రాహుల్ గాంధీకి సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలనుద్దేశించి కృతజ్ఞతలు చెప్పిన నితిన్ గడ్కరీ..

ఈ రోజుల్లో  రాహుల్ ఏవో వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కడం కామన్ అయిపోయింది. ఇటీవల లండన్లో “నేను సావర్కర్ ని కాను, గాంధీని” అని రాహుల్ అన్న మాటలు ఎన్నో విమర్శలకు తెరలేపాయి. అయితే దీనిని ఉద్దేశించి, రాహుల్ భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యాఖ్యానిస్తుండాలని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశానికి సావర్కర్ అందించిన సేవలను స్పందించుకునేందుకు రాష్ట్రంలో సావర్కర్ గౌరవ యాత్రను చేపడుతున్నట్లు షిండే సారథంలోని శివసేన గత మార్చిలో ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ […]

Share:

ఈ రోజుల్లో  రాహుల్ ఏవో వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కడం కామన్ అయిపోయింది. ఇటీవల లండన్లో “నేను సావర్కర్ ని కాను, గాంధీని” అని రాహుల్ అన్న మాటలు ఎన్నో విమర్శలకు తెరలేపాయి. అయితే దీనిని ఉద్దేశించి, రాహుల్ భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యాఖ్యానిస్తుండాలని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశానికి సావర్కర్ అందించిన సేవలను స్పందించుకునేందుకు రాష్ట్రంలో సావర్కర్ గౌరవ యాత్రను చేపడుతున్నట్లు షిండే సారథంలోని శివసేన గత మార్చిలో ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన సర్కార్ ఈ యాత్రను ప్రారంభించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

 సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..

స్వాతంత్ర యోధుడు, వీరుడు సావర్కర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా మహారాష్ట్రలో రగడ కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ విదేశాల్లో వ్యాఖ్యానించడంపై క్షమాపణలు చెబుతారా? అని రాహుల్ గాంధీని విలేఖరులు ప్రశ్నించినప్పుడు.. తాను సావర్కర్‌ను కానని చెప్పటంతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. 

లండన్‌లో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత ప్రతిష్టను దిగజార్చే లాగా ఉన్నాయని.. ఇందుకుగాను ఆయన క్షమాపణలు చెప్పాలని  బీజేపీ డిమాండ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 25న రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చారు. తాను సావర్కర్‌ను కాదని, తన పేరు గాంధీ అని, క్షమాపణలు ఎట్టి పరిస్థితిలో చెప్పనని తేల్చి చెప్పారు. సావర్కర్‌పై ఆయన వ్యాఖ్యలను  బీజేపీ తప్పు పట్టగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే సైతం రాహుల్ పై విరుచుకుపడ్డారు.

సావర్కర్ మాకు దైవంతో సమానమని ఆయనను అవమానిస్తే సహించేదే లేదంటూ తేల్చి చెప్పారు.. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష నేతలతో మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా థాకరే వర్గం శివసేన నేతలు హాజరయ్యారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సోనియా గాంధీ రాహుల్ తో కలిసి శివసేన ఎంపీ సంజయ్ రౌతుతో సమావేశమయ్యారు. ఈ సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలుస్తుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం అధికార శివసేన పక్షం-  బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై, ఉద్ధవ్ థాకరేపై మండిపడుతూనే ఉన్నాయి. సావర్కర్‌ను రాహుల్ విమర్శిస్తున్నా థాకరే ఇంకా మహా వికాస్ అఖాడాలో కొనసాగించడంపై ఫడ్నవిస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నిలదీశారు. 

డబ్బులు పుష్కలంగా ఉన్నవాళ్లు వీర సావర్కర్‌ను అవమానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ యశ్వంతరావు చవాన్ లాంటి కాంగ్రెస్ పెద్దలు వీర సావర్కర్‌ను గౌరవించారని ఫడ్నవిస్ తెలియజేశారు. “సావర్కర్‌ను అగౌరవపరచడానికి నువ్వు ఎవరివి?” అంటూ రాహుల్ మీద ‘ఫడ్నవిస్ ‘ విరుచుకుపడ్డారు. సావర్కర్ వంటి గొప్ప స్వాతంత్య్ర సమారా యోధుడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు.