కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు

చేవెళ్లలో బీజేపీ ప్రభుత్వం ఆదివారం నిర్వహించ తలపెట్టిన “విజయ సంకల్ప సభ” కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఆయన పర్యటనలో ఇప్పుడు స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన చేవెళ్ళకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. అయితే ఈ పర్యటన సందర్భంగా అమిత్ […]

Share:

చేవెళ్లలో బీజేపీ ప్రభుత్వం ఆదివారం నిర్వహించ తలపెట్టిన “విజయ సంకల్ప సభ” కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఆయన పర్యటనలో ఇప్పుడు స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన చేవెళ్ళకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

అయితే ఈ పర్యటన సందర్భంగా అమిత్ షా నోవాటెల్ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా యూనిట్‌ను కలవాల్సి ఉంది. అలాగే బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కూడా జరగాల్సి ఉంది. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రెండు కార్యక్రమాలను రద్దు చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సభ ముగియగానే అమిత్ షా తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా చేవెళ్లలో నిర్వహించబోయే బహిరంగ సభ ఒక సంచలనం కావాలి అని, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సత్తా చాటాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇకపోతే సభలో అమిత్ షా అభివృద్ధి కార్యక్రమాలపై కీలక ప్రకటన చేస్తారని.. రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు బండి సంజయ్ శనివారం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నేతలతో టెలీకాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇక విజయ సంకల్ప సభ ఏర్పాట్లను సమీక్షించారు. ఇక రాష్ట్ర ప్రజలంతా కూడా బీజేపీపై నమ్మకంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని తెలంగాణలో కూడా అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలను సీఎం కేసీఆర్ మరిన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ ఆయనను అన్ని రకాలుగా టార్గెట్ చేస్తోందని ఒకవైపు తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి తెలంగాణలో భగ్గుమన్నాయి. మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

ఇక మరొకవైపు సభ ఏర్పాట్లను చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే శక్తి కేవలం ఒక బీజేపీకే ఉంది అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమిత్ షా పర్యటన సందర్భంగా చేవెళ్లలో కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ బహిరంగ సభ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బహిరంగ సభ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేయగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 2,789 పోలింగ్ బూత్ల నుంచి కార్యకర్తలు హాజరవుతారని ఆయన తెలిపారు.

ఇకపోతే ఈ బహిరంగ సభను హైదరాబాద్‌కు దగ్గరలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరవుతారని ఆశిస్తున్నారు.