులో కాలు వేశారు. తర్వాత పార్ట్ చూసిన తర్వాత అవాక్కయ్యారు.

ఈ దొంగకి దేవుడంటే అపారమైన భక్తి కారణంగా తాను చేసిన తప్పుల్ని క్షమించమని దేవుడిని ముందుగానే కోరుకున్నాడు. అదేవిధంగా హనుమాన్ చాలిస్ చదివి, పది రూపాయల హుండీలో వేశాడు. ఇంకేముంది, ఆ తరువాత తను ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకున్నాడో ఏంటో దొంగ.. చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారేమో అని గమనించాడు. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న దొంగ, హుండీని పగలగొట్టడం మొదలుపెట్టాడు. హుండీలో నుంచి ఏకంగా రూ. 5000 దొంగతనం చేసి దేవుడికి దండం పెట్టి చెక్కేసాడు.