ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అమానుష ఘ‌ట‌న‌

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో అమానుషమైన ఘటన వెలుగు చూసింది.ఇటీవలి కాలంలో అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ దళితుడిపై ప్రబుద్ధుడు మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సీరియస్‌గానే స్పందించారు. బాధితుడ్ని రప్పించి.. అతడికి పాదపూజ చేసి ఆ నీళ్లు తన నెత్తిని చల్లుకున్నారు సీఎం చౌహన్. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  నేరస్తుల్ని […]

Share:

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో అమానుషమైన ఘటన వెలుగు చూసింది.ఇటీవలి కాలంలో అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ దళితుడిపై ప్రబుద్ధుడు మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సీరియస్‌గానే స్పందించారు. బాధితుడ్ని రప్పించి.. అతడికి పాదపూజ చేసి ఆ నీళ్లు తన నెత్తిని చల్లుకున్నారు సీఎం చౌహన్. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

నేరస్తుల్ని శిక్షించే అర్హత ఒక్క న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది. పోలీసులకు కూడా ఆ అర్హత లేదు. ఆయా నేరారోపణలు, దొరికిన సాక్ష్యాల ఆధారంగా నేరస్తులపై సెక్షన్లు నమోదు చేసి.. న్యాయస్థానానికి పంపించడం వరకే వారి పని. కానీ.. కొందరు మాత్రం చట్టాల్నే తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. నేరస్తులు పట్టుబడితే.. శిక్ష పేరుతో వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నేరస్తుల్ని పోలీసులకు అప్పగించకుండా.. తామే న్యాయనిర్ణేతలమని భావిస్తూ, పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు తాజా ఉదంతమే అందుకు నిదర్శనం.

చికెన్‌, డబ్బులు దొంగతనం చేశారనే ఆరోపణలపై ఓ పౌల్ట్రీఫాం నిర్వాహకులు ఇద్దరు బాలురుపై అమానుషంగా, పైశాచికంగా ప్రవర్తించారు.. మానవత్వం చచ్చిపోయింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది.  మనుషులు మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారు 

బాధిత పిల్లలను దూషించి, కిందకు పడేసి, చేతులు వెనక్కి కట్టి చితకబాదారు.అలాగే వారిని బోర్లా పడుకోమని చెప్పి దుస్తులు తొలగించారు..  ఒక బాటిల్‌లో మూత్రం నింపి, వారి చేత బలవంతంగా తాగించారు. పచ్చి మిరపకాయలు, ఉప్పు స్నాక్స్‌ వంటివి తినిపించి రాక్షస ఆనందం పొందారు అంతటితో ఆగకుండా.. ప్రైవేట్ పార్టుల్లో కారం పోశారు

అంతేకాదు.. బలవంతంగా ఏవేవో ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోనే సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ అబ్బాయిల్లో ఒకరి వయసు 10 సంవత్సరాలు కాగా, మరొకరికి 15 సంవత్సరాలు. డబ్బులు దొంగలించారని చెప్పి.. కొందరు దుండగులు వారిని పట్టుకొని, బంధించారు. నోటికొచ్చిన బూతులతో ఆ ఇద్దరిని తిట్టారు.. సిద్దార్ధ్‌నగర్‌ జిల్లా పత్రాబజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొన్నది.

24 గంటల తర్వాత.. ఓ ఘటన సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పోలీసులు ఆ వీడియోను దృష్టికి తీసుకెళ్లారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఈ విషయం పిల్లలిద్దరి బంధువులకు తెలియడంతో 8 మంది నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు

ఆగస్ట్‌ 4న పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్షన్ చికెన్ షాప్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న పోలీస్‌ ఈ వీడియోను చూసారు .వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు . ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. వీడియోను గుర్తించామని, చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ పేర్కొన్నారు

నిందితులను యుజేర్, అబ్దుల్, రఫుల్లాహ్, షేర్ అలీ, మహ్మద్ అకీబ్, దీపక్‌లను అరెస్ట్ చేశామని వివరించారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరిలో ఒకరు పౌల్ట్రీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిందితులపై పోస్కో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు ఏఎస్పీ వివరించారు.