ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం కోసం కొత్త విధానాన్ని పరిశీలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో  ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం కోసం ఒక కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్నో రోగాలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ  కింద అందజేస్తున్న నగదు రహిత వైద్య సేవలపై సమీక్ష నిర్వహించడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమగ్ర సమావేశం నిర్వహించాలని ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు పిలుపునిచ్చారు. నూతన ఆరోగ్యశ్రీ విధానానికి […]

Share:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో  ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం కోసం ఒక కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్నో రోగాలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ  కింద అందజేస్తున్న నగదు రహిత వైద్య సేవలపై సమీక్ష నిర్వహించడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమగ్ర సమావేశం నిర్వహించాలని ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు పిలుపునిచ్చారు. నూతన ఆరోగ్యశ్రీ విధానానికి సంబంధించి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని  అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.   

తాజాగా ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆంకాలజీ బ్లాక్‌ను ప్రారంభించిన హరీశ్‌రావు బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ… కొత్త పాలసీని రూపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆరోగ్యశ్రీ సీఈవో విశాలచిని హరీశ్‌రావు ఆదేశించడం జరిగింది. ఇక ఈ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు రోగులకు అందించే సేవలపై మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటూ ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇప్పటికే జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఆరింటికి అనుమతి లభించినందుకు అధికారులను అభినందించారు. మరొకవైపు మూడు మెడికల్ కాలేజీల అనుమతి తుది దశకు చేరుకుందని త్వరలోనే వాటి అనుమతి కూడా పొందుతామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 సీట్లు కేటాయిస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుందని అదేవిధంగా అడుగులు ఆ వైపుగా వేస్తామని కూడా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బంగారు తెలంగాణతో పాటు ఆరోగ్యకరమైన తెలంగాణను చూడడమే ఆయన లక్ష్యంగా ఇలాంటి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు

 ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశయమైన ఆరోగ్య తెలంగాణ సాధనలో ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన మూడు మెడికల్ కాలేజీలు అనుమతులు చివరి దశలో ఉన్నాయని, సకాలంలో అప్ డేట్ చేయాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే ఉన్నందున, ఆరోగ్యశ్రీ సేవల సమీక్ష మరియు కొత్త వైద్య కళాశాలల స్థాపన రాష్ట్ర నివాసితుల మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి కీలకమైన దశలుగా పరిగణిస్తున్నారు.

ఇటీవల మంత్రి హరీష్ రావు ఆరోగ్యశ్రీ పథకంలోకి ఇంకొన్ని వ్యాధులను చేర్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి తెలంగాణలో మూడు డయాలసిస్ కేంద్రాల నుంచి 102 కు పెంచాము అని రాష్ట్రంలో దాదాపు 12,000 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో పదివేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తోంది అంటూ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించారు. అంతేకాదు దానిసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ఆసరా పింఛన్ తో పాటు ఉచిత బస్సు పాస్ కూడా ఇస్తున్నామని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 150 వరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరుగుతున్నాయని ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తోంది అంటూ ఆయన తెలిపారు. ఒక్క కిడ్నీ రోగుల కోసమే ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేస్తే అందులో ఒక డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.