ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ మాసానికి సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది. కలియుగ భగవాన్ శ్రీ వేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుత్తారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవుల కారణంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్‌ నెలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకే మార్చి 27 ఉదయం నుంచి  టీటీడీ ప్రత్యేక దర్శన […]

Share:

తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ మాసానికి సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది.

కలియుగ భగవాన్ శ్రీ వేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుత్తారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవుల కారణంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్‌ నెలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకే మార్చి 27 ఉదయం నుంచి  టీటీడీ ప్రత్యేక దర్శన రూ.300 టిక్కెట్లను విడుదల చేసినట్టు తెలిపారు. కాగా.. ఇదే విషయంపై టీటీడీ టికెట్ల విడుదలకు రెండు రోజుల ముందే ట్వీట్ చేసింది.

ప్రత్యేక దర్శనానికి మీరు ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ చేయాలనుకుంటే TTD అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక దానిని అనుసరించి, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చెయ్యడం ద్వారా మీరు టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

రైల్వేలో తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నట్లే..  మీరు ముందుగానే ఈ సేవలను పొందవచ్చు. మీరు ముందుగా https://ttdsevaonline.com సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఇందు కోసం సైట్‌లోని సైన్ అప్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ లింక్‌పై క్లిక్ చెయ్యగానే అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చెయ్యండి. మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చెయ్యగానే మీ అకౌంట్ ఆక్టివేట్ అవుతుంది. ఇక అది అక్కడ నుండి అది లాగిన్ పేజీకి వెళ్తుంది. మీ మొబైల్ కు వచ్చిన వివరాలతో లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డ్, కావాల్సిన తేదీలు అందుబాటులో ఉన్నాయో, లేవో చూపిస్తూ విండో ఓపెన్ అవుతుంది. రెడ్ కలర్ ( ఖాళీలు లేని తేదీలు), గ్రీన్ కలర్ (దర్శనానికి ఖాళీ ఉన్న తేదీలు) తో తేదీలు కనబడతాయి. అక్కడ మనకు కావాల్సిన తేదీ, స్లాట్‌ని చెక్ చేసుకోవాలి.

ఇక దీని చెల్లింపులు మనం రెగ్యులర్ గా చేసే సాధారణ ఇకామర్స్ సైట్‌ల మాదిరిగానే ఉంటాయి. చెల్లింపు చేసి, సేవ రిజర్వ్ చేయబడిన తర్వాత, మనకు స్లాట్ బుక్ అయినట్టు మెసేజ్ కూడా వస్తుంది.

అయితే.. ఈ రోజు మార్చి 27 ఉదయం 11 గంటలకు టిక్కెట్ల విక్రయం ప్రారంభమైన తర్వాత, పలువురు భక్తులు దర్శనం కోసం స్లాట్‌లను బుక్ చేసుకోలేక పోతున్నారని ఫిర్యాదు చేశారు. స్లాట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మందికి ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు వారు ట్విట్టర్ ద్వారా చెప్పారు.

ప్రియమైన సార్ / మేడమ్, నిర్దిష్ట రోజున స్లాట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ మీ TTD వెబ్‌సైట్ ఎర్రర్ పాప్ అప్ మెసేజ్ ఎందుకు పంపుతోంది. నేను ఉదయం 11:00 గంటల నుండి బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సమస్య ఏమిటో నాకు తెలియదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే.. స్లాట్‌లను అధిక ధరకు విక్రయించడానికి బుకింగ్ ఏజెంట్‌లకు విక్రయించారా? అని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు చేశాడు. అయితే ఆ ట్వీట్ ఇప్పుడు డిలీట్ చేయబడింది.

ఇక ఈ తప్పిదాలపై టీటీడీ అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 ఈ గంటలకు యాత్ర ప్రారంభమైందని టీటీడీ పేర్కొంది.