సుప్రీంకోర్టుకు జూనియర్ ని పంపించిన సీనియర్ లాయర్

ఇటీవల కాలంలో కోర్టులో జరిగే కొన్ని విషయాలు కనువిప్పును కలిగిస్తూ ఉంటాయి. . సుప్రీంకోర్టులో వాదన వినేందుకు సిద్ధంగా ఉన్న జడ్జిల ముందుకు వచ్చిన జూనియర్, తన వాదన వినిపించకపోవడం ఏ కాకుండా, తనకి కేసు విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియదని చెప్పేసరికి, ఫైర్ అయ్యారు జడ్జిలు.  తర్వాత ఏం జరిగిందంటే:  సుప్రీంకోర్టులో ఒక లాయర్ తన జూనియర్ లాయర్ ని పంపించినందుకు ₹2,000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందంటే, అడ్వకేట్ అత్యవసర […]

Share:

ఇటీవల కాలంలో కోర్టులో జరిగే కొన్ని విషయాలు కనువిప్పును కలిగిస్తూ ఉంటాయి. . సుప్రీంకోర్టులో వాదన వినేందుకు సిద్ధంగా ఉన్న జడ్జిల ముందుకు వచ్చిన జూనియర్, తన వాదన వినిపించకపోవడం ఏ కాకుండా, తనకి కేసు విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియదని చెప్పేసరికి, ఫైర్ అయ్యారు జడ్జిలు. 

తర్వాత ఏం జరిగిందంటే: 

సుప్రీంకోర్టులో ఒక లాయర్ తన జూనియర్ లాయర్ ని పంపించినందుకు ₹2,000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందంటే, అడ్వకేట్ అత్యవసర పనిమీద కోర్టుకు రాలేని పరిస్థితి, అయితే అడ్వకేట్ తన జూనియర్ ని సుప్రీంకోర్టులో తన క్లైంట్స్ ని ప్రవేశపెట్టి వాయిదా తీసుకోమని పంపించడం జరిగింది. 

ఈ క్రమంలోనే, ముగ్గురు జడ్జిలు ఉన్న బెంచ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, వాదన వినెందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, జూనియర్ లాయర్ తనకు కేసు గురించిన విషయాలు సరిగా తెలియవని, వాదన వినిపించేందుకు తమ అడ్వకేట్ అవైలబుల్ గా లేరని జడ్జిలకు చెప్పడం జరిగింది. అయితే వాయిదా వేయమని అడిగిన జూనియర్ లాయర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జిలు.. తాము వాదన వినేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు.. వాయిదా వేయమని కచ్చితంగా అడగడాన్ని ఖండించారు జడ్జీలు. 

ప్రశ్నించిన జడ్జ్: 

అంతేకాకుండా తనకి వాదన వినిపించడానికి కూడా కేసు విషయంలో తనకి ఎటువంటి సమాచారం లేదని.. తమ అడ్వకేట్ తమకి ఏం చెప్తే అదే చేశామని జూనియర్ జడ్జీలకు వివరించడం జరిగింది. అయితే తాము వాదన వినేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నామని, సీనియర్ అడ్వకేట్ ను కాల్ ద్వారా హాజరు పరచమని జూనియర్ కు సలహా ఇచ్చారు జడ్జిలు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లోకి వచ్చిన అడ్వకేట్ జడ్జిలకు అదే విధంగా కోర్టు వారికి క్షమాపణలు తెలియజేయడం జరిగింది. 

జూనియర్ లాయర్ ను పంపించినందుకు అడ్వకేట్ ని ప్రశ్నించారు కోర్టు వారు. అంతే కాకుండా కేసు విషయంలో సరైన సమాచారం లేకుండా, సరైన పేపర్స్ లేకుండా, జూనియర్ లాయర్ ని పంపించినందుకు అడ్వకేట్ మీద కాస్త మండిపడ్డారు జడ్జిలు. ఒక జూనియర్‌ని ఎలాంటి పేపర్లు లేకుండా ప్రిపేర్ కాకుండా పంపించారని.. వాయిదా వేయడానికి నిరాకరించినప్పుడు, న్యాయవాది కాల్ ద్వారా కనెక్ట్ అవడం.. నిజానికి కేసు విషయాలను ఈ పద్ధతిలో నిర్వహించలేమని.. అడ్వకేట్ చేసిన పని కారణంగా.. కోర్టుకు, అదేవిధంగా ఎలాంటి పేపర్ లేకుండా కనిపించేలా చేసిన జూనియర్‌కు నష్టం వాటిల్లుతోందని.. జడ్జీలు అభిప్రాయపడ్డారు. 

రికార్డ్‌లో ఉన్న న్యాయవాది ₹ 2,000 ఖర్చులను సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్‌లో డిపాజిట్ చేయాలని..  దానికి సంబంధించిన రసీదును సమర్పించాలనీ, కోర్టు చెప్పడం జరిగింది.

జూనియర్ లు ప్రిపేర్ గా ఉండాలి: 

ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు కోర్ట్లో జరగడం సహజం. చాలామంది సీనియర్ లాయర్లు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నప్పుడు, తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. జూనియర్ లాయర్లను కోర్టుకు వెళ్ళమని సలహా ఇస్తారు. అయితే ఈ క్రమంలో తరచుగా వాయిదా తీసుకునే పద్ధతి చూస్తూనే ఉంటాము.. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే, బెంచ్ వాదన వినిపించమని అడగడం జరుగుతుంది. కానీ ఆ సందర్భంలో జూనియర్ లాయర్ కు కేసు విషయం మీద కొంత సమాచారం తెలిసి ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. లేదంటే, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు జడ్జిలు మండిపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగిన సందర్భం కూడా అలాంటిదే, జూనియర్ లాయర్ వెళ్లినప్పటికీ తనకు కేసు విషయంపై ఎటువంటి అవగాహన లేకపోవడం జడ్జిలను కాస్త అసహనానికి గురి చేసింది అని చెప్పుకోవాలి. అడ్వకేట్ లేని సందర్భంలో కేసు తీసుకోవలసిన జూనియర్ లాయర్ వాదనకు సిద్ధంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.