హనుమాన్ చాలిస్ చదివి, రూ. 5000 కొట్టేసాడు

ఈ మధ్యకాలంలో గుడిలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. దేవుడు మీద భయభక్తులు ఉన్నప్పటికీ, దొంగతనం వృత్తి మీద గౌరవంతో దొంగతనం చేసే వెళ్తున్నారు దొంగలు. ఇదే తరహాలో సీసీటీవీ కి చిక్కాడు ఒక గుడి దొంగ. వివరాలు ఈ విధంగా ఉన్నాయి: హర్యానాకు చెందిన రివారీ డిస్ట్రిక్ట్ లో హనుమంతుడి గుడిలో దొంగతనం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు సీసీటీవీ కెమెరా చెక్ చేయగా అందులోని ఒక దొంగ వింతైన దొంగతనాన్ని చేశాడు. దొంగతనం చేసినా కూడా తనకి […]

Share:

ఈ మధ్యకాలంలో గుడిలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. దేవుడు మీద భయభక్తులు ఉన్నప్పటికీ, దొంగతనం వృత్తి మీద గౌరవంతో దొంగతనం చేసే వెళ్తున్నారు దొంగలు. ఇదే తరహాలో సీసీటీవీ కి చిక్కాడు ఒక గుడి దొంగ.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

హర్యానాకు చెందిన రివారీ డిస్ట్రిక్ట్ లో హనుమంతుడి గుడిలో దొంగతనం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు సీసీటీవీ కెమెరా చెక్ చేయగా అందులోని ఒక దొంగ వింతైన దొంగతనాన్ని చేశాడు. దొంగతనం చేసినా కూడా తనకి ఒక స్టైల్ ఉండాలి అనుకున్నాడు అనుకుంట. దేవుడి మీద భక్తి ఉండాలి అని నమ్మిన ఆ దొంగ ఏం చేసాడంటే..

ముందుగా దేవుడిని నమస్కరించుకుని తర్వాత హనుమాన్ చాలిస్ చదివాడు. అంతేకాదు తన వంతు ఉడత సహాయంగా హుండీలో పది రూపాయలు దానం కూడా చేశాడు. ఆగండి ఆ దొంగ మంచివాడు, పాపం దేవుడి మీద భక్తితో మారిపోయాడు అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్టే.. మీరు అనుకున్నట్టే సిసిటివి కెమెరాల్లో చూసిన పోలీసులు కూడా పప్పులో కాలు వేశారు. తర్వాత పార్ట్ చూసిన తర్వాత అవాక్కయ్యారు.

ఈ దొంగకి దేవుడంటే అపారమైన భక్తి కారణంగా తాను చేసిన తప్పుల్ని క్షమించమని దేవుడిని ముందుగానే కోరుకున్నాడు. అదేవిధంగా హనుమాన్ చాలిస్ చదివి, పది రూపాయల హుండీలో వేశాడు. ఇంకేముంది, ఆ తరువాత తను ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకున్నాడో ఏంటో దొంగ.. చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారేమో అని గమనించాడు. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న దొంగ, హుండీని పగలగొట్టడం మొదలుపెట్టాడు. హుండీలో నుంచి ఏకంగా రూ. 5000 దొంగతనం చేసి దేవుడికి దండం పెట్టి చెక్కేసాడు.

పూజారి చెప్పిన విషయాలు:

అయితే దొంగతనం చేసిన మరుసటి రోజు. పూజారి ఎప్పటిలాగే ఉదయాన్నే గుడి తలుపులు తెరిచి పూజకు సిద్ధం చేయాలి అనుకుంటాడు. కానీ గుడి తలుపులు తెరిచిన పూజారికి అనుకోని సంఘటన ఎదురయింది. హుండీ బద్దలు కొట్టి ఉండడం గమనించాడు. అయితే సుమారు 5000 రూపాయలు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సిసిటీవీ కెమెరాలో చెక్ చేసిన పోలీసులకు దొంగ చేసిన నిర్వాకం బయటపడింది. దొంగతనానికి వచ్చిన వాడు నేరుగా దొంగతనం చేసి వెళ్లకుండా దేవుడు మీద భక్తి ఉన్నట్టు, హనుమాన్ చాలిస్ చదివి మరి దొంగతనం చేయడం అందరికీ వింతగా అనిపిస్తుంది.

ఎక్కువ అవుతున్న దొంగతనాలు:

హర్యానాలోని ఇప్పుడు జరిగిన దొంగతనం తరహాలోనే, పలుచోట్ల దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. గుడి, బడి, ఇళ్లల్లోని బ్యాంక్ ఇలా తేడా లేకుండా విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తున్నారు. పక్కట్ బందీగా సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పటికీ, దొంగలు మాత్రం తమ పనిని సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 

మరోవైపు పోలీసులు ఆ దొంగల్ని పట్టుకోలేక నానా తంటాలు పడుతున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ, దొంగతనం చేసిన వారు రికార్డ్ స్థాయిలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. 

ఒక వీడియో వైరల్ గా మారింది. బయట చల్లగాలిలో పడుకున్న వృద్ధులను లేపి మరి, దొంగలు తాళాలు తీసుకుని, ఇంట్లోకి వెళ్లి, దర్జాగా దొంగతనం చేసుకొని బయటికి వచ్చిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత నుంచి బయట పడుకునేందుకు చాలా మంది భయపడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ దొంగతనం చేసేందుకు కేవలం ఆకలి అనే బాధ కారణమైతే, నిజాయితీగా కష్టపడి సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. దొంగతనాలు చేసేవారు కష్టపడి సంపాదించిన వారి గురించి కూడా ఆలోచించాలి.