Pollution: కాలుష్య నగరాల జాబితాలో భారత్ నగరాలు

Pollution: 2023 సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా శాస్త్రవేత్తలు (scientists) గుర్తించారు. ముఖ్యంగా కాలాలు మారుతున్నప్పటికీ ఎడతెరపలేని ఎండ కారణంగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఎడారుల మారుతున్నాయి. దీనంతటికీ కారణం కేవలం కాలుష్యం (Pollution). దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ఏర్పడుతోంది. అంతేకాకుండా రాను రాను భూమి (Earth) మీద మనుగడ సాగించడం కూడా కష్టమే అంటూ వాతావరణాని (Climate)కి సంబంధించిన కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు (scientists) వివరించడం జరిగింది. ఈ […]

Share:

Pollution: 2023 సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా శాస్త్రవేత్తలు (scientists) గుర్తించారు. ముఖ్యంగా కాలాలు మారుతున్నప్పటికీ ఎడతెరపలేని ఎండ కారణంగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఎడారుల మారుతున్నాయి. దీనంతటికీ కారణం కేవలం కాలుష్యం (Pollution). దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ఏర్పడుతోంది. అంతేకాకుండా రాను రాను భూమి (Earth) మీద మనుగడ సాగించడం కూడా కష్టమే అంటూ వాతావరణాని (Climate)కి సంబంధించిన కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు (scientists) వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన కొన్ని నగరాలు (City), అత్యధిక కాలుష్య నగరాల (City) జాబితాలో చేరాయి. 

కాలుష్య నగరాల జాబితాలో భారత్ నగరాలు: 

ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution)కి పెట్టింది పేరుగా మారిపోయింది. న్యూ ఢిల్లీ (New Delhi) తో పాటు, కోల్ కత్త (Kolkata), ముంబై (Mumbai) లో కూడా కాలుష్యం (Pollution) రోజురోజుకు ఎక్కువైపోతున్న క్రమం కనిపిస్తోంది. శీతాకాలం (Winter) మొదలైన సమయానికి దట్టమైన మంచితోపాటు, కాలుష్యం (Pollution) ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ (New Delhi), పాకిస్తాన్ దేశంలో లాహోర్ (Lahore), కోల్ కత్త (Kolkata), ముంబై వంటి ప్రధాన నగరాల (City)లో ఎయిర్ క్వాలిటీ రేట్ పూర్తిగా పడిపోయింది. ప్రజలను బయటికి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. శీతాకాలం (Winter)లో ఎక్కువ గాలులు లేకపోవడం వల్ల, ఎక్కడ కాలుష్యం (Pollution) అక్కడే నిలిచిపోయి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణంగా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఎయిర్ క్వాలిటీ, AQI 0-50 వరకు ఉంటే, కాలుష్యం (Pollution) లేనట్టు. AQI 400 నుంచి 500 మధ్యలో ఉంటే, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నట్టు. ఇప్పుడు న్యూఢిల్లీ (New Delhi)లో AQI 483, పాకిస్తాన్ లాహోర్ లో AQI 371, తర్వాత కోల్ కత్త (Kolkata)లో AQI 206గా ఉండగా ఈ మూడు నగరాలు (City) అత్యధిక కాలుష్యం (Pollution)తో నిండిన నగరాలుగా (City) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తరువాత బంగ్లాదేశ్, చైనా, కువైట్ కి చెందిన నగరాలు (City) అత్యధిక కాలుష్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కాలుష్యం (Pollution) కారణంగా ఢిల్లీలో జరగాల్సిన బంగ్లాదేశ్ – శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ కూడా వచ్చే శుక్రవారంకి వాయిదా పడింది. 

ఆరోగ్యం జాగ్రత్త: 

ప్రపంచంలోని అనేక నగరాల్లో (City) కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున, అటువంటి కలుషిత (Pollution) వాతావరణంలో వ్యాయామం (Exercise) చేయడం లేదా నడవడం వల్ల కలిగే సంభావ్య ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

కలుషిత (Pollution) వాతావరణంలో వ్యాయామం (Exercise) చేయడం అంటే గాలిలో ఉండే హానికరమైన కణాలు మరియు కాలుష్య కారకాలను అధిక స్థాయిలో పీల్చడం. వాహనాల నుండి వెలువడే పొగ, ధూళి మరియు కాలుష్య కారకాలు వంటి ఈ కణాలు మన ఊపిరితిత్తుల (Lungs)లోకి లోతుగా చొచ్చుకుపోయి, వాపు, ఏదో శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఎక్కువ సమయం కాలుష్యం (Pollution)లో వ్యాయామం (Exercise) చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఇప్పటికే ఉన్న శ్వాసకోశ పరిస్థితుల తీవ్రతరం చేయడం.. అంతేకాకుండా ముఖ్యంగా గుండెకు సంబంధ వ్యాధులకు కూడా దారితీయవచ్చు. 

కలుషితమైన (Pollution) గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల (Lungs) పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం (Exercise) చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కలుషితమైన (Pollution) గాలిని ఎక్కువ మొత్తంలో పీల్చుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెల్లమెల్లగా, ఇది ఊపిరితిత్తుల (Lungs) పనితీరును తగ్గిస్తుంది. ఆస్తమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.