ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే 10 కోట్లు

ఈ మధ్యకాలంలో మతాల మధ్య జరుగుతున్న హింస కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తూనే ఉంది. భారతదేశంలో అందరం ఒకటే అన్న మాటను పక్కన పెట్టి.. మతాల కోసం చంపడానికి, చావడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే మరొక వార్త వెలుగులోకి వచ్చింది. నేరుగా, తమిళనాడు చీఫ్ మినిస్టర్ కొడుకు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ ను చంపిన వారికి పది కోట్ల పారితోషకం అందిస్తామని ప్రకటించాడు పరమహంస ఆచార్య. అసలు విషయం ఏమిటి: అయోధ్యలో తపస్వి చవ్ని అనే […]

Share:

ఈ మధ్యకాలంలో మతాల మధ్య జరుగుతున్న హింస కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తూనే ఉంది. భారతదేశంలో అందరం ఒకటే అన్న మాటను పక్కన పెట్టి.. మతాల కోసం చంపడానికి, చావడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే మరొక వార్త వెలుగులోకి వచ్చింది. నేరుగా, తమిళనాడు చీఫ్ మినిస్టర్ కొడుకు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ ను చంపిన వారికి పది కోట్ల పారితోషకం అందిస్తామని ప్రకటించాడు పరమహంస ఆచార్య.

అసలు విషయం ఏమిటి:

అయోధ్యలో తపస్వి చవ్ని అనే గుడిలో ప్రధాన పండితుడు పరమహంస ఆచార్య చేసిన వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్తుంది. డీఎంకే లీడర్ ఉదయినిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్ల పారితోషకం అందిస్తానని ధైర్యంగా ప్రకటించాడు పరమహంస ఆచార్య. అంతేకాకుండా, మరి ఎవరు స్టాలిన్ ను చంపడానికి ముందుకు రాకపోతే, తానే స్వయంగా వెళ్లి ఉదయనిధి స్టాలిన్ తల నరుకుతానని ప్రకటించాడు.

సనాతన ధర్మం గురించి ఇటీవల ఉదయనిది స్టాలిన్ చేసిన వాక్యాలను ఖండిస్తూ, స్టాలిన్ ని చంపుతానని బెదిరించాడు పరమహంస ఆచార్య. అయితే తమిళనాడు యూత్ వెల్ఫేర్ మినిస్టర్ స్టాలిన్, సనాతన ధర్మం గురించి కాస్త అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. నిజానికి సనాతన ధర్మం అనేది సమాజానికి మంచిది కాదని, ప్రతి ఒక్కరూ సమానంగా ఉండేందుకు, సమాన న్యాయం జరిగేందుకు విరుద్ధంగా సనాతన ధర్మం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సనాతన ధర్మం అనేది కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ ఫీవర్ వంటిదని. వాటిని ఏ విధంగా అయితే నిర్మూలిస్తామో, సనాతన ధర్మాన్ని కూడా అదే విధంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు స్టాలిన్.

అయితే స్టాలిన్ మాట్లాడిన మాటలను ఉద్దేశించి మండిపడిన, అయోధ్య కి చెందిన పరమహంస ఆచార్య, స్టాలిన్ తల నరికితే 10 కోట్లు పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. సనాతన ధర్మం గురించి వాక్యాలు చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన గుర్తు చేశారు.

గతంలో కూడా ఇలాంటివి:

రామచరితమానస్‌పై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై.. అంతేకాకుండా తన బ్లాక్‌బస్టర్ చిత్రం పఠాన్‌లో కాషాయ వస్త్రాలను చూపించినందుకు షారుఖ్ ఖాన్‌పై, గతంలో చంపుతామంటూ ప్రకటనలు చేశారు చాలామంది.

 సనాతన ధర్మానికి మొదలు అదే విధంగా తుది లేదని.. అది ఎన్నటికీ నాశనం చేసేందుకు వీలు పడనిదని… ఎవరైతే సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, వారు నాశనం అయిపోతారని హెచ్చరించాడు ఆచార్య.

ప్రతి మతాన్ని గౌరవించాలి:

మన భారత దేశ పేరు ప్రఖ్యాతలు మన భారత దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నో మతాలు మరెన్నో ఆచారాలు, పద్ధతులు. కుల మత భేదాలు లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు తమ తమ మతాలనే కాకుండా సోదర భావంతో ఎదుట మనిషి మతాలను గౌరవించి అందరూ కలిసి పండుగ జరుపుకోవడం భారత దేశపు ఆనవాయితీ.. ఈ క్రమంలోనే కొంతమంది తమ ఆచారాల పేరుతో ఎదుట వారిని కించపరచడం, మానవత్వాన్ని కూడా పక్కనపెట్టి హింసను.. మొదలు పెట్టడం, మతాల పేరుతో చిచ్చు పెట్టడం ఇవి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మన మతం, ఆచారాలు, పద్ధతులు కన్నా ముందు మనిషి పుట్టాడని సంగతి గుర్తుంచుకోవాలి. ఒక మతం ఆచారాలను పాటిస్తూ మరోక మతం ఆచారాలను ఎత్తి చూపటం కన్నా  మనందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే మానవత్వం. మానవత్వం లేకపోతే మనం ఏ మతంలో ఉన్న, ఎటువంటి ఆచారాలు పద్ధతులు పాటిస్తున్న.. అవన్నీ కూడా పక్కకి వెళ్లిపోతాయి.