దొంగతనానికి వచ్చి నోటు రాసిపెట్టిన దొంగ

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగతనాలు ఎక్కువగా అయిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడం చూసి విచ్చలవిడిగా దొంగలు తమ కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి ఒక సంఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.  బ్యాంకుని పొగిడిన దొంగ:  తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇటీవల ఆగస్టు 31న ఒక దొంగతనానికి పాల్పడ్డాడు ఒక దొంగ. చాలా బాగా స్కెచ్ వేసి రాత్రి సమయంలో బ్యాంకు లాక‌ర్ పగలకొట్టేందుకు ప్రయత్నించాడు. పాపం ఎంతసేపటికి బ్యాంకు లాక‌ర్ ఓపెన్ […]

Share:

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగతనాలు ఎక్కువగా అయిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడం చూసి విచ్చలవిడిగా దొంగలు తమ కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి ఒక సంఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 

బ్యాంకుని పొగిడిన దొంగ: 

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇటీవల ఆగస్టు 31న ఒక దొంగతనానికి పాల్పడ్డాడు ఒక దొంగ. చాలా బాగా స్కెచ్ వేసి రాత్రి సమయంలో బ్యాంకు లాక‌ర్ పగలకొట్టేందుకు ప్రయత్నించాడు. పాపం ఎంతసేపటికి బ్యాంకు లాక‌ర్ ఓపెన్ అవ్వకపోవడంతో, దొంగతనాన్ని విరమించుకున్నాడు దొంగ. అంతే కాదు, దొంగతనం చేసేందుకు కూడా వీలు పడకుండా, మంచి సెక్యూరిటీ సిస్టం పెట్టినందుకు బ్యాంకును పొగుడుతూ ఒక నోట్ కూడా రాసి పెట్టాడు. 

నా ఫింగర్ ప్రింట్లు మీరు వెతికినా దొరకవు. అయితే ఒక మాట, ఇది చాలా మంచి బ్యాంకు, ఒక్క రూపాయి కూడా చేతికి అందకుండా చేశారు.. ఏం దొంగతనం చేయలేదు కాబట్టి నన్ను పట్టుకోడానికి ప్రయత్నించొద్దు.. అంటూ తాను ఎటువంటి దొంగతనం చేయలేదని చెబుతూనే, బ్యాంకులో ఉన్న సెక్యూరిటీ సిస్టం చాలా దృఢంగా ఉందని, ఒక్క రూపాయి కూడా చేతికి దొరకకుండా చేశారని నిరాశతో దొంగ, ఆ నోటు రాసి వెళ్లిపోయాడు. 

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దొంగతనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే దొంగ చాలా పకడ్బందీగా ఫేస్ కి మాస్క్ వేసుకోవడంతో, ఆ దొంగ ఎవరో కనిపెట్టడం కష్టం అంటున్నారు. కానీ తప్పకుండా ఆ దొంగ మాత్రం లోకల్ మనిషి అని.. బ్యాంక్ ఎంప్లాయ్ కాదని స్పష్టం చేశారు పోలీసులు. అయితే దొంగతనం అనంతరం, బ్యాంకులో కూడా ఎటువంటి దోపిడీ జరగలేదని, విలువైన వస్తువులు అలాగే ఉన్నాయని, దొంగ ఏమీ దోచుకుపోలేదని బ్యాంక్ ఎంప్లాయిస్ చెప్పడం జరిగింది. 

ఇటీవల సినిమా డైలాగులు రాస్తూ పట్టుబడిన దొంగ: 

పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం, విజయ్ యాదవ్ అలాగే సోను యాదవ్ అనే ఇద్దరు దొంగలు ఇండోర్ జునా రిసాల లొకాలిటీలో నివాసం ఉంటున్న కార్పొరేటర్ అన్వర్ కద్రి అనే వ్యక్తి ఇంట్లోకి ఆదివారం రాత్రి దొంగతనానికి వెళ్లారు. కార్పొరేటర్ కాబట్టి ఆయన ఇంట్లో ఎంతో కొంత డబ్బు మాట దొరుకుతుందని ఆశతో ఆ ఇద్దరు దొంగలు ఇల్లంతా జల్లెడ పట్టారు. 

అయితే ఇదే క్రమంలో ఇంట్లో దొరికిన కొంత డబ్బు, దొరికిన కొన్ని నగలు పట్టుకుని దొంగ సోను యాదవ్ ఇంట్లో నుంచి బయటపడ్డాడు. అయితే ఇదే క్రమంలో విజయ్ మరి కొంత డబ్బు, నగలు పట్టుకుని ఇంట్లో నుంచి బయలుదేరుతుండగా, అనుకోకుండా ఆ ఇంట్లో కనిపించిన కొన్ని గోడల మీద ఏదో ఒకటి రాయాలి అనే ఆలోచన తట్టిందట, ఇంకేముంది, ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా ఆ ఇంటి గోడల మీద అమితాబచ్చన్ సినిమా డైలాగులు కొన్ని గోడల మీద చెక్కడానికి ప్రయత్నిస్తాడు. ఒక ఆర్టిస్టులాగా గోడల మీద ‘అగ్నిపత్’ అని రాసి, మరిన్ని డైలాగ్స్ రాస్తున్న క్రమంలో, హఠాత్తుగా ఆ దొంగ విజయ్ చేయి ఆ పక్కనే ఉన్న గాజు వస్తువు మీద పడింది.  

ఇంకేముంది వెంటనే ఆ గాజు వస్తువు కింద పడి పగిలిపోయింది. ఇదే క్రమంలో గాఢ నిద్రలో ఉన్న ఇంటి వాళ్ళు, పగిలిన గాజు శబ్దం చప్పుడు విని లెగిసి ఏం జరిగిందో అని రాగా, విజయ్ అనే దొంగ వాళ్ళ గోడల మీద చెక్కుతున్న అమితాబచ్చన్ డైలాగులు కనిపిస్తాయి. వెంటనే ఆ కుటుంబం, దొంగ విజయ్ గురించి పోలీసులకు సమాచారం అందించిన అనంతరం, పోలీసులు ఇంటికి వచ్చి, జరిగిందంతా తెలుసుకుని, ఆ దొంగ విజయ్ ని అరెస్ట్ చేయడం జరిగింది.