500 నోట్ల క‌ట్ట‌ల‌తో పోలీస్ భార్య సెల్ఫీ

ఉత్తరప్రదేశ్ కు చెందిన పోలీస్ భార్య పిల్లలు 27 కట్ల 500 నోట్లతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇప్పుడు చిక్కుల్లో పడిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అక్షరాల 14 లక్షలు తమ ముందు పెట్టుకొని, యూపీ చెందిన పోలీస్ భార్య, పిల్లలు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టారు.  సోషల్ మీడియా ప్రకారం:  ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో గ్రామానికి చెందిన పోలీస్ హఠాత్తుగా ట్రాన్స్ఫర్ కి గురయ్యాడు. […]

Share:

ఉత్తరప్రదేశ్ కు చెందిన పోలీస్ భార్య పిల్లలు 27 కట్ల 500 నోట్లతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇప్పుడు చిక్కుల్లో పడిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అక్షరాల 14 లక్షలు తమ ముందు పెట్టుకొని, యూపీ చెందిన పోలీస్ భార్య, పిల్లలు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టారు. 

సోషల్ మీడియా ప్రకారం: 

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో గ్రామానికి చెందిన పోలీస్ హఠాత్తుగా ట్రాన్స్ఫర్ కి గురయ్యాడు. భార్య పిల్లలు 27 కట్ల 500 నోట్లతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇప్పుడు చిక్కుల్లో పడిపోయాడు. అంతేకాకుండా పిల్లలు, భార్య అంత మొత్తంలో డబ్బుల కట్టలు ముందు పెట్టుకుని తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ పోలీస్ అధికారి మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరగనున్నట్లు తెలిసింది.  

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో లో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ కి చెందిన పోలీస్ అధికారి భార్య మరియు పిల్లలు బెడ్ మీద ఉన్నారు. అంతేకాకుండా, తమ ఎదురుగుండా సుమారు 14 లక్షల 500 నోట్ల కట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడిందో, వెంటనే సీనియర్ పోలీస్ అధికారి ద్వారా ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది జరిపించమని ఆర్డర్ వచ్చింది. అయితే స్టేషన్ ఇంచార్జ్ రమేష్ చంద్ర సహానికి ట్రాన్స్ఫర్ జరిగినట్లు తెలుస్తుంది. 

దీని గురించి రమేష్ చంద్ర ఏమంటున్నారు: 

అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆ ఫోటో, నవంబర్ 14 2021లో తీసుకున్న ఫోటోగా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, వారు ఒక ప్రాపర్టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని, తమ భార్యా పిల్లలు బెడ్ మీద ముందు పెట్టుకొని ఫోటో దిగినట్లు ఆయన ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. 

సీనియర్ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం, “స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. సోషల్ మీడియాలో విడుదలైన ఫోటోలో, ఆయన భార్యా మరియు పిల్లలు నోట్ల కట్లతో కనిపించడం జరిగింది. అయితే వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడుతున్నారు” అని అధికారి పేర్కొన్నారు.

అసలు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు గానీ, ఒక చిన్న ఫోటో కారణంగా ఒక పోలీసు చిక్కుల్లో పడినట్లు జరిగింది. ముఖ్యంగా ఫోటోలో డబ్బులు కట్టలు ఉండడం, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఒక పోలీస్ అధికారి భార్యా పిల్లలు అవడం ఇక్కడ గమనార్హం. అందుకే ఈ ఫోటో చర్చనీయంగా మారింది. అది ఎప్పుడో తీసుకున్న ఫోటో అయినప్పటికీ, అది తమ కష్టార్జితం అయినప్పటికీ, డబ్బులు కట్టలతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మాత్రం, ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుందని మనం ఈ వార్త ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ప్రజలను కాపాడవలసిన పోలీసులు, దొంగ దారిలో డబ్బులు సంపాదిస్తున్నారు అని చాలామంది విమర్శలు కూడా లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేయడంలో మాత్రం ప్రతి ఒక్కరు నియమాలు పాటించాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ద్వారా నిజ నిజాలు  బయటకిరానున్నాయి.