ఫ‌ల‌క్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు

ఈ మధ్యకాలంలో ఎన్నో రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం మన చూస్తుంటాము. అదేవిధంగా నిన్న మరో ఘోరమైన ప్రమాదం జరిగింది. తెలంగాణ యాదాద్రిలో ఫలక్నామ ఎక్స్ప్రెస్ కు మంటలు అంటుకొని మూడు భోగిలో దగ్ధమైన సంఘటన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగదు  వివరాల్లోకి వెళితే:  శుక్రవారం నాడు హఠాత్తుగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అదే సందర్భంలో రైలు తెలంగాణ యాదాద్రి […]

Share:

ఈ మధ్యకాలంలో ఎన్నో రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం మన చూస్తుంటాము. అదేవిధంగా నిన్న మరో ఘోరమైన ప్రమాదం జరిగింది. తెలంగాణ యాదాద్రిలో ఫలక్నామ ఎక్స్ప్రెస్ కు మంటలు అంటుకొని మూడు భోగిలో దగ్ధమైన సంఘటన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగదు 

వివరాల్లోకి వెళితే: 

శుక్రవారం నాడు హఠాత్తుగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అదే సందర్భంలో రైలు తెలంగాణ యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఉంది. అయితే మంటలు అంటుకున్న అనంతరం బొమ్మాలి గ్రామం దగ్గరలో ఫలక్నామ ఎక్స్ప్రెస్ ను ఆపడం జరిగింది. నిజానికి ఇందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టమనే చెప్పాలి. మంటలు అంటుకున్న అనంతరం అందులో ఉన్న ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యి కంపార్ట్మెంట్లోకి మంటలు చెలరేగే లోపే ప్రయాణికులంతా భోగి లో నుంచి కిందకి దిగిపోయారు. అప్పటికే S3, S4, అంతేకాకుండా S5 భోగిల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. నిజంగా ప్రయాణికులంతా అతి కష్టం మీద ఆ దట్టమైన పొగలు నుంచి తప్పుకుంటూ రైలు నుంచి బయటపడ్డారు. 

తెలంగాణ డిజిపి ట్విట్టర్ పోస్ట్ ప్రకారం: 

ఫలక్నామ ఎక్స్ప్రెస్ లో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి తెలంగాణ డిసిపి ట్విట్టర్లో మాట్లాడుతూ, ” ప్రస్తుతానికి ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన అనంతరం ప్రయాణికులు అందరినీ కూడా బస్సుల ద్వారా పంపించడం జరిగింది. ఇందులో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి గాయాలు అయినట్లు ఇప్పటివరకు నమోదు అవ్వలేదు. నిజానికి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో మొత్తం 18 భోగీలు ఉండగా, అందులో ప్రస్తుతానికి 11 భోగీలు డివైడ్ చేయడం జరిగింది. మిగిలిన 7 భోగులకు ప్రమాదం వాటిల్లగా అందులో 3 భోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.” అని వెల్లడించారు. 

ఎక్కువ అవుతున్న రైలు ప్రమాదాలు: 

గత నెల జూన్ 2న జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం ఒరిస్సాలో రైలు ప్రమాదం. ఈ రైలు సంఘటనలో సుమారు 291 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఎంతోమంది గాయాలతో బయటపడ్డారు. అయితే కేవలం, నిర్లక్ష్యమే ఈ రైలు ప్రమాదానికి కారణమని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ ఘోరమైన రైలు ప్రమాదం మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన శైలిలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా, నిన్న జూలై 7న ముగ్గురు రైల్వే అధికారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అధికారులలో ఇద్దరు సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ అలాగే ఒక టెక్నీషియన్ ఉన్నారు. అయితే మూడు రైళ్ల ప్రమాద సంఘటనలో, ప్రధానంగా ఈ ముగ్గురు పని తీరులోనే లోపం ఉన్నట్టు, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది అదేవిధంగా నిన్న వారి ముగ్గురిని అరెస్టు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రమాద అనంతరం వీరు ముగ్గురు కూడా, తమది తప్పు అని తేల్చే కొన్ని ఎవిడెన్స్ను మాయం చేసే ప్రయత్నాలు కూడా చేసినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. 

ఎంక్వయిరీ టీం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డేటా లాగర్ పరికరంలో లాగిన్ అయిన దానికి సంబంధించిన నోట్స్ అంతా పరిశీలించింది. జూన్ 2న, ప్రమాదం జరిగిన ఐదు గంటల తర్వాత, పాయింట్ మెషీన్లు దెబ్బతిన్నప్పటికీ, పాయింట్ యొక్క సూచన ఇప్పటికీ సాధారణంగానే చూపుతోందని పరీక్ష గది నుండి Mr. మహంత ఆరోపించినట్లు తెలిసింది.

అంతేకాకుండా, లేబులింగ్లో జరిగిన పొరపాటు అనేది 2018 నుండి కూడా గ్రౌండ్ స్టాఫ్‌కు తెలియకపోవడం గమనార్హం. ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్ (ELB) కంట్రోల్ ఆపరేషన్‌పై వైరింగ్ పని జరుగుతున్నప్పుడు, S&T సిబ్బంది F23 మరియు F24 టెర్మినల్స్‌ను తీసుకున్నారని ఆరోపించారు. “స్పేర్”, సర్క్యూట్ మోడల్ చూపిన విధంగా, మరియు ఆ టెర్మినల్‌లకు కొత్త ELB కనెక్షన్‌ని రీవైర్డ్ చేసింది.

ఫలితంగా, క్రాస్‌ఓవర్ 17A/B, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 17 NWKR సర్క్యూట్‌కు వచ్చే ఫీడ్ డిస్‌కనెక్ట్ అయిందని స్పష్టంగా తేలింది, దీని కారణంగా గ్రీన్ సిగ్నల్ ఇండికేషన్ ఫీడ్ అనేది గ్రౌండ్ స్టేటస్కు అందలేదు. అంతేకాకుండా ఇందులో చాలా అవకతవకలు గమనించినట్లు ఇన్వెస్టిగేషన్లో ఆరోపించారు.