ఢిల్లీలో దొంగతనాలు, హత్యలు

ఈ మధ్యకాలంలో దొంగతనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. దొంగతనానికి వచ్చిన వారు దొంగతనం చేసుకుని వెళ్ళిపోకుండా, అడ్డు వచ్చిన వారిని అమాంతం చంపిమరి వాళ్ళ దగ్గర నుంచి అపహరించుకొని పోతున్నారు దొంగలు. మనిషి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడట్లేదు దొంగలు. అభం శుభం తెలియని అమాయకులను బలిగొంటున్నారు దుండగులు. ఇలాంటి ఒక తరహా లోనే దొంగతనాలు ఇప్పుడు ఢిల్లీలో మొదలయ్యాయి అని చెప్పుకోవాలి.  కత్తిపోట్లు, హత్య:  శుక్రవారం రోజు దొంగతనాలు జరిగినట్లు, హత్య కూడా జరిగినట్లు వెల్కమ్ పోలీస్ […]

Share:

ఈ మధ్యకాలంలో దొంగతనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. దొంగతనానికి వచ్చిన వారు దొంగతనం చేసుకుని వెళ్ళిపోకుండా, అడ్డు వచ్చిన వారిని అమాంతం చంపిమరి వాళ్ళ దగ్గర నుంచి అపహరించుకొని పోతున్నారు దొంగలు. మనిషి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడట్లేదు దొంగలు. అభం శుభం తెలియని అమాయకులను బలిగొంటున్నారు దుండగులు. ఇలాంటి ఒక తరహా లోనే దొంగతనాలు ఇప్పుడు ఢిల్లీలో మొదలయ్యాయి అని చెప్పుకోవాలి. 

కత్తిపోట్లు, హత్య: 

శుక్రవారం రోజు దొంగతనాలు జరిగినట్లు, హత్య కూడా జరిగినట్లు వెల్కమ్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు మొదటిగా ఇన్వెస్టిగేషన్ చేయగా ఇద్దరు నిందితులు పట్టుపడ్డారు. వారిలో ఒకరు కపిల్ చౌదరి మరొకరు సోహెల్. అంతేకాకుండా వారిద్దరి దగ్గర నుంచి దొంగతనానికి ఉపయోగించిన, రక్తపు మరకలు ఉన్న రెండు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడో వ్యక్తి సమీర్ అనే దుండగుడు గురించి ప్రస్తుతం గాలింపులు మొదలయ్యాయి. 

దుండగుల దౌర్జన్యం: 

కపిల్, సోహెల్, సమీర్ అనే ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో ప్రజలను దోచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా జనతా మంజూరు కాలనీలో రౌడీలుగా పేరుపొందారు. అయితే ఇటీవల వాళ్ళు కొన్న కత్తులని తీసుకుని వాళ్ళ ఏరియాలోనే కొంతమంది దగ్గర దౌర్జన్యంగా డబ్బులు దోచుకోవాలని బయలుదేరారు. ఈ క్రమంలోనే, షేర్ మహమ్మద్ అని 25 ఏళ్ల యువకుడు దగ్గర దొంగతనానికి వెళ్లి అతని నిర్దాక్షిణ్యంగా కడుపులో కత్తిపోట్లు పొడవడం జరిగింది, అయితే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇంట్లోకి వెళ్లి దాకున్నారు మహమ్మద్. 

టైలర్ గా పనిచేస్తున్న గొఫ్రిన్ అనే వ్యక్తి దగ్గర మొబైల్ దొంగతనం చేయడమే కాకుండా, అతను వెన్నులో దుండగులు కత్తిపోట్లు పొడవడం వల్ల 32 ఏళ్ళ గోఫ్రిన్ అక్కడకు అక్కడ మరణించాడు. ఇదే క్రమంలో ఆ ముగ్గురు శారిక్ అనే వ్యక్తి దగ్గర దొంగతనానికి వెళ్లి అతని మెడ మీద కత్తితో గాయపరిచారు. ఈ క్రమంలో శారిక్ ప్రాణాలతో బయటపడ్డాడు. 

అయితే మూడు కేసులకు సంబంధించి, కపిల్ చౌదరి మరొకరు సోహెల్ ఇప్పటికే అరెస్టు అవ్వడం జరిగింది. సమీర్ గురించి గాలింపు మొదలైంది. అరెస్ట్ అయిన కపిల్ చౌదరి మీద ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం, అది కూడా మూడు నెలల క్రితమే. పరారీలో ఉన్న మరో వ్యక్తి సమీర్ మీద కూడా కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. 

దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి: 

ఎక్కడ చూసినా ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు ఇంటి చుట్టూ అమరుస్తున్నప్పటికీ, ఆఫీసులు చుట్టూ అమరుస్తున్నప్పటికీ, దొంగలు మాత్రం తాము చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు, డబ్బును దోచుకుని పోతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు బయట చల్లగా ఉందని పడుకోగా, హఠాత్తుగా దొంగలు వచ్చి వారిని నిద్రలో నుంచి లేపి మరి, ఇంటి తాళాలు, బీరువా తాళాలు తీసుకొని, వారి కళ్ళ ముందే వారి కొన్నదంతా దోచుకుని పోయారు దొంగలు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ, ప్రస్తుతం ఆ దొంగల గురించి ఇంకా వేటాడుతూనే ఉన్నారు పోలీసులు.. అందుకే జాగ్రత్త, నిద్రపోతున్నప్పుడు తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకొని, తాళాలు వేసుకుని, నిద్రపోవడం మేలు అంటున్నారు పోలీసులు.