Transgender: నామినేషన్ వేసిన ట్రాన్స్ జెండర్

Transgender: తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) రంజుగా, రసవత్తరంగా సాగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎలాగూ చూసే వారికి విందును అందిస్తున్నాయి. అంతే కాకుండా మొన్నటి నుంచే నామినేషన్ల (Nomination) పర్వం మొదలు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ (Nomination) వేసేందుకు పోటీ పడుతున్నారు. ఇక దీంతో ఎక్కడ లేని జోరు కనబడుతోంది. కేవలం అంతా మంచిగున్న వాళ్లు మాత్రమే కాకుండా ఈ సారి పోటీకి ట్రాన్స్ జెండర్లు(Transgender)  కూడా సిద్ధం […]

Share:

Transgender: తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) రంజుగా, రసవత్తరంగా సాగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎలాగూ చూసే వారికి విందును అందిస్తున్నాయి. అంతే కాకుండా మొన్నటి నుంచే నామినేషన్ల (Nomination) పర్వం మొదలు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ (Nomination) వేసేందుకు పోటీ పడుతున్నారు. ఇక దీంతో ఎక్కడ లేని జోరు కనబడుతోంది. కేవలం అంతా మంచిగున్న వాళ్లు మాత్రమే కాకుండా ఈ సారి పోటీకి ట్రాన్స్ జెండర్లు(Transgender)  కూడా సిద్ధం అంటున్నారు. ఇక దీంతో అందరి కళ్లు ఎన్నికల మీద పడుతున్నాయి. ఎలక్షన్లను ఇంకా 20+ డేస్ సమయం ఉన్నా కానీ ఇప్పుడే వాళ్ల మాటలు కాక పుట్టిస్తున్నాయి. దీంతో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అని అంతా లెక్కలేయడం మొదలెట్టారు. ఈ పార్టీయే గెలుస్తుందని అంతా ఒక అంచనాకు వస్తున్నారు. గెలవని పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని బేరీజు వేసుకుంటూ లెక్కలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల (Nomination) గురించి ఆరాలు తీస్తున్నారు. 

నామినేషన్ వేసిన ట్రాన్స్ జెండర్ 

ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లనే (Nomination) కాకుండా ఎవరైనా ప్రత్యేక వ్యక్తులు వేసిన నామినేషన్లను కూడా జనాలు వదలడం లేదు. వారి నామినేషన్ల (Nomination) గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారు నామినేషన్ వేయడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. వారికి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. అలానే కొంత మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడేందుకు  సిద్ధం అవుతున్నారు.  తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) శనివారం రోజు జడ్చర్చ (Jadcherla) నియోజకవర్గం నుంచి 46 సంవత్సరాల ట్రాన్స్ జెండర్(Transgender)   ఒకరు నామినేషన్ (Nomination) ఫైల్ చేశారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొదటి ట్రాన్స్ జెండర్. 46 ఏళ్ల మాత శ్రీ జానకమ్మ శనివారం తన నామినేషన్ (Nomination)ను ఫైల్ చేశారు. దీంతో జానకమ్మ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఎన్నికల్లో నామినేషన్ (Nomination)వేసిన మొదటి ట్రాన్స్ జెండర్ అయింది. 

అందుకోసమే నామినేషన్.. 

జానకమ్మ ఏదో తన కోసం నామినేషన్ (Nomination) ఫైల్ చేయలేదు. తన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోవాలని అనుకోలేదు. నామినేషన్(Nomination) ఫైల్ చేసిన అనంతరం జానకమ్మ మాట్లాడుతూ.. మా సమస్యలను హైలైట్ చేయడానికి ఇలా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని లింగమార్పిడి వ్యక్తుల కోసం బలమైన గొంతు అవసరం అని వివరించారు. అందుకోసమే తాను ఇక్కడ నామినేషన్ ఫైల్ చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అనేక చోట్ల లింగమార్పిడి వ్యక్తులపై వేధింపుల కేసులు నమోదయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అక్రమార్కులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. ఈ హింసను ఆపేందుకే తాను పోటీకి సిద్ధం అయినట్లు తెలిపింది. తెలంగాణలో ట్రాన్స్‌ జెండర్లకు(Transgender)  ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చినట్లు పేర్కొంది. 

అక్కడి నుంచి కూడా.. 

కేవలం జానకమ్మ అనే కాకుండా మరో ట్రాన్స్ జెండర్ (Transgender) అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. ఆ ట్రాన్స్ జెండర్ (Transgender) ను ఓ జాతీయ పార్టీ (National Party) బరిలోకి దించడం గమనార్హం. చిత్రపు పుష్పాలయ అనే ట్రాన్స్ జెండర్ కు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) టికెట్ కేటాయించడం గమనార్హం. ఈమెను బీఎస్పీ వరంగల్ తూర్పు (Warangal East) నుంచి బరిలో నిలిపింది. 

ఇంకా రేవంత్ రెడ్డి నామినేషన్ వేయలే.. 

ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో నిలిచినా కానీ ఎక్కువగా జనంలో ఉన్నవి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు అధిష్టానం కొడంగల్ నుంచి సీటును కేటాయించింది. ఇంకా రేవంత్ రెడ్డి మాత్రం నామినేషన్(Nomination) దాఖలు చేయలేదని కొడంగల్ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) అదనపు కలెక్టర్‌ లింగం నాయక్‌ తెలిపారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు నవంబర్ 10 చివరి తేదీ అని పేర్కొన్నారు. .

బయటికొస్తున్న నోట్ల కట్టలు 

తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ (Nomination) విడుదలైన నుంచే పోలీసులు బందోబస్తు పెంచారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బును సీజ్ చేస్తున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన డబ్బు ఇప్పటి వరకు దాదాపు 170 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9 నుంచి ఇలా సీజ్ చేయడం మొదలు పెట్టారు. రోజురోజుకూ ఇలా సీజ్ చేసే డబ్బు విలువ పెరుగుతోంది. కేవలం డబ్బులు అనే కాకుండా మద్యం, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) కూడా సీజ్ చేస్తున్నారు. ఇక తనిఖీల్లో లభిస్తున్న ఉచితాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక మంది అనేక వస్తువులను ఉచితాలుగా అందిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసినా కానీ  ఇలా ఉచితాలు పంచుతూ అనేక మంది పట్టుబడుతున్నారు. ఇలా దొరికిన ఉచితాలను చూసి పోలీసు వారే షాక్ అవుతున్నారు. ఈ సారి పోటీ తీవ్రంగా ఉండడంతో ఎలాగైనా సరే గెలవాలని అందరూ భావిస్తున్నారు. ఇలా ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తమ వైపుకు తిప్పుకునేందుకు వారికి డబ్బు, ఇతర వస్తువులు ఆశగా చూపుతున్నారు.