తల్లిని రక్షించేందుకు హత్య చేసిన కొడుకులు

తమ తల్లిని లైంగికంగా వేధిస్తున్నాడని తెలుసుకున్న ఇద్దరు సోదరులు, అత్యాచారానికి పాల్పడిన అతనిపై దాడి చేయడంతో బీహార్ కూలీ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, వాళ్ల తల్లి మతిస్థిమితం లేని మనిషిని గుర్తించి దాన్ని అతనికి తీసుకొని బీహార్ కోలి ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు. పోలీసుల మాటల్లో:  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురబాబడికి చెందిన నాగుల మల్లేష్ (21), నాగుల దశరథ్ (27) నిజామాబాద్‌లోని శ్మశాన వాటికలో కూలీగా పనిచేశారు. వారు తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. […]

Share:

తమ తల్లిని లైంగికంగా వేధిస్తున్నాడని తెలుసుకున్న ఇద్దరు సోదరులు, అత్యాచారానికి పాల్పడిన అతనిపై దాడి చేయడంతో బీహార్ కూలీ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, వాళ్ల తల్లి మతిస్థిమితం లేని మనిషిని గుర్తించి దాన్ని అతనికి తీసుకొని బీహార్ కోలి ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు.

పోలీసుల మాటల్లో: 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురబాబడికి చెందిన నాగుల మల్లేష్ (21), నాగుల దశరథ్ (27) నిజామాబాద్‌లోని శ్మశాన వాటికలో కూలీగా పనిచేశారు. వారు తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. అంతేకాకుండా వారి తల్లికి మానసిక అనారోగ్యం బాగుండదు. అయితే సరదాగా, ఇద్దరి కొడుకులు శుక్రవారం రాత్రి సినిమా చూసేందుకు వెళ్లగా ఇంట్లో తల్లి ఒంటరిగా ఉంది. అయితే ఇదే అదునుగా చేసుకున్నాడు బీహార్ కి చెందిన కూలీ. కొడుకులు ఇంట్లో లేకపోవడం చూసి, ఇంట్లోకి చొరబడ్డాడు. 

అయితే కొడుకులు సినిమా చూసి తిరిగి వస్తుండగా, అరుణ్ సదా (31) అర్ధరాత్రి సమయంలో తమ తల్లితో అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించారు. ఆవేశంతో అన్నదమ్ములు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి అరుపులు విన్న ఆ ప్రాంతంలోని ఆటో డ్రైవర్లు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అరుణ్ సదా శనివారం రాత్రి మృతి చెందినట్లు సమాచారం. 

 జైలుకు వెళ్లిన కొడుకులు: 

బీహార్‌లోని సహర్సా జిల్లా మక్కరికి చెందిన అరుణ్ సదా నిజామాబాద్‌లో ఒక పూట కూలిగా పనిచేస్తున్నాడు.

నాగుల మల్లేష్, నాగుల దశరథ్‌లను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటనారాయణ తెలిపారు. III పట్టణ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. 

ఆడవాళ్ళకి కొదవైన రక్షణ: 

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. దేశానికి ఆడవాళ్ళకి రక్షణ కొదవ అయిందని ఇలాంటి వార్తలు వింటేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా, తమ పనులు తమ చేసుకోవాలి అన్నా, పోకిరి వాళ్ళ వెకిలి చేష్టలు కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను కూడా విడిచిపెడుతున్నారు. 

కొంతమంది ఆడవాళ్లు ధైర్యంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో, బ్లాక్ మెయిల్ చేయడం కారణంగా, తమ సొంత కుటుంబ సభ్యులను చంపేస్తాను అని బెదిరించిన కారణంగా, ఉద్యోగం పోతుందేమో అని, తన వల్ల తన కుటుంబ సభ్యుల పరువు పోతుందేమో అని, ఉద్యోగం లో మళ్ళీ కష్టమవుతుందేమో, ఇలా అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఆడవాళ్లు కష్టాలకు ఎదురిదాల్సి వస్తుంది. 

మేమున్నాం అంటున్న షీ టీం: 

ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల ఆడవాళ్లకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఆడవాలని వేధించడం, వెకిలి చేష్టలు వేయడం కొంతమందికి అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు షీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆడవాళ్లు ఎక్కడ ఉన్నా వారు ఒకవేళ వేధింపులకు గురి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు షీ టీం.