కర్ణాటకకు చెందిన ముగ్గురు విద్యార్థులు JEE మెయిన్స్ 2023లో టాప్, 100 పర్సంటైల్ సాధించారు.

ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి తదితర జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2023 ఇంజనీరింగ్ పేపర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మొత్తం 43 మంది విద్యార్థులు పరీక్షలో 100 పర్సంటైల్ స్కోర్ సాధించినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన కర్ణాటకకు చెందిన రిధి కమలేష్ కుమార్ మహేశ్వరి […]

Share:

ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి తదితర జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2023 ఇంజనీరింగ్ పేపర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మొత్తం 43 మంది విద్యార్థులు పరీక్షలో 100 పర్సంటైల్ స్కోర్ సాధించినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన కర్ణాటకకు చెందిన రిధి కమలేష్ కుమార్ మహేశ్వరి JEE మెయిన్స్ ఫలితం 2023లో 100 పర్సంటైల్ సాధించిన ఏకైక మహిళా అభ్యర్థి. 100 పర్సంటైల్ సాధించిన 43 మందిలో కర్ణాటకకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.

 NTA జాబితా ప్రకారం, కర్ణాటకకు చెందిన తనీష్ సింగ్ ఖురానా, రిధి కమలేష్ కుమార్ మహేశ్వరి, నివేద్ అయిలియాత్ నంబియార్ JEE మెయిన్స్ పరీక్షలలో పూర్తి మార్కులు సాధించారు. 43 ఆల్ ఇండియా టాపర్‌ల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన వెంకట్ కౌండిన్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాళ్లకూరి సాయినాథ్ శ్రీమంత్ కూడా టాపర్‌లలో నిలిచారు.

JEE మెయిన్ అనేది NITలు, IIITలు, ఇతర భాగస్వామ్య సంస్థలలో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించబడే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. దేశవ్యాప్తంగా ఉన్న IIT JEE ఆశావాదులకు ఇది స్క్రీనింగ్ టెస్ట్ కూడా. NTA పేపర్ 1 (BE/BTech) ఫలితాలను మాత్రమే ప్రకటించింది. పేపర్ 2 (BArch/ BPlanning) ఫలితాలు వేచి ఉన్నాయి.

 ఈ ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి రెండు ర్యాంకులను మన తెలుగు విద్యార్థుల కైవసం చేసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టి.ఏ శనివారం ఉదయం ఈ పరీక్ష తుది ఫలితాలను స్కోర్లు ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో 100 పర్సంటైల్ సాధించినవారు 43 మంది ఉండగా అందులో 16 మంది తెలుగువారే కావటం విశేషం వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ వారు కాగా మిగిలిన వారు తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన అభ్యర్థులు టాప్ 10 ర్యాంకులో తొలి స్థానాన్ని దక్కించుకున్న సింగరాజు వెంకట కౌండిన్య తెలంగాణ నుంచి రిజిస్టర్ అయి పరీక్ష రాసిన ఏపీ విద్యార్థి కాగా, రెండో స్థానంలో కాళ్లకూరి సాయినాథ్ శ్రీమంత్ ఏపీ నుంచి పరీక్ష ర్యాంకు దక్కించుకున్నాడు.

ఈసారి జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకుల సాధనలో బాలికలు బాగా వెనుక పడ్డారు. టాప్ 10 లో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. కర్ణాటక కు చెందిన ఒకే ఒక్క అమ్మాయి రిధి కమలేష్ కుమార్ మహేశ్వరి 100 స్కోరు మార్కులతో 16వ ర్యాంకులో నిలిచింది. బాలికల్లో ఏపీ నుంచి మీసాల ప్రణతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, పైడల వింధ్య, సువ్వాడ మౌనిష నాయుడు, వాక శ్రీ వర్షిత టాప్ ప్రాంతంలో నిలిచారు. తెలంగాణ నుంచి కుక్కల ఆశ్రిత రెడ్డి టాప్ బ్రాంచ్ లో ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్లోని వివిధ గురుకులల్లో రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచిర్యాంకులే వచ్చాయని ఆయా విభాగాల అధికారులు వెల్లడించారు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేక కోచింగ్ ఇప్పించినట్లు తెలిపారు. ముందు నుంచి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వారిని సన్నద్ధం చేయడంతో మంచి ర్యాంకులు వచ్చాయని అన్నారు. ఇతర సంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో 25 మందికి పైగా మంచి ర్యాంకులు సాధించినట్లు ప్రాథమిక గణాంకాల ప్రకారం చెబుతున్నారు. 

నేటి నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు, జేఈఈ మెయిన్ లో టాప్ 2.5 లక్షల మంది ఐఐటీలో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్ 2023 ని రాసేందుకు అర్హత దక్కుతుంది. వీరు ఆదివారం నుంచి అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ యొక్క నిర్వహణ సంస్థ అయిన ఐఐటి గౌహతి ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్ష జూన్ 4న జరుగుతుంది.