సెంచరీ కొట్టిన టమాటా.. రానున్న రోజుల్లో మరింత ప్రియం..

వంట ఏదైనా సరే టమాట ఉండాల్సిందే.. టమాటా లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. అలా అని మగువలు టమాటాను కూరల్లో విపరీతంగా వాడేస్తే మీ భర్త జేబుకు చిల్లు పడ్డట్టే.. అవును మీరు వినింది నిజమే.. నిన్న మొన్నటిదాకా 10 రూపాయలు ఉన్న టమాట ఈరోజు సెంచరీ దాటేసింది.. సాధారణంగా ఈ సీజన్లో టమాటా ధరలు పెరగడం సహజమే.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాట ఏకంగా రూ వంద దాటడంతో కొనేందుకు వినియోగదారులు వెనకాడుతున్న […]

Share:

వంట ఏదైనా సరే టమాట ఉండాల్సిందే.. టమాటా లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. అలా అని మగువలు టమాటాను కూరల్లో విపరీతంగా వాడేస్తే మీ భర్త జేబుకు చిల్లు పడ్డట్టే.. అవును మీరు వినింది నిజమే.. నిన్న మొన్నటిదాకా 10 రూపాయలు ఉన్న టమాట ఈరోజు సెంచరీ దాటేసింది.. సాధారణంగా ఈ సీజన్లో టమాటా ధరలు పెరగడం సహజమే.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాట ఏకంగా రూ వంద దాటడంతో కొనేందుకు వినియోగదారులు వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది. హోల్సేల్ మార్కెట్లలో ధర  పెరగడంతో రిటైల్ దుకాణాల్లో కిలో టమాట రూ. 80 నుంచి 120 వరకు పలుకుతోంది. బెంగళూరులో టమాట ధరలు ఆకాశాన్నంటాయి. బెంగళూరు మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 100 దాటాయి.

 తాజాగా అందిన నివేదిక ప్రకారం, కర్ణాటకలోని కోలార్ హోల్సేల్ ఏపీఎంసీ మార్కెట్లో 15 కిలోల టమాటా 1100 రూపాయలకు అమ్ముడు అవుతుంది. రానున్న రోజుల్లో బెంగళూరులో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.  టమాటా ధర ఇటీవల కాలంలో కిలోకి రూ. 30 నుంచి 50 పెరిగిందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. హైదరాబాదులో కూడా టమాటా ధర కిలో రూ. 100 పలుకుతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ధరల పర్యవేక్షణ విభాగం డేటాబేస్ ప్రకారం , రిటైల్ మార్కెట్లలో సగటున కిలో టమాటా ధర రూ. 25 నుంచి 41 కి పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లలో టమాటా గరిష్ట ధరలు రూ. 80 నుంచి 113 మధ్య ఉన్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం , భారీ వర్షాలు, విపరీతమైన వేడి వలన టమాటా పంటపై ప్రభావాన్ని చూపాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో కిలో టమాటా ధర రూ. 150కి చేరితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి దక్షిణాది నుంచే టమాటా ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా బెంగుళూరు రూరల్ చిత్రదుర్గ, చిక్కబల్లాపూర్ , రామనగర, కోలార్ వంటి జిల్లాలలో టమాటా పంట ఆశించిన స్థాయిలో లేదు. దీంతో అక్కడ టమాటా కొరత ఏర్పడింది కొన్ని రోజుల వరకు టమాటా ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా దాని సరఫరా పై ప్రభావం చూపడంతో టమాటా ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. కొన్ని రోజులుగా కర్ణాటకలో వరసగా భారీ వర్షాలు పడుతున్న ఈ దీంతో పంట దిగుబడి పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు వేసవిలో అత్యధిక వేడి కూడా పంటపై ప్రభావం చూపిందని రైతులు అంటున్నారు.

దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉండే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దాంతో సరఫరా తగ్గిపోయింది. మార్కెట్కు వస్తున్న పంట దిగుబడి తగ్గడం వానలు తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాటా తోటలు చిన్నాభిన్నం అయ్యాయి. వివిధ కారణాల వల్ల ఏడాది తక్కువ టమోటా మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనం అవడం బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలామంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు. 

మన దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర కిలో రూ. 80 నుంచి 90 పలుకుతుంది. ఇది హోల్సేల్ ధర మాత్రమే. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో హోల్సేల్ ధర రూ. 80 పలకగా రిటైల్ మార్కెట్లో 100 పైనే విక్రయిస్తున్నారు. శీతల ప్రాంతం అయినా కర్ణాటకలో టమాట ఎర్ర బంగారంలా మారింది. రానున్న రోజుల్లో దీని ధర 150 దాటే అవకాశాలు ఉన్నాయి.