ఢిల్లీ ఆర్డినెన్స్ కేసు.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు..!

కేంద్రంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని పథకాలు లేదా కొత్త ఆర్డినెన్స్ పై ప్రతిపక్ష పార్టీలు మొగ్గు చూపడం లేదని చెప్పాలి.  ఈ నేపథ్యంలోనే కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరపగా ఆర్డినెన్స్ రాజ్యాంగ పద్ధతిపై  కేజ్రివాల్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తులు వాదనలు వినేందుకు కేసు […]

Share:

కేంద్రంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని పథకాలు లేదా కొత్త ఆర్డినెన్స్ పై ప్రతిపక్ష పార్టీలు మొగ్గు చూపడం లేదని చెప్పాలి.  ఈ నేపథ్యంలోనే కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరపగా ఆర్డినెన్స్ రాజ్యాంగ పద్ధతిపై  కేజ్రివాల్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తులు వాదనలు వినేందుకు కేసు విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే . కానీ ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ పాల్వే,  కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహత తమ ఆరోపణలను వినిపించారు.

 మరొకవైపు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అయిన DERC విషయంలో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి కలసి కూర్చుని DERC చైర్ పర్సన్ పేరు పై నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం కూడా సూచించింది. ఇకపోతే పూర్తి వివరాలను మనం ఒకసారి గమనించినట్లయితే

తాజాగా ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ అధికారం విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను  సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయడం జరిగింది. సిజెఐ జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ,  జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టడం గమనార్హం. గురువారం దర్మాసనం చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టగా ఈ క్రమంలోనే కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.  ఇకపోతే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

అంతేకాదు ఈ పిటిషన్ పై తమ వైఖరిని కూడా తెలపాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇకపోతే ఢిల్లీలో పాలన సర్వీసులపై నియంత్రణ అధికారం స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుంది అని సుప్రీంకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును కూడా ఇచ్చింది.  ఇక మే నెలలో కీలక తీర్పును కూడా వెలువరించింది.  అయితే అధికారాల నియంత్రణ విషయంలో లెఫ్ట్నెంట్ గవర్నర్ ను  తుది మధ్యవర్తిగా మారుస్తూ కేంద్రం మే 19వ తేదీన ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.  కానీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది.  ఇకపోతే దీనిని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ను రద్దు చేయడంతో పాటు దానిపై మద్యంతర స్టే విధించాలని కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కానీ మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు కేంద్రానికి ఎల్జి కి నోటీసులు జారీ చేసింది.  ఈ నేపథ్యంలోని తాజాగా కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. మరి ఈ విషయంపై రాజ్యాంగ ధర్మాసనం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అని ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి కొన్ని రోజులు ఈ విషయంపై ధర్మాసనం పూర్తి స్పష్టత ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.