చదువుకున్న వాళ్ళకి ఓటు వెయ్యమన్న టీచర్ సస్పెండ్

అనాకాడెమీలో ఇటీవల కాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అనాకాడెమీలో టీచర్గా పని చేస్తున్న వ్యక్తిని ఒక సంఘటన కారణంగా డిస్మిస్ చేయడం జరిగింది. కరణ్ సంగ్వాన్ అనే టీచర్ స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతూ, ఎలక్షన్స్ లో కేవలం చదువుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే ఓటు వేయండి అంటూ మాట్లాడినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.  అసలు విషయం ఏమిటి:  ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్ అనాకాడెమీ నుండి ఒక ట్యూటర్ వీడియో […]

Share:

అనాకాడెమీలో ఇటీవల కాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అనాకాడెమీలో టీచర్గా పని చేస్తున్న వ్యక్తిని ఒక సంఘటన కారణంగా డిస్మిస్ చేయడం జరిగింది. కరణ్ సంగ్వాన్ అనే టీచర్ స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతూ, ఎలక్షన్స్ లో కేవలం చదువుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే ఓటు వేయండి అంటూ మాట్లాడినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. 

అసలు విషయం ఏమిటి: 

ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్ అనాకాడెమీ నుండి ఒక ట్యూటర్ వీడియో వైరల్ అయ్యింది. మీరు నెక్స్ట్ టైం ఓటు వేస్తున్నప్పుడు ఈ విషయం మర్చిపోకండి, బాగా చదువుకున్న వారికి ఓటు వేయండి అంటూ, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండదని.. చదువుకున్న మరియు విషయాలను అర్థం చేసుకునే వ్యక్తిని ఎన్నుకోండి. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారిని ఎన్నుకోవద్దని.. సరిగ్గా నిర్ణయించుకోండి,అని ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్ అనాకాడెమీకి చెందిన విద్యావేత్త కరణ్ సాంగ్వాన్, దేశంలోని నేర న్యాయ వ్యవస్థను సరిదిద్దడానికి ప్రభుత్వం ఇటీవలి తీసుకువచ్చిన బిల్లులను గురించి విద్యార్థులకు బోధిస్తున్న సందర్భంలో ఈ విషయాలు చెప్పడం జరిగింది. కరణ్ సింగ్వన్ అనే టీచర్ స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతూ, ఎలక్షన్స్ లో కేవలం చదువుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే ఓటు వేయండి అంటూ మాట్లాడినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. 

బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై, సంగ్వాన్ ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్ తో మాట్లాడటం జరిగింది. క్రిమినల్ చట్టంపై తాను తయారు చేసిన నోట్స్ ప్రస్తుతం, కొత్తగా పేరు మార్చిన బిల్ కారణంగా విలువ లేకుండా పోయింది అంటూ మాట్లాడటం జరిగింది. ఇదే సందర్భంలో, నెక్స్ట్ టైం ఓటు వేస్తున్నప్పుడు ఈ విషయం మర్చిపోకండి, బాగా చదువుకున్న వారికి ఓటు వేయండి అంటూ, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండదని.. చదువుకున్న మరియు విషయాలను అర్థం చేసుకునే వ్యక్తిని ఎన్నుకోండి. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారిని ఎన్నుకోవద్దని.. సరిగ్గా నిర్ణయించుకోండి,అని ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్ అనాకాడెమీకి చెందిన విద్యావేత్త కరణ్ సాంగ్వాన్, దేశంలోని నేర న్యాయ వ్యవస్థను సరిదిద్దడానికి ప్రభుత్వం ఇటీవలి తీసుకువచ్చిన బిల్లులను గురించి విద్యార్థులకు బోధిస్తున్న సందర్భంలో ఈ విషయాలు చెప్పడం జరిగింది. 

సంగ్వాన్ ఆన్లైన్ వీడియో వైరల్ గా మారడంతో చాలా మంది తాను బిజెపి గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, సంగ్వాన్ అనాకాడెమీ తరుపున ఇలా మాట్లాడి ఉండొచ్చు అంటూ, తాను యాంటీ మోదీ సిస్టం గురించి పని చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వర్షం కురిసింది. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఈ వైరల్ గా మారిన వీడియో చూసిన మరి కొంతమంది, సంగ్వాన్ మాటలకు సపోర్ట్ చేస్తూ, తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

అనాకాడెమీ ఏమంటుంది: 

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో వైరల్ గా మారిన ఈ వీడియో టీచర్ డిస్మిస్ కి కారణమైంది. ముఖ్యంగా తాను చేసిన వ్యాఖ్యలు కోడ్ ఆఫ్ కండక్టర్ అంటే కాంట్రాక్ట్ విరుద్ధంగా ఉన్నాయి అంటూ, తమ అకాడమీ రూల్స్ ఉల్లంఘించినందున టీచర్ ని వీధుల నుంచి తీసేస్తున్నట్లు, అనాకాడెమీ కోపౌండర్ రోమన్ సాయినీ మాట్లాడుతూ వెల్లడించారు. 

అయితే సోషల్ మీడియాలో టీచర్ డిస్మిస్ అయిన అనంతరం, అపోజిషన్ పార్టీలు చాలామంది అనాకాడెమీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా ఖండించారు. చదువుకున్న వాళ్ళకి ఓటు వెయ్యమనడం అసలు తప్పయిన విషయమే కాదని, అనాకాడెమీ టీచర్ ని విధుల నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదు అంటూ పేర్కొన్నారు.