సినిమాను తలపించిన రియల్ స్టోరీ..!

ఈవీవీ డైరెక్షన్‌లో కన్యాదానం అనే ఓ సినిమా వచ్చింది గుర్తుందిగా. శ్రీకాంత్, ఉపేంద్ర యాక్ట్ చేసిన ఆ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. భార్యను లవర్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు హీరో. వాళ్లిద్దరినీ దగ్గరుండి మరీ కలుపుతాడు. అందరూ తిట్టినా పట్టించుకోడు. ఇది తెలుగులో వచ్చిన సినిమా. హిందీలోనూ దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో సంజయ్ లీలా భన్సాలీ హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా తీశారు. సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌లు నటించిన ఆ […]

Share:

ఈవీవీ డైరెక్షన్‌లో కన్యాదానం అనే ఓ సినిమా వచ్చింది గుర్తుందిగా. శ్రీకాంత్, ఉపేంద్ర యాక్ట్ చేసిన ఆ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. భార్యను లవర్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు హీరో. వాళ్లిద్దరినీ దగ్గరుండి మరీ కలుపుతాడు. అందరూ తిట్టినా పట్టించుకోడు. ఇది తెలుగులో వచ్చిన సినిమా. హిందీలోనూ దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో సంజయ్ లీలా భన్సాలీ హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా తీశారు. సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌లు నటించిన ఆ మూవీ బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌. ఇప్పుడిదంతా ఎందుకు అనేగా మీ డౌట్. ఇవన్నీ సినిమాలు కాబట్టి అలా జరిగిపోతాయ్. రియల్ లైఫ్‌లో ఏ భర్తా అలా ఉండడు అని అనుకుంటాం. 

కానీ…ఉత్తర్ ప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో ఓ భర్త ఇది నిజం చేసి చూపించాడు. తన భార్యకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. ఇద్దరినీ ఆశీర్వదించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఆలయంలో వీళ్లిద్దరికీ పెళ్లి చేశాడు ఆ భర్త. తన ఎదురుగానే బాయ్‌ఫ్రెండ్‌తో ఆమె నుదుటిపై సిందూరం పెట్టించి మరీ ఒక్కటి చేశాడు. పక్కనే ఉన్న వాళ్లంతా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఇదీ జరిగింది..

అసలు కథేంటంటే… ఉత్తర్​ ప్రదేశ్​ డియోరియా ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. స్థానికంగా ఉండే ఓ వ్యక్తికి ఏడాది క్రితం ఓ మహిళతో వివాహమైంది. కాగా పెళ్లికి ముందే ఆమె.. మరో వ్యక్తితో రిలేషన్​లో ఉంది. ప్రియురాలికి పెళ్లి జరిగిందని తెలుసుకుని ఆకాశ్​ షా కుమిలి పోయాడు. చాలా బాధపడ్డాడు. ఏం చేసినా.. ఆ బిహార్​వాసి ఆమెను మాత్రం మర్చిపోలేకపోయాడు. ఈ క్రమంలో ఆమెను మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి.. డియోరియాలోని మహిళ ఇంటికి వెళ్లాడు.

వారిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఆకాష్ ని స్థానికులు చితకబాదారు. ఆమెను తాను ప్రేమించానని, తనను కలవకుండా ఉండలేనని ప్రేమికుడు భర్త ముందు వాపోయాడు.’మేము రెండేళ్లు ప్రేమించుకున్నాము. ఇష్టం లేకపోయినా వేరే వ్యక్తితో ఆమె పెళ్లి చేశారు. ఆమెను నేను మర్చిపోలేకపోతున్నాను. ఆమెను కలవాలనే.. ఇక్కడికి వచ్చాను. దయచేసి మమ్మల్ని కలవనివ్వండి,’ అని ఆకాశ్​ ప్రాథేయపడ్డాడు.

భర్త దగ్గరుండి..!

సాధారణంగా.. ఇలాంటి సంఘటనలతో మహిళ అత్తారింటి వాళ్లు చాలా సీరియస్​ అవుతారు. మరీ ముఖ్యంగా.. మహిళ భర్త.. ప్రియుడిని కొట్టి- ఊరేగించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ప్రియుడిని చూసిన ఆ మహిళ.. భర్త దగ్గరకు వెళ్లింది. తాను కూడా అతడిని మర్చిపోలేకపోతున్నానని చెప్పింది. ఆకాశ్​తో వెళ్లిపోతానని, అతనితో కలిసి జీవిస్తానని.. తన మనసులో మాట చెప్పింది.

అయితే దీనిని ఆమె భర్త వివాదం చేయాలని అనుకోలేదు. వారిద్దరి ప్రేమ గురించి తెలుసుకొని,

భార్య మాటలను ఆ భర్త అర్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలతో చర్చలు జరిపాడు. మనసులో వేరే వ్యక్తిని పెట్టుకుని, తనతో ఆమె సంతోషంగా జీవించలేదని కుటుంబసభ్యులకు చెప్పాడు. ప్రియుడితో ఆమెకు పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశాడు. కట్​ చేస్తే.. ఆ భర్తే.. తన భార్యను, ఆమె ప్రియుడిని స్థానికంగా ఉన్న ఆలయానికి తీసుకెళ్లాడు. వారిద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆకాశ్​ షా వచ్చిన బైక్​ మీదే.. వారిద్దరిని పంపించేశాడు

ఇప్పుడు ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ‘ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయని అనుకున్నాను,’ అని ఓ నెటిజన్​ అభిప్రాయపడ్డాడు. ఇంకొందరు.. ఇదే తరహా స్టోరీ ఉన్న సినిమా పేర్లను కామెంట్లుగా పెట్టారు.