సేవలు అందించడానికి కిల్లర్ హీల్స్ అవసరం లేదన్న ప్రయాణికురాలు.. స్పందించిన విమానయాన సంస్థ..!

సాధారణంగా మనం విమానయానం చేసేటప్పుడు.. అక్కడ ఎయిర్ హోస్టెస్ మనకు ఏ విధంగా స్వాగతం పలుకుతారో అందరికీ తెలిసిందే.  సాధారణంగా మనం విమానయానం చేసేటప్పుడు.. అక్కడ ఎయిర్ హోస్టెస్ మనకు ఏ విధంగా స్వాగతం పలుకుతారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విమానయాన సంస్థ సిబ్బంది కష్టమర్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా.. వారు విమానంలోకి ఎక్కినప్పటి నుంచి లగేజ్ సర్దుకోవడం,  కూర్చోవడం, సీటు బెల్టు వరకు.. అలాగే  కావలసిన ఆహారాలు.. ఇలా ఒక్కటేమిటి వారు మళ్లీ సవ్యంగా గమ్యానికి […]

Share:

సాధారణంగా మనం విమానయానం చేసేటప్పుడు.. అక్కడ ఎయిర్ హోస్టెస్ మనకు ఏ విధంగా స్వాగతం పలుకుతారో అందరికీ తెలిసిందే. 

సాధారణంగా మనం విమానయానం చేసేటప్పుడు.. అక్కడ ఎయిర్ హోస్టెస్ మనకు ఏ విధంగా స్వాగతం పలుకుతారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విమానయాన సంస్థ సిబ్బంది కష్టమర్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా.. వారు విమానంలోకి ఎక్కినప్పటి నుంచి లగేజ్ సర్దుకోవడం,  కూర్చోవడం, సీటు బెల్టు వరకు.. అలాగే  కావలసిన ఆహారాలు.. ఇలా ఒక్కటేమిటి వారు మళ్లీ సవ్యంగా గమ్యానికి చేరే వరకు అన్ని వీరే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా వస్త్రధారణలో కంఫర్ట్ అవసరం అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు.  ఈ క్రమంలోనే తాజాగా విమానయాన సంస్థ సిబ్బంది వస్త్రధారణపై ఒక ప్రయాణికురాలు తన లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా పంచుకుంది.

ఆకాశ ఎయిర్లైన్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఆకాశ ఎయిర్ సంస్థ గత సంవత్సరం తమ సిబ్బందికి సంబంధించిన జాకెట్లు, స్నీకర్లు,  ఫ్యాంటులతో కూడిన సాంప్రదాయ యూనిఫామ్ ను తొలగించినప్పుడు ఈ నిర్ణయం కాస్త హెడ్ లైన్స్‌‌లో నిలిచింది. అయితే తాజాగా ఒక ప్రయాణికురాలు.. సిబ్బంది యూనిఫార్మ్ విషయంలో ఎయిర్ లైన్ చూపిన చొరవను ప్రశంసించడంతో ఆకాశ ఎయిర్లైన్స్ మళ్లీ వార్తల్లో నిలవడం గమనార్హం.  ఇక ఆ ప్రయాణికురాలు విమాన సిబ్బందికి చెందిన రెండు ఫోటోలను లింక్డ్ ఇన్ లో పంచుకోవడమే కాదు.. తన అభిప్రాయాన్ని కూడా పంచుకుంది.

ఆ ప్రయాణికురాలు తన లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా ఆకాశ ఎయిర్ లైన్స్ ను ప్రశంసిస్తూ ఇలా రాసుకుంది.. “నేను ఇటీవల ఆకాశ ఎయిర్ లైన్ సంస్ధ విమానంలో ఒక గమ్యానికి చేరుకోవాల్సి వచ్చి ప్రయాణించాను.. అక్కడ సిబ్బందిలో వచ్చిన మార్పులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అలాగే చాలా సంతోషించాను కూడా.. ఎయిర్ హోస్టెస్ కొత్త యూనిఫామ్ లో ఎంత సౌకర్యంగా ఉన్నారో చూపించే చిత్రాన్ని నేను ఇక్కడ జత చేశాను. విమానంలో విధులు నిర్వహించడానికి కిల్లర్ హీల్స్ అవసరంలేదు. సంపూర్ణ సౌకర్యం వారికి అవసరం ఉంటుంది.. ఇటువంటిది చాలా కాలంగా పెండింగ్లో ఉందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక అలాంటి నిబంధనలను ఎత్తివేసినందుకు ఆకాశ ఎయిర్ లైన్‌కు నా అభినందనలు.

ఈ ఆకాశ విమానయాన పరిశ్రమ  కార్యకలాపాలకు నా శుభాకాంక్షలు అంటూ లింక్డ్ ఇన్ యూజర్ దీక్ష మిశ్రా  అలియాస్ ఆకాశ విమానయాన ప్రయాణికురాలు రాసుకు వచ్చారు.  ఇకపోతే ఒక వారం క్రితమే ఈ పోస్టు షేర్ అయింది. ఇప్పటి వరకు దీనిని 28 వేల మంది లైక్ చేయడం మనం గమనించవచ్చు

ఇకపోతే దీనిపై ఆకాశ ఎయిర్ లైన్స్ వారు స్పందిస్తూ.. “చాలా ధన్యవాదాలు.. దీక్ష ! మేము సిబ్బందికి కంఫర్ట్ అవసరమని భావించాము. అత్యుత్తమ సేవలను అందించడానికి ఉన్నత స్థాయి సౌకర్యం అవసరమని మేము నమ్ముతున్నాము. వారు సౌకర్యంగా ఉంటేనే కదా ప్రయాణికులకు అత్యంత సౌకర్యాన్ని కలిగించగలరు. ఇక ప్రయాణికుల సౌకర్యమే మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. త్వరలోనే మీకు స్వాగతం పలకడానికి మేము ఎదురు చూస్తూ ఉంటాము” అని ఆకాశ ఎయిర్లైన్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఏది ఏమైనా తమ సిబ్బంది కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఆకాశ ఎయిర్లైన్స్ పై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడైనా సరే.. ప్యాసింజర్ కంఫర్ట్ గా ఉండడానికి కోరుకుంటారు. అలాంటి ప్యాసింజర్ ను కంఫర్ట్‌‌గా చూసే ఎయిర్ హోస్టెస్ కంఫర్ట్నెస్ కూడా చాలా అవసరం.. ఇప్పుడు ఆకాశ ఎయిర్లైన్స్ తీసుకున్న ఈ చొరవ ప్రశంసనీయమని చెప్పాలి.