సింహం బారి నుంచి ఆవుని కాపాడిన రైతు

ఒక రైతు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఎంతో ధైర్యంగా సాహసించి తను అల్లరి ముద్దుగా పెంచుకుంటున్న ఆవుని సింహం బారి నుంచి కాపాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మన వీధిలో తిరుగుతున్న చిన్న కుక్క పిల్లని చూసి మనం ఎంతో భయపడిపోతాము. అది దగ్గరికి వస్తుంటే పారిపోతాము. కానీ గుజరాత్ లోని ఒక రైతు చేసిన పనికి అందరూ సభాష అంటున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోలో […]

Share:

ఒక రైతు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఎంతో ధైర్యంగా సాహసించి తను అల్లరి ముద్దుగా పెంచుకుంటున్న ఆవుని సింహం బారి నుంచి కాపాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మన వీధిలో తిరుగుతున్న చిన్న కుక్క పిల్లని చూసి మనం ఎంతో భయపడిపోతాము. అది దగ్గరికి వస్తుంటే పారిపోతాము. కానీ గుజరాత్ లోని ఒక రైతు చేసిన పనికి అందరూ సభాష అంటున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోలో ఒక ఆడ సింహం ఒక పులి మీద అటాక్ చేస్తుంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ సంఘటన 

గుజరాత్ లోని గిరి సోమనాథ్ గ్రామంలోని జరిగింది. కేషోడ్ కార్పొరేటర్, వివేక్ కొట్టాడియా తమ ట్విట్టర్  ఎకౌంటు ద్వారా ఈ వీడియోని పోస్ట్ చేశారు. సంఘటన జరిగిన క్రమంలో కొంతమంది కార్లో ఉండి ఈ వీడియోని తీయడం జరిగింది. 

వైరల్ గా మారిన రైతు సాహసం: 

తను ఎంతో అలారం ముద్దుగా పెంచుకుంటున్న ఒక ఆవుని అటుగా వెళుతున్న ఒక ఆడ సింహం హఠాత్తుగా అటాక్ చేసి ఆ ఆవుని అడవిలోకి లాక్కెళ్ళెందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తన ఆవుని కాపాడేందుకు సకల ప్రయత్నాలు చేసిన రైతు, చాలా ధైర్యంగా సాహసించి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎంతో సునాయాసంగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, తను పెంచుకుంటున్న ఆవుని కాపాడేందుకు, సింహాన్ని రాళ్లతో కొట్టి తరిమేసాడు. ఆ రైతు సాహసాన్ని గమనించిన సింహం కూడా ఒక చిన్న కుక్కలాగా పారిపోయింది. 

నిజానికి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరు కూడా సాహసించే సింహాన్ని వైపు అడుగులు వేయడానికి ముందుకు వెళ్లరు. కానీ, తన ఆవు సింహం నోటికి బలి అయిపోకుండా, ఎలాగైనా ఆ ఆవుని కాపాడేందుకు సాహసంతో ముందుకెళ్లాడు రైతు. అయితే, ఈ వైరల్ అయిన వీడియోలో సింహం ఆవుని చాలా గట్టిగా తన పళ్ళతో పీక పట్టుకున్నట్లు కనిపిస్తుంది. దూరం నుంచి రైతు అరుస్తూ వస్తున్నప్పటికీ, సింహం మెల్లగా ఆవుని లాక్కుంటూ అడవిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ రైతు మాత్రం అసలు తగ్గకుండా, అరుస్తూ ఒక పెద్ద రాయి తీసుకుని సింహం మీదకి విసురుతాడు. వెంటనే ఆ సింహం వెనక్కి తిరిగి ఎవరో అని చూసి మళ్ళీ వెనక్కి తిరగకుండా పరిగెడుతుంది.

ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్ లో పాపులర్ అయింది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఆ చిన్న ఆవుని కాపాడిన రైతుని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. సింహాన్ని సైతం పారిపోయేలా చేసిన రైతు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు చాలామంది. ధైర్యంగా ఎదురు వెళితే, ఎదురయ్యే సమస్య ఎలాంటి పెద్దదైనా సరే మన ముందు నుంచి తప్పుకుంటుందని ఈ వీడియో ద్వారా ఆ రైతు ఇన్స్పిరేషన్ గా చెప్పడం జరిగింది. 

అయితే గుజరాత్ లోని కొన్ని ప్రదేశాలలో సింహాలు అప్పుడప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చి భయానక పరిస్థితులు ఏర్పడేలా చేయడం సహజం. అంతేకాకుండా గ్రామాల్లోనే నివసిస్తున్న చాలామంది ప్రజలకు సింహాల పైన అవగాహన కూడా ఉండి ఉంటుంది. వాటికి ఎలా స్పందిస్తే, అవి పారిపోతాయి అనే విషయం ముఖ్యంగా ప్రజలకు తెలుస్తుంది. చిన్నప్పటినుంచి సింహాల మధ్య పెరిగిన తమకు ఇలాంటివి విషయమే కాదు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.