యూపీ పోలీస్ ర‌చ్చ‌

సాధారణంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం అత్యంత అవసరమైతే తప్ప ప్రజలపై విచక్షణారహితంగా భౌతిక దాడికి దిగకూడదు.ముఖ్యంగా చెప్పుతో కొట్టడం, బూటుతో తన్నడం లాంటివి చేయకూడదు.ఎందుకంటే ఇది మానవుల గౌరవానికి భంగం కలిగించినట్లు అవుతుంది. అందుకే చేయి చేసుకున్నా వారికి ఇచ్చిన లాఠీలతోనే కొట్టాలి.రూల్స్, చట్ట ప్రకారమే వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, హర్దోయ్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ దినేష్ అధికారం ఉందనే అహంతో రెచ్చిపోయాడు.ఈ పోలీస్ ఆఫీసర్ అతిగా మద్యం సేవించి […]

Share:

సాధారణంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం అత్యంత అవసరమైతే తప్ప ప్రజలపై విచక్షణారహితంగా భౌతిక దాడికి దిగకూడదు.ముఖ్యంగా చెప్పుతో కొట్టడం, బూటుతో తన్నడం లాంటివి చేయకూడదు.ఎందుకంటే ఇది మానవుల గౌరవానికి భంగం కలిగించినట్లు అవుతుంది.

అందుకే చేయి చేసుకున్నా వారికి ఇచ్చిన లాఠీలతోనే కొట్టాలి.రూల్స్, చట్ట ప్రకారమే వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, హర్దోయ్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ దినేష్ అధికారం ఉందనే అహంతో రెచ్చిపోయాడు.ఈ పోలీస్ ఆఫీసర్ అతిగా మద్యం సేవించి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అని తన షూతో మందు బాబుని ఏకంగా 38 సార్లు కొట్టాడు! 

ఈ ఘటన మొత్తం కెమెరాకు చిక్కింది.ఆ వీడియోలో, దినేష్ అత్రి( Dinesh Atri ) తన షూతో ఏకంగా 38 సార్లు కొద్దుతున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది.  అలానే ఏం జరిగిందో పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీశారు.

కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించడానికి బదులుగా అతను తన బూటుతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ తన డ్యూటీని మరిచాడు పోలీస్ ఆఫీసర్. అయితే రీసెంట్ కేసులో వైరల్ వీడియోను ఉన్నతాధికారులు చూసిన తర్వాత, దినేష్ అత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై దర్యాప్తు చేసి అతడి తప్పు ఉందని గ్రహించి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు..

ఆ రోజు ఎం జరిగింది అంటే….

దినేష్ పోలీసు యూనిఫారం ధరించకుండా సాధారణ బట్టలే వేసుకున్నాడు.ఏదో కొనడానికి సమీపంలోని మార్కెట్‌కి వెళ్లాడు. అదే మార్కెట్‌లో మందు తాగిన ఒక వ్యక్తి మహిళలతో సహా ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం దినేష్ చూశాడు.ఆ వ్యక్తి దుకాణదారుల నుంచి ఫ్రీగా కూల్ డ్రింక్స్ డిమాండ్ చేయడం కూడా గమనించాడు. ఆ వ్యక్తి పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించకుండా అడ్డుకునేందుకు దినేష్ ప్రయత్నించాడు.ఆ వ్యక్తి అతనితో కూడా దురుసుగా ప్రవర్తించాడు.

అంతే, ఆగ్రహించిన కానిస్టేబుల్ దినేష్ ఆ వ్యక్తిని షూతో చాలాసార్లు కొట్టాడు.ఆలా పోలీస్ ఆఫీసర్ అదుపు తప్పి ఆ మందు బాబు మీద విరుచుకు పది అన్ని రూల్స్ మరిచి తన షూ తీసి అన్ని సార్లు బాదడం అక్కడే ఉన్న వ్యక్తి అతని ఫోన్ కెమెరా తో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు చేసిన వెంటనే వీడియో వైరల్ అయ్యి ఆ విష్యం పై అధికారులు వరుకు వెళ్ళింది .

వెస్ట్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ దుర్గేష్ కుమార్ సింగ్( Durgesh Kumar Singh ) ఈ ఘటన పై మాట్లాడుతూ బెజా క్రాసింగ్ అనే ప్రదేశంలో వీడియో తీశారని, ఇది షహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు.బూట్‌తో కొట్టడం చాలా బాధాకరమని, ఈ సంఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా ‘సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. కానిస్టేబుల్‌ సివిల్‌ దుస్తుల్లో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లాడు. ఓ వ్యక్తి  మద్యంతాగి ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించాడు. అతడిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌ పైనా తిరగబడ్డాడు. దాంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన లో దూకుడు ప్రదర్శించిన పోలీసును వెంటనే సస్పెండ్‌ చేశామని వెల్లడించారు.