భువనేశ్వరీని నాయుడు గురించి ప్రశ్నించిన వైఎస్ఆర్సిపి

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆస్తులు గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. నిజానికి స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి, ఫైబర్ నెట్ స్కామ్ గురించి, 2016లో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. అంతేకాకుండా భువనేశ్వరి నాయుడుని పెళ్లి చేసుకునే క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడుకి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని.. మరి ఇప్పుడు ఇంత మొత్తంలో ఆస్తి ఎలా సంపాదించారు అని ప్రశ్నలు కురుస్తున్నాయి..  […]

Share:

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆస్తులు గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. నిజానికి స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి, ఫైబర్ నెట్ స్కామ్ గురించి, 2016లో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. అంతేకాకుండా భువనేశ్వరి నాయుడుని పెళ్లి చేసుకునే క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడుకి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని.. మరి ఇప్పుడు ఇంత మొత్తంలో ఆస్తి ఎలా సంపాదించారు అని ప్రశ్నలు కురుస్తున్నాయి.. 

ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సిపి: 

స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ కి తరలించిన చంద్రబాబు నాయుడు ఆస్తులు గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఒకప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్న సమయంలో, అసెంబ్లీలో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. 2016లో అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి, అప్పుడే చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ స్కామ్ గురించి మాట్లాడిన క్రమం కనిపిస్తుంది. 

ఇక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు స్కామ్ విషయానికి వస్తే అన్ని స్కాములలో కన్నా, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చాలా పెద్దది అని అయితే నారా లోకేష్ విదేశాలలో చదువుకునే స్కామ్ ఎలా చేయాలో చాలా బాగా నేర్చుకున్నాడని ప్రస్తావించారు. 

మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం రెండు ఎకరాల ఆస్తి ఉన్నట్లు ఒకప్పుడు భువనేశ్వరి వెల్లడించారు. అయితే తమ కంపెనీ షేర్లలో రెండు శాతం షేర్లు అమ్మినప్పటికీ తమకి 400 కోట్లు వస్తాయని, ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయంటే, ప్రస్తుతం కంపెనీ నిక్కరు విలువ 20,000 కోట్లు అన్న ప్రస్తావన వచ్చింది. అంతేకాకుండా ఇంతగా ఆస్తులు కూడా పెట్టారంటే మరి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న బిజినెస్ లు, కంపెనీల ఆస్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి. 

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్: 

చంద్రబాబు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ అయిన శ్రీనివాస్ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా పలుసార్లు ప్రశ్నించడం జరిగిందని అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకి ఇటీవల ఐటీ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే అని ఆయన చెప్పుకోచారు. అయితే 100 కోట్ల స్కాం గురించి ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత నాయుడు పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి స్కాంలో కీలక వ్యక్తులుగా నిర్ధారించడం జరిగింది. ఇతర కేసుల విషయంలో కూడా నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ హస్తము ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడడం జరిగింది. 

అయితే పెద్ద మొత్తంలో రిసిప్ట్స్ అలాగే ట్రాన్సాక్షన్ జరిగిన ఆధారాలు బయటపడినట్లు సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. శ్రీనివాస్ మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఒప్పుకోకపోగా, ప్రస్తుతం ప్రభుత్వ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పిన విధంగానే తాను చేస్తున్నట్లు వింతగా వాదించడం కూడా కనిపించిందని సిఐడి చీఫ్ అయిన సంజయ్ చెప్పుకొచ్చారు. 

2018 నుంచి కూడా జిఎస్టి ద్వారా బయటపడిన కొన్ని ముఖ్య అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని, అంతేకాకుండా జిఎస్టి విషయంపై 2021లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా సిఐడి వారు వెల్లడించారు. ఇందులో పై ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు వాళ్ళు గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కింద పని చేసే శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి మనోజులకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, వారు విదేశాలకు పారిపోయారని ఆయన వెల్లడించారు.