కొత్త రచ్చకు తెరతీసిన స్టాలిన్ కుమారుడు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురించి చాలా మందికే తెలుసు. ఆయన చాలా డైనమిక్ లీడర్. దివంగత మాస్ లీడర్ కరుణానిధి కొడుకే ఈ ఎంకే స్టాలిన్. స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న జయలలిత పార్టీ మీద విజయం సాధించడం ద్వారా స్టాలిన్ తమిళ సీఎం కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి స్టాలిన్ కు అస్సలుకే పడదు. ఆయన ఎప్పుడూ బీజేపీని విమర్శిస్తూనే ఉంటారు. అందుకే ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరిపోయారు. […]

Share:

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురించి చాలా మందికే తెలుసు. ఆయన చాలా డైనమిక్ లీడర్. దివంగత మాస్ లీడర్ కరుణానిధి కొడుకే ఈ ఎంకే స్టాలిన్. స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న జయలలిత పార్టీ మీద విజయం సాధించడం ద్వారా స్టాలిన్ తమిళ సీఎం కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి స్టాలిన్ కు అస్సలుకే పడదు. ఆయన ఎప్పుడూ బీజేపీని విమర్శిస్తూనే ఉంటారు. అందుకే ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరిపోయారు. దీంతో బీజేపీ వారంతా స్టాలిన్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా? అని ఎదురు చూస్తున్నారు. పలు ప్రోగ్రాంలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇలా చూస్తుండగానే బీజేపీ పార్టీ వారికి ఓ బంపర్ ఆఫర్ దొరికేసింది. స్టాలిన్ కుమారుడు తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఓ సమావేశంలో సనాతన ధర్మం మీద వైరల్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో దేశం మొత్తం ఉదయనిధిని అరెస్ట్ చేయాలని తిరుగుతోంది. దీంతో పోలీసులు ఉదయనిధికి కూడా సెర్చ్ చేస్తున్నారు. 

వ్యాధుల‌తో పోల్చిన మంత్రి

ఓ సభలో మాట్లాడిన మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని వ్యాధుల‌తో పోల్చడం దీంతో అక్కడ ఉన్న వారు స్టాలిన్ వ్యాఖ్యలను విని ఒక్కసారి షాక్ కు గురయ్యారు. అతడు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా లాంటి జబ్బులతో పోల్చారు, దాంతో బీజేపీ లీడర్లు స్టాలిన్ మీద అంతే కాకుండా ఇండియా కూటమి మీద కూడా విరుచుకుపడుతున్నారు. అతడు మాట్లాడుతూ… సామాజిక న్యాయానికి సనాతన ధర్మం విరుద్ధంగా ఉందని, దాన్ని నిర్మూలించాలని అన్నాడు. సనాతన అంటే మలేరియా డెంగ్యూ లాంటిదని దానిని ఖచ్చితంగా నిర్మూలించాలి గాని వ్యక్తిరేకించకూడదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. తమిళనాడు మంత్రి మీద కేసులు పెట్టేందుకు కూడా కొంత మంది సమాయత్తం అవుతున్నారు. కొన్ని చోట్ల కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి. 

ఇండియాకు అవకాశం ఇవ్వొద్దు… 

ఇలా స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వైరల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ఆయన ట్విటర్ లో సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు. రాహుల్ గాంధీయేమో ‘ప్రేమ యొక్క దుకాణం’ అని మాట్లాడతారు కానీ కాంగ్రెస్ మిత్రపక్షమైన స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలిద్దాం అని మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖలకు కూడా కాంగ్రెస్ మౌనంగా ఉంది. దీని వల్ల జాతి విధ్వంసం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇండియా కూటమి పేరుకు తగ్గట్టుగానే ఉంది, దీనికి గాని మనం అవకాశమిస్తే ఎన్నో ఏళ్ళుగా మనం కాపాడుకుంటూ వచ్చిన నాగరికతను నిర్మూలిస్తుందంటూ అమిత్ మాలవీయ తెలిపారు. 

రచయిత కాన్ఫరెన్స్ లో 

చెన్నైలో జరిగిన రచయితల కాన్ఫరెన్స్ లో ఉదయనిధి ఈ వైరల్ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆలోచన సహజంగానే తిరోగమనశీలిగా ఉంటుందని, కులం పేరుతో జెండర్ పేరుతో జనాలని విభజిస్తున్నారని అది సామాజిక న్యాయానికి సమానత్వానికి ఖచ్చితంగా వ్యతిరేకమని తమిళనాడు మంత్రి వాదించారు. మాలవీయ ట్వీట్ కు స్పందిస్తూ, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం ఆపండని అన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారిని నిర్మూలించండని నేనెప్పుడూ అనలేదని.. సనాతన ధర్మం కులాల పేరుతో మతాల పేరుతో ప్రజలను విడదీస్తోన్న ఒక సూత్రం. సనాతన ధర్మాన్ని  నిర్మూలించడం ద్వారా మానవత్వాన్ని, మానవ సమానత్వాన్ని నిలబెట్టినట్టు అవుతుందని ఆయన తెలిపారు.  నేను అన్న ప్రతీ మాట మీద నిలబడి ఉంటున్నానని తెలిపారు.