ద్విచక్ర వాహనదారులకు అలెర్ట్, కొత్త నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించినా జరిమానా తప్పదు?

హెల్మెట్ ధరించకుండా వాహనాల నడుపుతూ,  ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటర్ వాహన చట్టంలోని నిబంధనల కోసము లేదంటే పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో, హెల్మెట్ ను ధరించడం కాకుండా మన భద్రత కోసం మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలి.  హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపే వాళ్ళు కొన్నిసార్లు పాదాచారుల మరణాలకు కూడా కారణమవుతున్నాయి.  […]

Share:

హెల్మెట్ ధరించకుండా వాహనాల నడుపుతూ,  ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటర్ వాహన చట్టంలోని నిబంధనల కోసము లేదంటే పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో, హెల్మెట్ ను ధరించడం కాకుండా మన భద్రత కోసం మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలి.  హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపే వాళ్ళు కొన్నిసార్లు పాదాచారుల మరణాలకు కూడా కారణమవుతున్నాయి.  అందుకే తాజాగా సరికొత్త నిబంధనలను తీసుకువచ్చారు.

హెల్మెట్ ఈ విధంగా ధరించండి:

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ సేవర్ గా పనిచేస్తుంది. ట్రాఫిక్ జరిమానా పడకుండా నిరోధిస్తుంది. మామూలుగా హెల్మెట్ ధరించి వెళ్లే వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపి జరిమానా విధించడం చాలా అరుదు. కానీ ఇప్పుడు రూల్ మారింది. హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు. హెల్మెట్లకు సంబంధించి కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే మీరు హెల్మెట్ పెట్టుకున్నా కూడా జరిమానా కట్టాల్సిందే. మారిన నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

తాజా నిబంధనల ప్రకారం మీ హెల్మెట్ ఈ విధంగా ఉండి తీరాల్సిందే. హెల్మెట్ ను ప్రమాదం జరిగినప్పుడు గరిష్ట రక్షణను అందించగల మెటీరియల్ ని ఉపయోగించి తయారుచేయాలి.  దాని ఆకారం కూడా ఇక్కడ ముఖ్యమే.

బైక్ రైడర్స్ పాటించాల్సిన నిబంధనలివే

1. నిబంధనల ప్రకారం, హెల్మెట్ పటిష్టమైన మెటీరియల్‌తో తయారు చేసినదై ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు గాయం నుండి గరిష్ట రక్షణను అందించే సామర్థ్యం ఉన్న ఆకృతిలో ఉండాలి.

2. రైడర్ తలపై హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. దానికి పట్టీ కూడా కట్టాలి. అంటే తలకు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.

నిబంధనల ప్రకారం మీ హెల్మెట్ ఇలా ఉండాలి:

1. హెల్మెట్ బరువు 1.2 కిలోల వరకు ఉండాలి.

2. హెల్మెట్‌ అధిక నాణ్యత మెటీరియల్ తో తయారు చేసినదై ఉండాలి. దాని కనీస మందం 20-25 మిమీ ఉండాలి.

3. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకారం, అన్ని హెల్మెట్‌లకు ISI గుర్తు ఉండటం తప్పనిసరి. ఐఎస్‌ఐ గుర్తు లేకుండా హెల్మెట్‌లు ధరించడం, అమ్మడం చట్టరీత్యా నేరం.

4. హెల్మెట్‌లో పారదర్శకమైన కంటి కవర్‌ను ఉపయోగించాలి.

5. హెల్మెట్ BIS సర్టిఫికేట్ పొందడం కూడా చాలా ముఖ్యం.

6. మీరు చట్టవిరుద్ధమైన హెల్మెట్‌ను ఉపయోగించి పట్టుబడితే, ఏవైనా సూచనలను పాటించడంలో విఫలమైతే, మీ హెల్మెట్ జప్తు చేయబడవచ్చు.

మీకు జరిమానా విధించారో లేదో తెలుసుకోవడనికి మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు అక్కడ మీకు జరిమానా విధించారా? జరిమానా ఎంత ఛార్జ్ చేస్తారు? వంటి వివరాలను మీరు చూసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో మీ వాహనం నెంబర్లు నమోదు చేసి మిగతా వివరాలను పూర్తిచేస్తే అప్పుడు మీ బైక్ నెంబర్ మీద ఎంత పెనాల్టీ ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటినుంచి పైన చెప్పిన నిబంధనలను పాటించకపోతే మీరు హెల్మెట్ ధరించినా కూడా జరిమానా కట్టాల్సి రావచ్చు. అందువల్ల, ఈ నిబంధనలను పాటించండి.