దావూద్‌ని ఇంటర్వ్యూ చేసిన మ‌హిళ గురించి తెలుసా?

ఒకసారి కాదు రెండు సార్లు కాదు మరెన్నో సార్లు దావూద్ ఇబ్రహీం ను ఇంటర్వ్యూ చేసిన ఘనత షీలభట్ కి దక్కింది. తను ఎన్నోసార్లు దావూద్ ఇబ్రహీం ని కలిసింది. అంతేకాదు, డిన్నర్ చేసింది, ముచ్చట్లు కూడా చెప్పుకునేవారు. అంతేకాదు ఏకంగా దావూద్ ఇబ్రహీం ని కలవడానికి దుబాయ్ కూడా వెళ్లారు. ఎవరు ఈ షీలా బట్, అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తను అన్నిసార్లు ఇబ్రహీంని కలిసి ఏం మాట్లాడింది?  వివరాల్లోకి వెళ్దాం:  ముంబైలో […]

Share:

ఒకసారి కాదు రెండు సార్లు కాదు మరెన్నో సార్లు దావూద్ ఇబ్రహీం ను ఇంటర్వ్యూ చేసిన ఘనత షీలభట్ కి దక్కింది. తను ఎన్నోసార్లు దావూద్ ఇబ్రహీం ని కలిసింది. అంతేకాదు, డిన్నర్ చేసింది, ముచ్చట్లు కూడా చెప్పుకునేవారు. అంతేకాదు ఏకంగా దావూద్ ఇబ్రహీం ని కలవడానికి దుబాయ్ కూడా వెళ్లారు. ఎవరు ఈ షీలా బట్, అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తను అన్నిసార్లు ఇబ్రహీంని కలిసి ఏం మాట్లాడింది? 

వివరాల్లోకి వెళ్దాం: 

ముంబైలో అనేకమైన బాంబు కుట్రలకు కారణమైన దావూద్ ఇబ్రహీం ను ఇంటర్వ్యూ చేసిన ఘనత జర్నలిస్ట్ షీలా బట్కి దక్కింది. నాలుగు దశాబ్దాల జర్నలిజం ప్రయాణంలో తాను ఎన్నోసార్లు ఇబ్రహీంని కలిసినట్లు. అనేక విషయాలు తెలుసుకున్నట్లు ఆమె చాలా వివరంగా చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో, షీలా బట్ ఇంటర్వ్యూ చేస్తుండగా కరీం లాలాతో దిగిన ఫోటోను చూసిన దావూద్ ఇబ్రహీం, తానే స్వయంగా తనని ఇంటర్వ్యూ చేయమని షీలాభట్ని పిలవడం జరిగింది. అంతేకాదు, ఆ ఇంటర్వ్యూలో కరీం లాలా మనుషులు, అమ్మాయిల్ని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో రాయమని తనతో దావూద్ ఇబ్రహీం చెప్పినట్లు షీలా వివరంగా చెప్పారు.

అయితే దావూద్ ఇబ్రహీం ఉన్న చోటు తెలియకూడదు అని, ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన తమని ఒక ప్రత్యేకమైన ప్లేస్ కి రమ్మన్నట్లు, తరువాత దావూద్ వాళ్ళ మనుషులు వచ్చి కారులో తమని వేరే ప్లేస్ కి తీసుకువెళ్లినట్లు, షీలా చెప్పుకొచ్చారు. తర్వాత ఇంకెన్నో ఇంటర్వ్యూల కోసం షీలానే ఇబ్రహీని కలిసేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే తాను కొన్నిసార్లు తన భర్తని తీసుకొని దావూద్ ఇబ్రహీం ఇంటర్వ్యూ కోసం వెళ్లినట్లు, అయితే మొదట్లో తాను ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పుకొచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత దావూద్ ఇబ్రహీం స్వయంగా వారిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి పిలిచారు అని వివరించింది. 

ఇంటర్వ్యూ కోసం దుబాయ్ వరకు వెళ్ళాము: 

1985 సమయంలో దావూద్ ఇబ్రహీం భారతదేశంలో ఉన్నప్పుడు తాము ఇంటర్వ్యూ చేయగలిగాము అని, ఆ తర్వాత రెండు , మూడు సంవత్సరాలు కాంటాక్ట్ అనేది లభించలేదని షీలా చెప్పుకొచ్చారు. అయితే తర్వాత మళ్లీ 1987లో వారికి ఇబ్రహీం నుంచి పిలుపు వచ్చింది అని, కానీ ఇప్పుడు వాళ్లు ఇంటర్వ్యూ కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి పడే కష్టంతో పోలిస్తే, వాళ్లు మూడు వేల రూపాయలు ఖర్చుపెట్టి దావూద్ ఇబ్రహీం ని కలవడానికి దుబాయ్ వెళ్ళామనే బాధ ఎక్కువగా అనిపించిందని షీలా బట్ తన మాటల్లో చెప్పారు. అయితే అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వారు 1988లో దుబాయ్ వెళ్లడం జరిగింది. 

మొదటి రోజు ఇంటర్వ్యూ తీసుకునేందుకు దావూద్ ఇబ్రహీం దగ్గరకు వెళ్లిన తర్వాత, ఆయన ఇంటర్వ్యూకి నిరాకరించి, వాళ్లతో డిన్నర్ చేయమని కోరినట్లు, షీలా చెప్పారు. అయితే మరుసటి రోజు కూడా అదే విధంగా ఇంటర్వ్యూ పరంగా కాకుండా నార్మల్ విషయాలు చాలా మాట్లాడారట దావూద్. అంతేకాకుండా, ఆయన ఒకానొక సమయంలో వారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మోడలింగ్ చేస్తున్నట్లు కూడా సమాచారం. అయితే దుబాయ్ లో మూడవ రోజు కూడా దావూద్ ఇబ్రహీం ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్లగా, ఇంటర్వ్యూ సాఫీగా జరిగినప్పటికీ, రికార్డు చేయడానికి వారు నిరాకరించారట. 

అయితే ఆమె చెప్పిన దాని ప్రకారం తన దగ్గర ఉన్న డైరీలో ఇప్పటికీ ఎంతోమంది మాఫియా డాన్లకు  సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నట్లు తెలిపారు.