టమాటాలను అమ్మి 45 రోజుల్లో 4 కోట్లు సంపాదించిన రైతు

గత నెల రోజుల ముందు నుండి మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హోల్సేల్ మార్కెట్ లోనే టమాటా ధర కేజీ 120 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో ఒక రైతు తన పొలంలో పండిన టమాటా లను అమ్మి 45 రోజుల్లో 4 కోట్ల రూపాయలను సంపాదించాడు.  చంద్రమౌళి అనే రైతుకు చిత్తూరు జిల్లాలో 22 ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో అతను ఏప్రిల్ నెలలో అరుదైన టమాటా […]

Share:

గత నెల రోజుల ముందు నుండి మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హోల్సేల్ మార్కెట్ లోనే టమాటా ధర కేజీ 120 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో ఒక రైతు తన పొలంలో పండిన టమాటా లను అమ్మి 45 రోజుల్లో 4 కోట్ల రూపాయలను సంపాదించాడు. 

చంద్రమౌళి అనే రైతుకు చిత్తూరు జిల్లాలో 22 ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో అతను ఏప్రిల్ నెలలో అరుదైన టమాటా మొక్కలను నాటాడు, త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్ మరియు మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులు అనుసరించారు. దీంతో జూన్ నెలాఖరుకు టమాటా పంట చేతికి అంది వచ్చింది. తన గ్రామానికి దగ్గరలో ఉన్న కర్ణాటక రాష్ట్రం లోని కోలార్ మార్కెట్ లో గత 45 రోజుల్లో పండించిన 40 వేల బాక్సుల టమాటా లను అమ్మాడు. ఒక్కో బాక్సు  ధర 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు పలుకుతూ ఉండడంతో గత 45 రోజుల్లోనే అతను 4 కోట్ల రూపాయలను సంపాదించాడు. 

టమాటా పంటకు మంచి ధర రావడంతో చంద్ర మౌళి సంతోషం వ్యక్తం చేశాడు. ” ఇప్పటి వరకూ పండించిన పంటను అమ్మి 4 కోట్ల రూపాయలను సంపాదించాను, వాటిలో 22 ఎకరాల్లో పెట్టుబడికి, రవాణా ఖర్చులు మరియు కమిషన్ పోగా 3 కోట్ల రూపాయలు లాభం వచ్చింది” అని ఆయన వెల్లడించారు. సరైన సమయంలో పంట వేయడం వలనే రైతు చంద్ర మౌళి దంపతులకు 3 కోట్ల రూపాయల లాభం వచ్చింది. 

దక్షిణాది రాష్ట్రాల నుండి టమాటాలు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మదనపల్లె లో ఉన్న టమాటా మార్కెట్ భారతదేశంలోని అతి పెద్ద టమాటా మార్కెట్ లలో ఒకటి, ఉత్తరాది రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వ్యాపారులు వచ్చి ఇక్కడి నుండి టొమాటో లు కొనుగోలు చేసి తీసుకుని వెళ్తున్నారు. మార్కెట్ లో మొదటి గ్రేడ్ టమాటా ధర కేజీ 200 రూపాయలు పలుకుతోంది. ఆగస్టు నెల ఆఖరు వరకూ టమాటా ధరలు పెరుగుతూ ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

మార్కెట్ లో టమాటా ధర విపరీతంగా పెరగడంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. అందరి ఇళ్లలోనూ టమాటా నిత్యం ఉపయోగించే కూరగాయ కావడంతో ధర పెరిగినా కూడా టమాటో కొనుగోలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వాలు కొన్ని రైతు బజార్లలో కేజీ టమాటా లను 50 రూపాయలకే అందిస్తూ ఉండడం పైగా ఒక మనిషికి ఒక కేజీ టమాటా లు మాత్రమే ఇస్తూ ఉండడంతో కొన్ని రైతు బజార్లలో కిలోమీటర్ల కొద్దీ క్యూ లో నిలబడి టమాటా లను కొనుక్కుంటున్నారు. 

టమాటా ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించినా కూడా టమాటా ధర ఆకాశాన్ని అంటుతుంది. రెండు వారాల క్రితం కిలో 120 రూపాయలు ఉన్న 25 కేజీల టమాటా బాక్స్ 3వేల రూపాయలు ఉండగా ఇతర రాష్ట్రాల్లో టమాటా కు డిమాండ్ పెరగడంతో కిలో 200 రూపాయలకు చేరుకుంది. దాంతో 25 కేజీల టమాటా బాక్స్ ధర 5000 రూపాయలకు చేరుకుంది. ఈ సమయంలో పంట చేతికి వచ్చిన రైతులు అందరూ టమాటా ధరలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.