మానవతా సహాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్

ఉక్రెయిన్  ఉప విదేశాంగ మంత్రి ఝపరోవా తన పర్యటనలో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో భాగంగా ఆర్థిక, రక్షణ, మానవతా సహాయం మరియు గ్లోబల్ సమస్యల వంటివి ఉన్నాయి. ఉక్రెయిన్‌ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్‌ ఝపరోవా ఇటీవలి మూడు రోజుల భారత్‌ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్‌కీ రాసిన లేఖను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి […]

Share:

ఉక్రెయిన్  ఉప విదేశాంగ మంత్రి ఝపరోవా తన పర్యటనలో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో భాగంగా ఆర్థిక, రక్షణ, మానవతా సహాయం మరియు గ్లోబల్ సమస్యల వంటివి ఉన్నాయి.

ఉక్రెయిన్‌ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్‌ ఝపరోవా ఇటీవలి మూడు రోజుల భారత్‌ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్

జెలెన్స్‌కీ రాసిన లేఖను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీకి అందజేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్‌కీ.. భారతదేశం నుండి వైద్య పరికరాలతో సహా అదనపు మానవతా సహాయాన్ని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఝపరోవా.. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీని కలిశారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించడంతో పాటు, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ప్రధాని మోదీని ఉద్దేశించి రాసిన ఒక లేఖను కూడా ఆమెకు అందజేశారు. మందులు, వైద్య పరికరాలతో సహా అదనపు మానవతా సహాయం కోసం ఉక్రెయిన్ అభ్యర్థనను కూడా ఆమె తెలియజేసింది.

న్యూఢిల్లీ మరియు కైవ్‌ల మధ్య తదుపరి ఇంటర్- గవర్నమెంటల్ కమీషన్ భారతదేశంలో అనుకూలమైన తేదీలో నిర్వహించబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఇక జెలెన్స్‌కీ రాసిన లేఖపై స్పందించిన భారత్.. ఉక్రెయిన్‌కు మానవతా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇక గత సెప్టెంబర్‌ నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారో మంత్రి లేఖీ ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ “ఇది యుద్ధం చెయ్యాల్సిన సమయం కాదని” పునరుద్ఘాటించారు.

“ఇది యుద్ధానికి సమయం కాదు అని ప్రధాని మోదీ.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో  అన్నారన్న ఆమె.. ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఝపరోవాను  కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక మరియు ప్రపంచ సమస్యలపై ఆమె తమ అభిప్రాయాలను తెలియజేశారు. సాంస్కృతిక బంధాలు మరియు మహిళా సాధికారతపై కూడా చర్చ జరిగింది. తమకు వీలైనంత సహాయం చేస్తామని ఉక్రెయిన్‌కు భారత్ తరపున హామీ ఇస్తున్నాం” అని మంత్రి లేఖీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఝపరోవా మంగళవారం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. “ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీతో  సమావేశం జరిగింది. ఉక్రెయిన్.. రష్యాపై పోరాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించాను. సంస్కృతితో సహా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై కూడా మేము  చర్చించాము. త్వరలో భారతదేశంలో ఉక్రేనియన్ రచయిత్రి జెలెన్స్కా రచనలతో కూడిన బుక్‌షెల్వ్‌లు మరియు ఆడియో గైడ్‌లు అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఝపరోవా తన పర్యటనలో భాగంగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సంజయ్ వర్మతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో ఆర్థిక, రక్షణ, మానవతా సహాయం మరియు  ప్రపంచ సమస్యలపై చేర్చించారు.

ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సెక్రటరీకి వివరించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కైవ్‌లో ఈ సారి విదేశాంగ కార్యాలయ సంప్రదింపులను అనుకూలమైన తేదీలో నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం భారతీయ కంపెనీలకు మంచి అవకాశంగా ఉంటుందని ఉక్రెయిన్ డిప్యూటీ ఎఫ్‌ఎం కూడా ప్రతిపాదించారు. భారతదేశం మందులు, వైద్య పరికరాలను అందించిందని, ఉక్రెయిన్‌కు పాఠశాల బస్సులు మొదలైనవాటిని అందజేస్తుందని సెక్రటరీ సంజయ్ వర్మ తెలిపారు.