మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన మంత్రి:  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రాష్ట్ర మంత్రి, జల్ […]

Share:

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన మంత్రి: 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రాష్ట్ర మంత్రి, జల్ శక్తి ప్రహ్లాద్ పటేల్ ట్విట్టర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించిన అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత పోస్ట్‌ను అనుకోకుండా డిలీట్ చేయడం కూడా జరిగింది. మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం మన మోదీ ప్రభుత్వం అంటూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించిన అప్డేట్ అందిస్తూ, ట్విట్టర్ పోస్ట్ ద్వారా అభినందనలు తెలిపారు మంత్రి.

రాష్ట్ర శాసనసభలలో, పార్లమెంటులోని మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు (33 శాతం) మహిళలకు రిజర్వ్ చేయాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కోరడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం కోటాలో సబ్‌ రిజర్వేషన్లను బిల్లు ప్రతిపాదిస్తోంది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించే అవకాశం ఉంటుంది. 

స్పందించిన కాంగ్రెస్: 

ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ, మహిళల రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చిరకాల కోరిక అంటూ మరొకసారి గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బిల్లు గురించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో చాలా బాగా చర్చించారని.. కొన్ని విషయాలలో సీక్రెట్స్ మైంటైన్ చేస్తూ పనిచేయడానికి బదులుగా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లడం చాలా మంచిది అని భావించారు మంత్రి.

రాజీవ్ గాంధీ, దేవెగౌడ, అటల్ బిహారీ వాజపేయి మరియు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అనేక ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్‌పై చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నించాయి, అయితే ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లోని పార్టీల ఆవేశం కారణంగా కాంగ్రెస్ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు రాలేకపోయింది అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ బిల్లును మే 6, 2008న రాజ్యసభలో ప్రవేశపెట్టింది అని మరొకసారి గుర్తు చేసింది కాంగ్రెస్.

రెండు సంవత్సరాల అనంతరం 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం పొందింది. దీనికి అనుకూలంగా 186 ఓట్లు మరియు వ్యతిరేకం ఒకటి వచ్చాయి. అయితే లోక్‌సభలో చర్చకు రాలేదు మహిళా రిజర్వేషన్ బిల్లు. అయితే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులు తొలగించలేని కారణంగానే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు యాక్టివ్‌గా ఉంది. 

ఇటీవల లేఖ రాసిన కవిత: 

పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని ఎంతగానో కృషి చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి రానున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించేందుకు ప్రాధాన్యతనివ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తన లేఖలో పిలుపునిచ్చారు.

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు. లింగ సమానత్వం, సమాన పాలనకు కీలకమైన అడుగు అయినప్పటికీ, బిల్లు చాలా కాలం పాటు వాయిదా పడుతూనే వస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా, ప్రతి ఒక్క పార్టీ స్పందించి, తమదైన శైలిలో తమ బిల్లును ఆమోదించేలా తమ వైపు నుంచి కృషి చేయాలని, తమ సపోర్ట్ కావాలని కోరుతోంది కవిత.