భారతదేశంలో బెస్ట్ యూనివర్సిటీలు ఇవే.. 

విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం మంచి యూనివర్సిటీ ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. మంచి యూనివర్సిటీలో సీటు సంపాదిస్తే, తాము మంచి ఉన్నత స్థానానికి వెళ్లొచ్చని, తమ కలలు నెరవేర్చుకోవచ్చని విద్యార్థులు ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024లో ముందంజలో ఉన్న కొన్ని భారతదేశ బెస్ట్ యూనివర్సిటీలు ఏమిటో, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.. మళ్లీ చోటు దక్కించుకున్న IISc:  బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), UK ఆధారిత, టైమ్స్ హయ్యర్ […]

Share:

విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం మంచి యూనివర్సిటీ ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. మంచి యూనివర్సిటీలో సీటు సంపాదిస్తే, తాము మంచి ఉన్నత స్థానానికి వెళ్లొచ్చని, తమ కలలు నెరవేర్చుకోవచ్చని విద్యార్థులు ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024లో ముందంజలో ఉన్న కొన్ని భారతదేశ బెస్ట్ యూనివర్సిటీలు ఏమిటో, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం..

మళ్లీ చోటు దక్కించుకున్న IISc: 

బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), UK ఆధారిత, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం నుండి ఉత్తమమైన విద్యా ఇన్‌స్టిట్యూట్ గా మళ్లీ ముందంజలోనే ఉంది. ర్యాంక్‌లో దేశం మెరుగుదలను సాధించి, రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గతేడాది భారత్‌ నుంచి కేవలం 75 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. 

స్థానాన్ని దక్కించుకున్న ఇన్స్టిట్యూట్లు: 

2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా మారింది. గతేడాది భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా 2017 తర్వాత మొదటిసారిగా గ్లోబల్ 250 ర్యాంక్‌ లో చోటు దక్కించుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లు, భారతదేశం నుంచి, జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్న ఇన్స్టిట్యూట్ లు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌ మధ్యలో ఉన్నాయి. 

నిరసనకు దిగిన టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్: 

ప్రస్తుతం విడుదల చేసిన ర్యాంకింగ్ లను వ్యతిరేకిస్తూ చాలా భారత దేశ టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ర్యాంకింగ్ ల గురించి తమకు అభిప్రాయాలు ఉన్నాయని.. ర్యాంకింగ్ల మధ్య తారుమారు జరిగినా వైనం కనిపిస్తుందని, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024ను కూడా బాయ్ కట్ చేస్తున్నట్లు ప్రకటించాయి కొన్ని IIT’s. 

2024 జాబితాలో చోటు దక్కించుకున్న విశ్వవిద్యాలయాలు ఇవే:

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు

అన్నా యూనివర్సిటీ

జామియా మిలియా ఇస్లామియా

మహాత్మా గాంధీ యూనివర్సిటీ

శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్

అలగప్ప విశ్వవిద్యాలయం

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం

బనారస్ హిందూ యూనివర్సిటీ

భారతియార్ విశ్వవిద్యాలయం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్

జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ

కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, భువనేశ్వర్

మాల్వియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్

పంజాబ్ విశ్వవిద్యాలయం

సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్

థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

అమిటీ యూనివర్సిటీ

అమృత విశ్వ విద్యాపీఠం

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ

ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ

ఢిల్లీ విశ్వవిద్యాలయం

ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పూణే

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్

ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (JNTUA)

జేపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

JSS అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

కలశలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి

యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్

సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం

శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం

శిక్ష ‘ఓ’ అనుసంధాన్