కర్ణాటక ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారిన ‘బెళగావి’ ప్రాంతం

కర్ణాటకలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ మరియు JDS పార్టీలు తమతమ వ్యవహారాలతో ఎన్నికల రణ రంగంలో పోట్ల గిత్తలలాగ పోటీపడనున్నాయి. అయితే ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఈ మూడు పార్టీలు ఇప్పుడు ‘బెళగావి’ ప్రాంతాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే బెంగళూరు అర్బన్ ప్రాంతం తర్వాత బెళగావి ప్రాంతంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ […]

Share:

కర్ణాటకలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ మరియు JDS పార్టీలు తమతమ వ్యవహారాలతో ఎన్నికల రణ రంగంలో పోట్ల గిత్తలలాగ పోటీపడనున్నాయి. అయితే ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఈ మూడు పార్టీలు ఇప్పుడు ‘బెళగావి’ ప్రాంతాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే బెంగళూరు అర్బన్ ప్రాంతం తర్వాత బెళగావి ప్రాంతంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. అయితే ఇక్కడ బోర్డర్ గొడవల సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి’ పార్టీ కొన్ని సీట్స్ లో జెండా ఎగురవేయనుంది. అంతే కాదు ఓట్లని కూడా భారీగా చీల్చే అవకాశం ఉంది, ఇది మూడు పార్టీలలో ఏ పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందో ప్రస్తుతానికి అంతు చిక్కని ప్రశ్న.

‘బెళగావి’ ప్రాంతంలో లింగాయత్ కమ్యూనిటీ అధిక శాతం ఉంటుంది. గడిచిన రెండు దశాబ్దాల నుండి ఈ ప్రాంతం బీజేపీ పార్టీకి కంచుకోటగా నిల్చింది. అయితే లింగాయత్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలని ఎత్తి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య బాగా బలపడింది. ఇప్పుడు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ప్రాంతం లో నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఏర్పడింది. అయితే ఇందులో శివసేన పార్టీ బలపర్చిన ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి(MES)’ పార్టీ 5 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రీసెంట్ గా వచ్చిన సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ప్రాంతాలలో ఎక్కువగా మరాఠీ మాట్లాడే మహారాష్ట్ర ప్రజలు ఉంటారు, ఇదే MES పార్టీకి బలంగా మారింది. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు బీజేపీ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ‘బెళగావి’ ప్రాంతం ఇప్పుడు గెలుస్తుందా లేదా అని అనుమానం పడే రేంజ్ కి పడిపోవడానికి కారణం ఇక్కడ న్యాయకత్వం లోపించడమే అని చెప్పాలి.

బీజేపీ పార్టీ తరుపున లింగాయత్ కమ్యూనిటీలో మొదటి నుండి ఆరాధ్య దైవ భావన ఉన్న లీడర్స్ ఉమేష్ కత్తి మరియు సురేష్ అంగడి వంటి నాయకులు చనిపోవడంతో వాళ్ళ న్యాయకత్వ లక్షణాలకు సరితూగే బీజేపీ నాయకులు దొరకకపోవడంతో బీజేపీకి లీడర్స్ కరువు అయ్యారు. అందుకే రెండు దశాబ్దాల నుండి బీజేపీ పార్టీ కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ ప్రాంతం ఇప్పుడు గెలుస్తుందా లేదా అని చూసే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఇక్కడ బీజేపీ పార్టీ నుండి మూడు సార్లు MLA గా గెలుపొందిన లక్ష్మణ్ సావడి రాజీనామా చేసి వెళ్లిపోవడం బీజేపీ పార్టీ కి భారీ స్థాయిలో ఓట్ షేర్ నష్టం వాటిల్లుతుంది అని చెప్పొచ్చు. మరోపక్క MES పార్టీ బోర్డర్ సమస్యని హైలైట్ చేస్తూ రోజురోజుకి బలపడుతుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య బీజేపీ పార్టీ ఇక్కడ గెలుస్తుందా, లేదా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది ఎంతో ఆసక్తికరంగా మారిన అంశం. మొత్తానికి ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఓట్ షేర్ భారీగా నష్టపొయ్యేది జాతీయ పార్టీలే, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఈ రెండు పార్టీలకే ఉన్నాయి, మరి చివరి నిమిషంలో JDS పార్టీ ఈ రెండు జాతీయ పార్టీలలో ఎవరికో ఒకరికి సపోర్టు చేసి ట్విస్ట్ ఇస్తుందో లేదో చూడాలి.