G20 కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర‌ప‌తి

ఢిల్లీలో శనివారం రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము నిర్వహించనున్న G20 ప్రత్యేక విందుకు, అన్ని క్యాబినెట్ మరియు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు మరియు ఇతర ప్రముఖ అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధానులు డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడలను కూడా ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. కొంతమందికి అందని ఆహ్వానం:  G20 సదస్సు కోసం దేశ దేశాల నుంచి వచ్చిన అధితులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు జరగడమే కాకుండా, శనివారం రాత్రి ప్రత్యేకమైన విందుని […]

Share:

ఢిల్లీలో శనివారం రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము నిర్వహించనున్న G20 ప్రత్యేక విందుకు, అన్ని క్యాబినెట్ మరియు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు మరియు ఇతర ప్రముఖ అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధానులు డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడలను కూడా ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.

కొంతమందికి అందని ఆహ్వానం: 

G20 సదస్సు కోసం దేశ దేశాల నుంచి వచ్చిన అధితులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు జరగడమే కాకుండా, శనివారం రాత్రి ప్రత్యేకమైన విందుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేకమైన విందు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిర్వహించనున్న సందర్భంలో, క్యాబినెట్ మరియు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు మరియు ఇతర ప్రముఖ అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధానులు డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం అందలేదు.

కాంగ్రెస్ చీఫ్, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జీ20 విందుకు ఆహ్వానం అందలేదు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితరులు ఈ విందులో పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే స్పష్టమైనది.

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని మళ్లీ ప్రత్యేక ఆకర్షణగా ప్రారంభించిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్, భారీ సామర్థ్యం కలిగిన భారత్ మండపంలోని మల్టీ-ఫంక్షన్ హాల్‌లో గాలా డిన్నర్ జరుగుతుంది. గాలా డిన్నర్‌తో పాటు ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందని, G20 ప్రత్యేక కార్యదర్శి (ఆపరేషన్స్) మరియు సమ్మిట్ కోసం కార్యకలాపాలు మరియు లాజిస్టిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న ముక్తేష్ పరదేశి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని దేశాల నాయకులకు వ్యక్తిగతంగా వేదిక వద్దకు స్వాగతం పలుకుతారని, అక్కడ వారికి శనివారం లంచ్ కూడా ఏర్పాటు చేస్తారని అధికారులు తెలిపారు. 

G20 ముఖ్య ఉద్దేశాలు: 

అయితే ప్రస్తుతం సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమ్మిట్ ముఖ్యంగా, మల్టీ లేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రమాదాల నుంచి సమస్యలను పాండమిక్స్ను ఈజీగా ఎదుర్కొనే విధంగా, తమ దేశాలను మరింత బలంగా మార్చుకోవడమే కాకుండా, ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా బలంగా మారేలా, డెవలప్డ్ కంట్రీస్ గా మారేలా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల మీద చర్చించడమే, G-20 సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెప్టెంబర్ 8న ప్రత్యేకించి నరేంద్ర మోదీతో కొన్ని చర్చలు జరపడానికి హాజరుకానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించడం జరిగింది.

G20 సమ్మిట్ లో ముఖ్యంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, UK మరియు US ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ (EU). అతిథి దేశాలు: బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు UAE.