అమితాబ్ డైలాగ్స్ రాస్తూ దొరికిపోయిన దొంగ

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయినట్టే, ప్రస్తుతం దొంగతనానికి వచ్చిన దొంగ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లో నగలు, డబ్బు తీసుకువెళ్లే క్రమంలో, సరదాగా ఇంటి గోడల మీద అమితాబచ్చన్ డైలాగ్స్ రాసి వెళ్లిపోదామనుకున్నాడు, పాపం దొరికిపోయాడు ఆ దొంగ.  అసలు ఏం జరిగింది:  పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం, విజయ్ యాదవ్ అలాగే సోను యాదవ్ అనే ఇద్దరు దొంగలు ఇండోర్ జునా […]

Share:

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయినట్టే, ప్రస్తుతం దొంగతనానికి వచ్చిన దొంగ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లో నగలు, డబ్బు తీసుకువెళ్లే క్రమంలో, సరదాగా ఇంటి గోడల మీద అమితాబచ్చన్ డైలాగ్స్ రాసి వెళ్లిపోదామనుకున్నాడు, పాపం దొరికిపోయాడు ఆ దొంగ. 

అసలు ఏం జరిగింది: 

పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం, విజయ్ యాదవ్ అలాగే సోను యాదవ్ అనే ఇద్దరు దొంగలు ఇండోర్ జునా రిసాల లొకాలిటీలో నివాసం ఉంటున్న కార్పొరేటర్ అన్వర్ కద్రి అనే వ్యక్తి ఇంట్లోకి ఆదివారం రాత్రి దొంగతనానికి వెళ్లారు. కార్పొరేటర్ కాబట్టి ఆయన ఇంట్లో ఎంతో కొంత డబ్బు మాట దొరుకుతుందని ఆశతో ఆ ఇద్దరు దొంగలు ఇల్లంతా జల్లెడ పట్టారు. 

అయితే ఇదే క్రమంలో ఇంట్లో దొరికిన కొంత డబ్బు, దొరికిన కొన్ని నగలు పట్టుకుని దొంగ సోను యాదవ్ ఇంట్లో నుంచి బయటపడ్డాడు. అయితే ఇదే క్రమంలో విజయ్ మరి కొంత డబ్బు, నగలు పట్టుకుని ఇంట్లో నుంచి బయలుదేరుతుండగా, అనుకోకుండా ఆ ఇంట్లో కనిపించిన కొన్ని గోడల మీద ఏదో ఒకటి రాయాలి అనే ఆలోచన తట్టిందట, ఇంకేముంది, ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా ఆ ఇంటి గోడల మీద అమితాబచ్చన్ సినిమా డైలాగులు కొన్ని గోడల మీద చెక్కడానికి ప్రయత్నిస్తాడు. ఒక ఆర్టిస్టులాగా గోడల మీద ‘అగ్నిపత్’ అని రాసి, మరిన్ని డైలాగ్స్ రాస్తున్న క్రమంలో, హఠాత్తుగా ఆ దొంగ విజయ్ చేయి ఆ పక్కనే ఉన్న గాజు వస్తువు మీద పడింది.  

ఇంకేముంది వెంటనే ఆ గాజు వస్తువు కింద పడి పగిలిపోయింది. ఇదే క్రమంలో గాఢ నిద్రలో ఉన్న ఇంటి వాళ్ళు, పగిలిన గాజు శబ్దం చప్పుడు విని లెగిసి ఏం జరిగిందో అని రాగా, విజయ్ అనే దొంగ వాళ్ళ గోడల మీద చెక్కుతున్న అమితాబచ్చన్ డైలాగులు కనిపిస్తాయి. వెంటనే ఆ కుటుంబం, దొంగ విజయ్ గురించి పోలీసులకు సమాచారం అందించిన అనంతరం, పోలీసులు ఇంటికి వచ్చి, జరిగిందంతా తెలుసుకుని, ఆ దొంగ విజయ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 

పాపం దొంగతనానికి వచ్చిన వాళ్ళు దొంగతనం చేసుకోకుండా, ఇంటి గోడల మీద ఆకర్షితుడై ఒక ఆర్టిస్టులాగ ఫీలయ్యి, అమితాబచ్చన్ డైలాగులు రాసి, డబ్బుతో పరార్ అవుదాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా పోలీసులు చేతికి చిక్కి ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళాడు. 

దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి: 

ఎక్కడ చూసినా ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు ఇంటి చుట్టూ అమరుస్తున్నప్పటికీ, ఆఫీసులు చుట్టూ అమరుస్తున్నప్పటికీ, దొంగలు మాత్రం తాము చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు, డబ్బును దోచుకుని పోతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు బయట చల్లగా ఉందని పడుకోగా, హఠాత్తుగా దొంగలు వచ్చి వారిని నిద్రలో నుంచి లేపి మరి, ఇంటి తాళాలు, బీరువా తాళాలు తీసుకొని, వారి కళ్ళ ముందే వారి కొన్నదంతా దోచుకుని పోయారు దొంగలు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ, ప్రస్తుతం ఆ దొంగల గురించి ఇంకా వేటాడుతూనే ఉన్నారు పోలీసులు.. అందుకే జాగ్రత్త, నిద్రపోతున్నప్పుడు తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకొని, తాళాలు వేసుకుని, నిద్రపోవడం మేలు అంటున్నారు పోలీసులు.