TSRTCకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం

TSRTC: సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ రికార్డు క్రియేట్ చేసింది.

Courtesy: x

Share:

హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ రికార్డు క్రియేట్ చేసింది. పండగ సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు ప్రయాణాలు చేశారు. విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో విద్యార్థులు కూడా బస్సుల్లోనే వెళ్లిపోయారు. జనవరి 13వ తేదీన ఒక్కరోజులో ఆర్టీసీ బస్సుల్లో 52.78 ల‌క్ష‌ల మంది ప్రయాణించడం విశేషం.  దీంతో ఆర్టీసీకి ఆ ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రో వైపు మ‌హిళ‌ల‌కు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 11న 28 ల‌క్ష‌ల మంది, 12న 28 ల‌క్ష‌ల మంది, 13న 31 ల‌క్ష‌ల మంది ఉచిత ప్ర‌యాణాన్ని వినియోగించుకున్న‌ట్లు పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో కేవలం మూడు రోజుల్లోనే కోటీ 10లక్షలకు పైచిలుకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యమాజన్యం వెల్లడించింది. ఈ మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని 75లక్షలకు పైగా మహిళలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ పథకాన్ని వినియోగించుకున్న మహిళలు 10 కోట్లకు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న సుమారు 28 లక్షల మంది, 13వ తేదీన సుమారు 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. సంక్రాంతికి ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ఆర్టీసీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్దం చేసుకుంది.

సంక్రాంతి పండుగ వేళ బస్సుల్లో ప్ర‌యాణించే మ‌హిళ‌ల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్టీసీ ముందే గ్ర‌హించింది. కాబట్టి, అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. ముందుగా 4,484 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని భావించింది. కానీ ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపిన‌ట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 6,261 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపిన‌ట్లు వివ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ప్ర‌యాణికుల్ని వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

సంక్రాంతి వేళ రద్దీని పర్యవేక్షించేందుకు ముఖ్యమైన పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. వాటిని బస్ భవన్‌లో ఉన్న ముఖ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినందునే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.