బీఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్య మళ్లీ మొదలైన వార్..!

తెలంగాణలో ఎన్నికల వేడి బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఫ్లెక్సీల కోసం కూడా అక్కడ కొట్టుకోవడం సంచలనాలకు దారితీస్తోందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా తాజాగా […]

Share:

తెలంగాణలో ఎన్నికల వేడి బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఫ్లెక్సీల కోసం కూడా అక్కడ కొట్టుకోవడం సంచలనాలకు దారితీస్తోందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా తాజాగా కరీంనగర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు నెలకొనగా.. ఆ గ్రామంలోకి కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ లేదంటూ ప్రతి ఊరిలో వెలసిన ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.

 ముఖ్యంగా రాష్ట్రంలోని 95% రైతులు మూడు ఎకరాల వరకు ఉన్న వారేనని.. అయితే వారికి ప్రభుత్వం అందించే మూడు గంటల ఉచిత విద్యుత్తు ఏమాత్రం సరిపోవడంలేదని.. అలాంటప్పుడు మీరు ఇచ్చే ఉచిత కరెంట్ అవసరం లేదు అంటూ..టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో మాత్రం కాస్త వైవిధ్యంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తమ గ్రామంలోకి ప్రవేశం లేదు.. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ.. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ ముద్రించిన ఫ్లెక్సీలు ఇక ఆయా గ్రామాల రైతుల పేరిట వెలిశాయి. 

ఇకపోతే ఒకవైపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతున్న క్రమంలోనే ఇంకొక వైపు ఫ్లెక్సీలు కూడా ఇలా ఎక్కడ చూసినా ఏర్పాటు చేయడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బుధవారం మధ్యాహ్నం నుండి ప్రతి గ్రామంలో వెలసిన ఈ ఫ్లెక్సీలు పలు సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ఇకపోతే రైతుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో.. కాంగ్రెస్ పార్టీపై వారు అసహనంగా ఉన్నారన్న సంకేతాలు పంపించడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏర్పాటు చేశారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం.. వీటిని ఏర్పాటు చేసింది రైతులు కాదు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ నాయకుడికి విరుద్ధంగా పెట్టిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు చించేసి పడేసిన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకోగా.. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పాటు అయిన ఫ్లెక్సీలను చూసి ఊగిపోయిన కాంగ్రెస్ నేత రోహిత్ రావు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.

దీంతో ఇప్పుడు ఈ  ఫ్లెక్సీల గోల మొదలై అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. మరొకవైపు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. తానా సభల్లో ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. ఇక తాజా పరిణామాలతో రేవంత్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆందోళన పై ఇప్పటి వేదికగా కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంత దుష్ప్రచారం చేసిన వచ్చేది అధికారంలోకి కాంగ్రెస్ అని.. ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ మీడియా సమావేశం అనంతరం ఉచిత విద్యుత్ పై చెలరేగుతున్న మాటల మంటలకు ఎక్కడ వరకు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి. మొత్తానికి అయితే అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య పోరు మరింతగా ముదురుతోంది అని చెప్పవచ్చు.