Murder:  స‌మ‌యం కేటాయించ‌డంలేద‌ని భార్యను చంపేసాడు

చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూస్తూ, పెద్ద గొడవలుగా ఆవేశంలో తొందరపాటులో తమకు కావలసిన వారిని అనుకోకుండా హత్య (Murder) చేసి, కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి తోస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రెండు చోట్ల చోటు చేసుకోగా, రెండు నిండు ప్రాణాలు పోయాయి.  కారణం తెలిస్తే షాక్ అవుతారు..:  కొత్తగా రిక్రూట్ అయిన పాట్నా మహిళా కానిస్టేబుల్  (constable) శోభా కుమారి (Shoba Kumari) ఇటీవల ఉద్యోగం (Job)లో చేరిన తర్వాత […]

Share:

చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూస్తూ, పెద్ద గొడవలుగా ఆవేశంలో తొందరపాటులో తమకు కావలసిన వారిని అనుకోకుండా హత్య (Murder) చేసి, కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి తోస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రెండు చోట్ల చోటు చేసుకోగా, రెండు నిండు ప్రాణాలు పోయాయి. 

కారణం తెలిస్తే షాక్ అవుతారు..: 

కొత్తగా రిక్రూట్ అయిన పాట్నా మహిళా కానిస్టేబుల్  (constable) శోభా కుమారి (Shoba Kumari) ఇటీవల ఉద్యోగం (Job)లో చేరిన తర్వాత కుటుంబం కోసం సమయం (Time) ఇవ్వడం లేదని ఆమె భర్త (Husband) గజేంద్ర యాదవ్ దారుణంగా హత్య (Murder) చేసినట్లు పోలీసులు (Police) తెలిపారు. శుక్రవారం పాట్నాలోని ఒక హోటల్ గదిలో శోభ మృతదేహాన్ని పోలీసులు (Police) రికవరీ చేశారు. అయితే హత్య (Murder) గురించి తెలిసిన అనంతరం, పోలీసులు (Police) హోటల్ రూమ్ కి చేరుకున్న తర్వాత, మహిళా కానిస్టేబుల్  (constable) శోభకుమారి (Shoba Kumari) హోటల్ రూమ్ లో నగ్నంగా పడి ఉండడం, అంతేకాకుండా సింధూరం రూములో చల్లచెదురుగా పడి ఉండడం గమనించిన పోలీసులు (Police), హత్య (Murder)కు ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా మహిళ కానిస్టేబుల్  (constable) శోభకుమారి నుదుటిపై తుపాకీ (Gun)తో కాల్చి చంపినట్లు వెల్లడించారు పోలీసులు (Police).

23 ఏళ్ల శోభ కుమారి (Shoba Kumari) భర్త (Husband), జెహనాబాద్ సమీపంలోని కాకో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నారు, ఆమె ఉద్యోగం (Job) కారణంగా కుటుంబం కోసం సమయం (Time) కేటాయించకపోవడంపై, శోభా (Shoba Kumari) భర్త (Husband) భరించలేకపోయాడు. ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. జెహనాబాద్‌లో కోచింగ్‌ క్లాస్‌లో వీరిద్దరూ కలిశారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది.

రెండు రోజుల క్రితం పాట్నాలోని ఓ హోటల్‌లో శోభ మృతదేహం లభ్యమైంది. మహిళా కానిస్టేబుల్  (constable) శోభకుమారి భర్త (Husband) హోటల్ రూమ్ బుక్ చేసాడు. శోభ తన భర్త (Husband)ను చూడటానికి హోటల్ రూమ్ కి చేరుకుంది. అక్కడే అనుకోని సంఘటన ఎదురయింది.. తన భర్త (Husband) చేతిలో.. హత్య (Murder)కు గురై శోభ మృతి చెందింది. అయితే హత్య (Murder) అనంతరం శోభా కుమారి (Shoba Kumari) భర్త (Husband) ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకముందే, మూడుసార్లు ఫోన్ చేసినట్లు సమాచారం. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీసులు (Police) మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇలాంటిదే మరో ఘటన: 

ఇదే విధమైన సంఘటనలో, 52 ఏళ్ల ఢిల్లీ (Delhi) వ్యక్తి తన భార్య  (wife)ను హత్య (Murder) చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 17న దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో, భార్య  (wife) తమకు సమయం (Time) ఇవ్వకుండా ఉద్యోగానికి  (Job) వెళ్ళిపోతుందని విషయంలో గొడవపడి తన భార్య  (wife)ను హతమార్చాడని పోలీసులు (Police) వెల్లడించారు.

మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులు గొడవ పడ్డారని, కుమారుడు ఆకాశ్(Akash) పోలీసులకు తెలిపాడు. అతని తండ్రి నుండి కాల్ (Call) వచ్చిన తర్వాత, అతను తన ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నుండి క్రిందికి వచ్చాడని, అతని తండ్రి వేద్ ప్రకాష్(Prakash) తన తల్లిని, సుశీల మృతదేహాన్ని బాత్రూమ్ నుండి ఈడ్చుకుంటూ బయటికి తీసుకువస్తుండడం చూశానని చెప్పుకొచ్చాడు. అయితే తండ్రి వేద్ ప్రకాష్ను మరింత లోతుగా విచారించగా, సుశీలను దుపట్టాతో గొంతు పిసికి హత్య (Murder) చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు (Police) తెలిపారు.