మద్యం మత్తులో గవర్నర్ కాన్వాయ్ నే గుద్దిన యువకులు

 కేరళ గవర్నర్ కాన్వాయ్ లో భద్రత లోపం తలెత్తింది, శుక్రవారం రాత్రి ఆయన నోయిడా లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ కు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గవర్నర్ కాన్వాయ్ ను రెండు సార్లు ఢీ కొట్టారు.  కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శుక్రవారం నోయిడా సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెక్టార్ 77 లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన […]

Share:

 కేరళ గవర్నర్ కాన్వాయ్ లో భద్రత లోపం తలెత్తింది, శుక్రవారం రాత్రి ఆయన నోయిడా లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ కు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గవర్నర్ కాన్వాయ్ ను రెండు సార్లు ఢీ కొట్టారు. 

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శుక్రవారం నోయిడా సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెక్టార్ 77 లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన పైలట్ కారు మరియు కొన్ని పోలీసు ఎస్కార్ట్ వాహనాలతో కలిసి ఢిల్లీ కు బయలుదేరారు. శుక్రవారం రాత్రి 10:45 సమయంలో ఫ్లీట్ మెట్రో స్టేషన్ సెక్టార్ 76 సమీపంలోకి వచ్చిన తర్వాత నలుపు రంగులో UP 16 DM 3155 కలిగి ఉన్న మహీంద్రా స్కార్పియో వాహనం గవర్నర్ కాన్వాయ్ కు అడ్డంగా వచ్చింది. 

కేరళ గవర్నర్ కాన్వాయ్ లో ఉన్న ఎస్కార్ట్ పోలీసుల బృందం స్కార్పియో వాహనంలో ఉన్న వ్యక్తులను కాన్వాయ్ కు దూరంగా ఉండమని హెచ్చరించారు. అయితే కొద్ది సేపటికే ఆ వాహనం మళ్ళీ వచ్చి కాన్వాయ్ లోని ట్రాఫిక్ పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్కార్పియో వాహనంలో ఉన్న యువకులను అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. 

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నోయిడా శక్తి మోహన్ తెలిపిన వివరాల ప్రకారం స్కార్పియో వాహనంలో ఉన్న ఇద్దరి పేర్లు గౌరవ్ సోలంకి మరియు మోను కుమార్ గా పోలీసులు గుర్తించారు. వారు ఇద్దరు సమీపంలో ఉన్న ఘజియాబాద్ జిల్లాకు చెందిన వారు. గవర్నర్ కాన్వాయ్ ను ఢీ కొట్టిన సమయంలో వారు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ ఇద్దరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.  

ఈ ఘటనలో ఎవరికీ హాని కలగలేదు అని ఎటువంటి గాయాలు కాలేదు అని తెలిసింది, ఆ తర్వాత గవర్నర్ యధావిధిగా ఢిల్లీ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటన ఇప్పటికే కేసు నమోదు చేయగా త్వరలోనే దర్యాప్తు కూడా ప్రారంభించనున్నారు. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం కేరళ గవర్నర్ కాన్వాయ్ ను ఢీ కొట్టడంతో భద్రత లోపం తలెత్తింది. అయితే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నుండి ఎటువంటి ప్రకటన ఇంకా వెలువడలేదు.