145 కోట్లతో  మ్యూజియంను డెవలప్ చేయనున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 145 కోట్లు వెచ్చించి శ్రీ వెంకటేశ్వర మ్యూజియంను డెవలప్ చేయడానికి గాను శుక్రవారం “భూమి పూజ” జరిపించారు. ఇది తిరుమల ఆలయం యొక్క ప్రాముఖ్యత మరియు సంప్రదాయాలను ప్రదర్శిస్తూ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి సౌకర్యంగా మారుస్తుందని భావిస్తున్నారు. ఈ మ్యూజియం గోవిందరాజ పెరుమాళ్ ఆలయానికి చాలా సమీపంలో ఉంది. ఆలయం నుండి దక్షిణ ద్వారం గుండా బయటకు రాగానే ఈ మ్యూజియం కనిపిస్తుంది. విగ్రహాల అరుదైన సేకరణలు, దేవాలయాలు మరియు నిర్మాణం […]

Share:

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 145 కోట్లు వెచ్చించి శ్రీ వెంకటేశ్వర మ్యూజియంను డెవలప్ చేయడానికి గాను శుక్రవారం “భూమి పూజ” జరిపించారు. ఇది తిరుమల ఆలయం యొక్క ప్రాముఖ్యత మరియు సంప్రదాయాలను ప్రదర్శిస్తూ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి సౌకర్యంగా మారుస్తుందని భావిస్తున్నారు.

ఈ మ్యూజియం గోవిందరాజ పెరుమాళ్ ఆలయానికి చాలా సమీపంలో ఉంది. ఆలయం నుండి దక్షిణ ద్వారం గుండా బయటకు రాగానే ఈ మ్యూజియం కనిపిస్తుంది. విగ్రహాల అరుదైన సేకరణలు, దేవాలయాలు మరియు నిర్మాణం గురించి చాలా అరుదైన వార్తలు,

ఆలయ విమానాల చిత్రాలు, వివిధ భగవంతుని రూపాల చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ మ్యూజియం అందుబాటులో ఉంటుంది. దేవాలయాల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. 

టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ..

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, ఆగమ శాస్త్రాల ప్రకారం జరిగిన పూజలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ, “శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటి చెప్పడమే కాకుండా భక్తులకు అనాదిగా వస్తున్న సంప్రదాయాలు, చారిత్రిక ప్రాధాన్యత, అపారమైన వారసత్వ సంపదపై అవగాహన కల్పించే విధంగా ఆకర్షణీయమైన స్థలాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు” తెలిపారు.

మా లక్ష్యం అదే..

సందర్శించే ప్రతి భక్తునికి దివ్య అనుభూతిని అందించడమే మా అంతిమ లక్ష్యం అని ఆయన వ్యాఖ్యానించారు. విరాళాల ప్రాతిపదికన వివిధ గ్యాలరీలను అభివృద్ధి చేయడంలో తమ నైపుణ్యాన్ని అందించినందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు MAP సిస్టమ్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

20 కోట్ల అంచనా వ్యయంతో ఐదు గ్యాలరీలను రూపొందించడానికి MAP సిస్టమ్స్ బాధ్యత వహిస్తుంది. “TCS 125 కోట్ల వ్యయంతో 14 గ్యాలరీల అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది,” అని దేవస్థానం చైర్మన్ చెప్పారు.

ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. మ్యూజియం మూడు అంతస్తుల్లో విస్తరించి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో తిరువీధి, ఆలయ అనుభవం, వాహనాలు, సేవలు మరియు సప్తగిరి 3డి అనుభవంతో కూడిన MAP సిస్టమ్స్ ప్రదర్శనలు ఉంటాయి. అన్నమయ్య రాగి పలకలు మరియు నాణేక సంపదలతో సహా వేంకటేశ్వర స్వామి పురాతన రాయి, లోహం మరియు చెక్క శిల్పాలను ప్రదర్శిస్తూ, గ్రౌండ్ ఫ్లోర్‌కు కూడా TCS సహకారం అందిస్తుంది.

మొదటి అంతస్తులో ఆయుధాలు, సంగీత వాయిద్యాలు మరియు పూజ పాత్రలకు అంకితమైన గ్యాలరీలు ఉంటాయి. రెండవ అంతస్తులో విరాట్‌పురుష్ మరియు చతుర్వేద గ్యాలరీలు ఉంటాయి. మూడవ అంతస్తులో బ్రహ్మాండ గ్యాలరీ ఉంటుంది, ఇది విశ్వం యొక్క గొప్పతనాన్ని హైలైట్ చేస్తుంది.

17 పెద్ద గోపురాలు

ఈ మ్యూజియంలో 17 పెద్ద గోపురాలు ఉన్నాయి, అవి రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య, అన్నమాచార్య, పురందర దాసు మరియు వెంగమాంబ వంటి శ్రీనివాస భగవానుడి భక్తులను ప్రదర్శిస్తుంది, అలాగే శ్రీమద్ రామాయణం మరియు మహాభారతం వంటి పురాతన ఇతిహాసాల నుండి ముఖ్యమైన పాత్రలు మరియు ఎపిసోడ్‌లను ప్రదర్శిస్తాయి. ఈ నిర్మాణం కనుక పూర్తైతే భక్తులకు ఎంతో అనుభూతి కలగనుంది. భక్తులు తిరుమలేశుని సన్నిధికి ఆ స్వామి లీలలను తనివితీరా చూసేందుకు వస్తారు. అటువంటి భక్తులు ఈ మ్యూజియాన్ని అందులోని వస్తువులను చూసి మరింత మురిసిపోతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. టీటీడీ కూడా.. ఈ భవనాన్ని కూడా ఎన్నో హంగులతో నిర్మిస్తోంది.